పది నిమిషాలకంటే ఎక్కువసేపు టాయ్ లెట్ లో ఉంటే ఏమౌతుంది?
పది నిమిషాలకు మించి వాష్ రూమ్ లో గడిపితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం…
ఈ మధ్యకాలంలో చాలా మంది టాయ్ లెట్ లో గంటల కొద్దీ గడిపేస్తున్నారు. నార్మల్ గా అయితే.. ఎవరూ వాష్ రూమ్ లో ఎక్కువ సేపు ఉండటానికి ఇష్టపడరు. కానీ, చేతిలో ఫోన్ పట్టుకొని.. వీడియోలు, రీల్స్ లాంటివి చూస్తూ.. ఎక్కువ సమయం గడుపుతున్నారు. కానీ… పది నిమిషాలకు మించి వాష్ రూమ్ లో గడిపితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం…
పది నుంచి 15 నిమిషాలకు మించి టాయ్ లెట్ లో గడపడం వల్ల.. మనం ఊహించని చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయట. ముఖ్యంగా ఎక్కువ మందిలో మూల వ్యాధి వచ్చే అవకాశం ఉందట. దీనినే hemorrhoids అని పిలుస్తారు. మలవిసర్జన ప్రాంతంలో రక్తనాళాలు పూర్తిగా దెబ్బతింటారు. ఇవే పైల్స్ గా మారి.. కనీసం కూర్చోడానికి కూడా వీలు లేకుండా చేసే అవకాశం ఉంటుంది.
children toilet
ఎక్కువ సమయం టాయ్ లెట్ లో కూర్చోవడం వల్ల పెల్విక్ మజిల్స్ బలహీనంగా మారిపోతాయి. దాని వల్ల కూడా భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టాయ్ లెట్ లో ఫోన్ వాడుతూ ఎక్కువ సమయం గడపడం వల్ల… బాత్రూమ్ లోని క్రిములు.. ఆ ఫోన్ పైకి కూడా చేరే అవకాశం ఉంటుంది. దాని వల్ల ఫోన్ నుంచి మన చేతులకు, ఆ తర్వాత ఇతర శరీర అవయవాలకు కూడా చేరి.. ఇన్ఫెక్షన్లకు దారితీసే అవకాశం ఉంది.
టాయ్ లెట్ ఫోన్ చూస్తూ ఎక్కువ సేపు గడపడం వల్ల… మెడనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందట. మెడ, నడుము దగ్గర మజిల్స్ వీక్ గా మారి… మరింత నొప్పి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందట.
అంతేకాదు.. ఎక్కువ సమయం టాయ్ లెట్ లో గడిపితే జీర్ణ సమస్యలు కూాడా వచ్చేస్తాయట. నిపుణుల ప్రకారం ఒక మనిషి టాయ లెట్ లో 5 నుంచి 10 నిమిషాలలోపు మాత్రమే గడపాలట. అంతకంటే ఎక్కువ సమయం గడపకూడదు.