Health Tips: టమాటాలు, బీట్ రూటే కాదు ఇవి కూడా రక్తాన్ని పెంచుతాయి..
Health Tips: శరీరంలో సరిపడా రక్తం ఉంటేనే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. అయితే కొన్ని రకాల ఆహారాలు రక్తాన్ని పెంచడంలో ముందుంటాయి. అవేంటంటే..

బొప్పాయి ఆకురసం
బొప్పాయి (Papaya) మాత్రమే కాదు.. బొప్పాయి ఆకుల రసం కూడా ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుతుంది. పలు అధ్యయనాల ప్రకారం.. బొప్పాయి ఆకు రసం డెంగ్యూ రోగులకు ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి సహాయపడుతుందని కనుగొన్నారు. బొప్పాయి ఆకుల రసం తాగని వారు వాటి మాత్రలను కూడా ఉపయోగించవచ్చు.
దానిమ్మ
దానిమ్మలో పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants), నైట్రేట్లు (Nitrates) అధికంగా ఉంటాయి. ప్రతిరోజూ 500 మిల్లీ లీటర్ల దానిమ్మ రసం (Pomegranate juice) తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ వేగంగా పెరుగుతుంది. ఇది మంచి ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.
ఉల్లిపాయ (Onion)
ఉల్లిపాయలు కూడా రక్తాన్ని పెంచడానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లు (Flavonoid antioxidants) గుండె ఆరోగ్యానికి (Healthy Heart) ఎంతో మేలు చేస్తాయి. ఉల్లిపాయ రక్త ప్రవాహం (Blood flow), రక్త నాళాల వెడల్పుకు సహాయపడుతుంది. అలాగే ఇది శోథ నిరోధక (Anti-inflammatory) లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రక్త నాళాలు, ధమనులలో మంటను తగ్గించడం ద్వారా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
వెల్లుల్లి (Garlic)
వెల్లుల్లి (Garlic)లో అల్లిసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది సల్ఫర్ సమ్మేళనం. ఇది రక్త నాళాలను సడలించడం ద్వారా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. తక్కువ రక్తపోటును పెంచుతుంది.
బచ్చటికూర
ఐరన్ కంటెంట్ అధికంగా ఉండే బచ్చలికూర రక్త కొరతను అధిగమించడానికి ఉత్తమ ఎంపిక. దీనిలో ఇనుముతో పాటు విటమిన్ ఎ, విటమిన్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయం పూట ఖాళీ కడుపుతో బచ్చలికూర రసాన్ని తాగితే రక్తం పెరగడంతో పాటుగా .. బరువు కూడా తగ్గడానికి సహాయపడుతుంది.
బీట్ రూట్ (Beat root)
బీట్ రూట్ (Beat root)జ్యూస్ రక్తాన్ని పెంచడానికి అత్యంత ప్రభావవంతమైన ఎంపికగా పరిగణించబడుతుంది. బీట్ రూట్ లో అధిక మొత్తంలో నైట్రేట్ ఉంటుంది. దీన్నిమీ శరీరం నైట్రిక్ ఆక్సైడ్ గా మారుస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను సడలించి, కండరాల కణజాలానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.
పుల్లని పండు
నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో ఫ్లేవనాయిడ్లతో సహా అనేక యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. ఇది మీ ధమనులకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
టమాటాలు
ఎరుపు-ఎరుపు టమోటాలు శరీరంలో రక్తాన్ని పెంచుతాయి. అలాగే హిమోగ్లోబిన్ ను సరిగ్గా ఉంచడానికి సహాయపడతాయి. తద్వారా టమోటాలు రక్తపోటును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
కిడ్నీ బీన్స్
చిక్పీస్, వైట్ రాజ్మా, బఠానీలు, రెడ్ రాజ్మా వంటి బీన్స్ రక్తాన్ని పెంచడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇనుము లోపాన్ని భర్తీ చేస్తాయి. రక్త ప్రవాహాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
గుమ్మడికాయ విత్తనాలు
గుమ్మడికాయ విత్తనాలు హిమోగ్లోబిన్ పెరగడానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. వీటిలో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. వీటిని సలాడ్ లేదా స్మూస్ రూపంలో లేదా పచ్చిగా తిన్నా మేలు జరుగుతుంది.