వైవాహికబంధం కలకాలం నిలవాలంటే.. ఈ సర్దుబాట్లు అవసరం....
వైవాహిక జీవితాన్ని కలకాలం నిలుపుకోవాలంటే భార్యాభర్తలిద్దరూ కృషి చేయాలి. దీనికోసం ఇద్దరూ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే ఎలాంటి పొరపొచ్చాలొచ్చినా వెంటనే దాన్నుంచి బైటపడొచ్చు.
అవాస్తవ అంచనాలు
వివాహం అనేది జంటగా కలిసి చేసే ప్రయాణం. ఈ సమయంలో మనసు పూర్తిగా వైట్ పేపర్ లా ఉండాలి. ముందుగానే ఎక్కడో విన్నవో, ఎవరో చెప్పినవో నమ్మి వైవాహిక జీవితం మీద అంచనాలు ఉండొద్దు. ఇద్దరూ కలిసి నడుస్తున్న ప్రయాణంలో నిజాలను తెలుసుకుని ముందుకు వెళ్లండి.
Relationship Tips-Do not send this message to your spouse
కంట్రోల్ చేయడం...
ఇద్దరి మధ్య బాలెన్స్ ముఖ్యం.. ఒకరు డామినేటెడ్, ఇంకొకరు కాకపోయినా... కంట్రోట్ చేయకూడదు. వ్యక్తిత్వాన్ని మెరుగు పరుచుకుంటూ ముందుకు వెళ్లాలి. విలువలను పాటించాలి. ఎవరి స్పేస్ వారికి ఉండేలా చూసుకోవాలి. భాగస్వామి ఆలోచనలు, నిర్ణయాలు, అభిప్రాయాలకు విలువనివ్వాలి.
పొసెసివ్ నెస్ ఉండొద్దు...
మీ భాగస్వామి మీ ఆస్తి కాదు. మీరిద్దరూ కలిసి ఉంటున్నా.. ఊపిరి తీసుకోవడానికి కూడా సమయం ఉండకుండా చూసుకోకండి. అలా కాకుండా ఒకరంటే ఒకరు పొసెసివ్ గా ఉండడం వల్ల బందంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
విమర్శలు వద్దు...
ఇది చాలా చెడ్డ అలవాటు. దీన్ని వీలైనంత వరకు వెంటనే తగ్గించుకోవాలి. మీ భాగస్వామి మీ కోసం చేసే చిన్న చిన్న పనులను అభినందించాలి. మంచి విషయాల కోసం మీ భాగస్వామిని అభినందించండి.
మార్చేస్తాం... అనేమాట మర్చిపోండి
ఏ వ్యక్తీ... మరోవ్యక్తిని సరిదిద్దలేరు. ఏ వ్యక్తీ పరిపూర్ణంగా సరిగా ఉండరు. ప్రతి మనిషిలోనూ చెడు లక్షణాలు ఉంటాయి. మీరు దానిని అంగీకరించాలి. రిలేషన్ షిప్ అంటే ఎవరినీ సరిదిద్దుకోవడం కాదు. కాకపోతే సర్దుబాటు అంతే.