MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • హ్యాపీ రోజ్ డే మై లవ్.. మీకు ఇష్టమైన వ్యక్తిని ఇలా విష్ చేయండి..

హ్యాపీ రోజ్ డే మై లవ్.. మీకు ఇష్టమైన వ్యక్తిని ఇలా విష్ చేయండి..

కొన్ని కొన్ని సార్లు అవతలి వ్యక్తిపై ఉన్న ప్రేమను మాటల రూపంలోనే చెప్పాల్సి వస్తుంది. ఇంకొన్ని సార్లు ఏదైనా వస్తువు లేదా హగ్  రూపంలో చెప్పేయొచ్చు. ఈ రోజు మాత్రం ఒక అందమైన రోజా పువ్వు ఇచ్చి చెప్తారు. ఎందుకంటే ఈ రోజు రోజ్ డే కాబట్టి. 

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 07 2023, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ప్రేమికులకు ఎంతో ఇష్టమైన వాలెంటైన్ వీక్ స్టార్ట్ అయ్యింది. ఈ రోజు రోజ్ డే. ఇంకేముంది ప్రేమికులంతా ఈ రోజు తమకు ఇష్టమైన వారికి ఒక అందమైన రోజా పువ్వును ఇచ్చేసి.. వారిపై ఉన్న ప్రేమను చెప్తారు. గులాబీలు ప్రేమకు చిహ్నం. ఈ రోజు ఎర్ర గులాబీలకు ఎంతో ప్రత్యేకత ఉంది. మీకు తెలుసా? ఎర్ర గులాబీలను ఒకరికి ఇస్తున్నారంటే మీరు వాళ్లను ఇష్టపడుతున్నారని అర్థం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28


నిజానికి ఈ ఎర్ర గులాబీలను బహుుమతిగా ఇచ్చిన చరిత్ర విక్టోరియన్ శకం నాటిది. అక్కడ ప్రజలు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి గులాబీలను ఇచ్చిపుచ్చుకునే వారట. అయితే ప్రియమైన వారికి కూడా గులాబీలను బహుమతిగా ఇవ్వొచ్చు. ఒవరైన పసుపు రంగు గులాబీలను ఇచ్చారంటే ఆ వ్యక్తి మీ స్నేహాన్ని మరింత పంచాలని కోరకుంటున్నట్టు. అంటే ఇది కొత్త ఆరంభాలకు సంకేతం అన్న మాట.  ఇకపోతే తెల్లగులాబీలు అమాయకత్వాన్ని, స్వచ్ఛతను సూచిస్తాయి. నారింజ గులాబీలు కోరికను వ్యక్తపరుస్తాయి. అందుకే మీరు ఏ రంగు గులాబీలను మీకు ఇష్టమైన వారికి ఇవ్వాలో డిసైడ్ చేసుకోండి. ఈ రోజ్ డే సందర్భంగా కొన్ని కోట్స్, వాట్సాప్ మెసేజ్, ఇమేజ్ లు మీకోసం.. 

38

నా జీవితంలో అత్యంత విలువైన వ్యక్తివి నువ్వు
నాకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే నీకు రోజ్ డే శుభాకాంక్షలు

అంతులేని ప్రేమను, ఆనందాన్ని నా హృదయంలో నింపిన వ్యక్తికి హ్యాపీ రోజ్ డే.. నీకోసం ఒక అందమైన గులాబీ

హ్యాపీ రోజ్ డే మై డియర్.. మన జీవితం ఈ గులాబీ పువ్వులాగే వికసించాలి. మన జీవితం ఎప్పుడూ ఆనందంగా, సంతోషంగా, ప్రేమతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. 

ఈ రోజ్ డే సాక్షిగా.. అనారోగ్యం, ఆనందం, బాధ ఇలా ప్రతి సందర్భంలో నీకు నేను తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను.. హ్యాపీ రోజ్ డే మై లవ్.
 

48

నా జీవితంలోని అత్యంత విలువైన వ్యక్తికి సంతోషకరమైన, అందమైన రోజ్ డే శుభాకాంక్షలు. 

నువ్వు నా జీవితంలో ఉండటం నిజంగా ఆ దేవుడు నాకిచ్చిన గొప్ప వరం. ఎప్పటికీ మనం ఇలాగే కలిసి ఉంటాం.. హ్యాపీ రోజ్ డే. 

హ్యాపీ రోజ్ డే మై లవ్.. ఈ గులాబీలు కొద్ది సేపటికి వాడిపోవచ్చు. కానీ నీపై నాకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ తరగదు. 

58
Image: Getty Images

Image: Getty Images

నీ ప్రేమతో నా హృదయాన్ని అందమైన గులాబీ రేకుల్లా మృదువుగా మార్చావు. నీకు అందమైన రోజ్ డే శుభాకాంక్షలు మై లవ్. 

ప్రపంచంలోనే అత్యంత అందమైన భర్త కోసం ఈ గులాబీలు.. హ్యాపీ రోజ్ డే.. మైడియర్ హస్బండ్.

నా దృష్టిలో నీ ప్రేమ ఎప్పుడూ నిన్ను గుర్తు చేసే గులాబీ సువాసన.. హ్యాపీ రోజ్ డే.

గులాబీ లాంటి అందమైన పెదవుల చిరునవ్వుతో నా జీవితాన్ని అందంగా మలిచిన నీకు.. హ్యాపీ రోజ్ డే ప్రియా..
 

68


నీ మీద నాకున్న ప్రేమను వ్యక్తపరచడానికి మాటలు కరువాయే. గులాబీలు నా మనసులోని మాటలు నీకు చెప్తాయని ఆశిస్తున్నా.. హ్యాపీ రోజ్ డే మై గర్ల్.

నా జీవితం అనే తోటలో ఉన్న ఏకైక గులాబీ నువ్వే. హ్యాపీ రోజ్ డే.. నేను నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నా.

నేను ఎక్కువగా ఆరాధించే ఏకైక వ్యక్తికి హ్యాపీ రోజ్ డే. 

జీవితం ఒక పువ్వు.. అందులో ప్రేమ తేనె - విక్టర్ హ్యూగో.

నీలాంటి అందమైన గులాబీని నేనెప్పుడూ చూడలేదు - హ్యాపీ రోజ్ డే

78


నాతో ఎప్పుడూ ఉండి నా జీవితాన్ని మరింత సంతోషంగా మార్చినందుకు ఈ గులాబీలు..  హ్యాపీ రోజ్ డే మై లైఫ్..!

ఆనందపు పరిమళంతో నా జీవితంలోకి వచ్చి నా జీవితాన్ని గులాబీల కంటే మరింత అందంగా మార్చావు- హ్యాపీ రోజ్ డే మై లవ్. 

88

నువ్వు నాతో ఉన్న ప్రతి క్షణం నాకెంతో అందమైంది. నీకు తెలుసా? నువ్ పక్కనుంటే నాకు ఎలాంటి సమస్యలు గుర్తురావు. బాధలన్నీ మర్చిపోతా.. నన్నెప్పటికీ విడిచిపెట్టి వెళ్లకు..  హ్యాపీ రోజ్ డే మై గర్ల్!

నా జీవితంలో నువ్వు ఉంటే చాలు.. నేనెప్పుడూ ఆనందంగా ఉంటా.. హ్యాపీ రోజ్ డే మై డ్రామా క్వీన్!
 

 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Earrings Designs: వర్కింగ్ ఉమెన్స్ కోసం స్టైలిష్, ట్రెండీ ఇయర్ రింగ్స్
Recommended image2
Chicken Shop: చికెన్ బొక్కలు.. పీకేసిన ఈకలు..ఏముందక్కడ..? దీనికి అవార్డా..?
Recommended image3
Chicken Biryani: అబ్బబ్బ ఏం రెసిపీ..ఈ పొట్లం బిర్యానీ రుచి చూస్తే వెజిటేరియన్స్ కూడా నాన్ వెజిటేరియన్స్ అయిపోతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved