మీ జుట్టు చిన్నగా ఉందా? ఇదిగో ఈ కూరగాయలు తినండి పెరుగుతుంది
శరీరంలో విటమిన్స్ లోపించడం వల్ల జుట్టు బలం తగ్గి బాగా రాలుతుంది. అందుకే జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి.

hair care
ప్రస్తుతం హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి. నిజానికి జుట్టు ఆరోగ్యం ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది. మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి మీరు ముందుగా చేయాల్సిన పని ప్రోటీన్ ఫుడ్ ను తినడం. అవును మన శరీరంలో విటమిన్స్ లోపించడం వల్లే జుట్టు బలం తగ్గుతుంది. రాలుతుంది. మన జుట్టు బలంగా, ఆరోగ్యం, ఒత్తుగా పెరగాలంటే విటమిన్లు ఎక్కువగా ఉంటే ఆహారాలను రోజూ తినాలి. జుట్టు పెరిగేందుకు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బచ్చలికూర
బచ్చలికూర మన జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. నిజానికి బచ్చలికూర విటమిన్ల భాండాగారం. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అందుకే బచ్చలికూరను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
క్యారెట్లు
క్యారెట్లు విటమిన్ ఎ భాండాగారం. రోజూ క్యారెట్ జ్యూస్ తాగడం కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. అంతేకాదు క్యారెట్ జ్యూస్ మన జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచి బాగా పెరగడానికి సహాయపడుతుంది.
టమాటాలు
టమాటాలు కూడా హెయిర్ హెల్త్ కు మంచి ప్రయోజకరంగా ఉంటాయి. టమాటాల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే పొడుగ్గా పెరగడానికి కూడా సహాయపడుతుంది.
బీట్ రూట్
బీట్ రూట్ విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్స్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్, కార్బోహైడ్రేట్స్, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన జుట్టును బలంగా, పొడుగ్గా పెరగడానికి సహాయపడతాయి.
గ్రీన్ బీన్స్
గ్రీన్ బీన్స్ కూడా మంచి పోషకాలను వనరు. విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్న గ్రీన్ బీన్స్ కూడా జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. వెంట్రుకలను పొడుగ్గా పెంచుతాయి.
చిలగడదుంపలు
చిలగడదుంపల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉండే చిలగడదుంపలు పేరుకు తగ్గట్టుగానే తియ్యగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.