‘గే’కపుల్ పై వ్యతిరేకత... ఎలా బుద్ధి చెప్పారో తెలుసా?
తమకు నచ్చినట్లుగా జీవిస్తున్న ఓ గే జంటకు కొందరు ఆంక్షలు విధించారు. దీంతో.. ఈ జంట వారి తెలివి తేటలతో వారికి బుద్ది వచ్చేలా చేశారు.
ప్రపంచం అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకుపోతోంది. ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్లు జీవిస్తున్నారు. ఎవరి ఎవర్ని పెళ్లి చేసుకోవాలి..? ఎవరితో జీవించాలనేది వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. అందుకు తగినట్లు వివిధ దేశాల్లో చట్టాలు కూడా ఉన్నాయి.
ఈ క్రమంలో గే లు కూడా తమకు నచ్చినట్లుగా జీవించే హక్కు ఉంది. అయితే.. ఎన్ని హక్కులు, చట్టాలు ఉన్నా..రియాల్టీలో మాత్రం వారికి అంగీకరించేవారు చాలా తక్కువ మందే ఉంటారు. తాజాగా.. ఓ గే జంట కు అలాంటి అనుభవమే ఎదురైంది.
తమకు నచ్చినట్లుగా జీవిస్తున్న ఓ గే జంటకు కొందరు ఆంక్షలు విధించారు. దీంతో.. ఈ జంట వారి తెలివి తేటలతో వారికి బుద్ది వచ్చేలా చేశారు.
ఇంతకీ మ్యాటరేంటంటే... అమెరికాకు చెందిన మెమో ఫాచినో, ల్యాన్స్ మేయర్ అనే ఇద్దరు వ్యక్తులు ఐదు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. కాగా.. వారి ఇంటి ముందు LGBT Pride flag అయిన రెయిన్ బో కలర్ జెండాను ఎగరవేశారు.
దాదాపుగా 2016 నుంచి వారు తమ ఇంటి ముందు ఆ జెండాను ఎగరవేశారు. అయితే.. ఆ జెండాను అక్కడి నుంచి తీసేయాలంటూ కొందరు వారిపై ఒత్తిడి తీసుకువచ్చారు.
తమ ప్రేమకు గుర్తుగా ఉన్న జెండా తీసేయమన్నప్పుడు తొలుత వీరు బాధపడ్డారు. తర్వాత ఆ జెండాను తొలగించారు. కానీ.. తమ తెలివితో వారికి షాకిచ్చారు.
ఇంటి ముందు కేవలం యూఎస్ జెండా తప్ప.. మరేదీ ఎగరవేయడానికి వీలు లేదని చెప్పడంతో.. వారు ఆ జెండాను తొలగించారు.
అయితే.. తమ ఇంటి మొత్తాన్ని LGBT Pride flag కనిపించేలా.. రెయిన్ బో కలర్స్ తో డెకరేట్ చేశారు. జెండా తీసేసినా.. వారి ఇల్లు మొత్తం రెయిన్ బో కలర్స్ తో కలకలలాడటం విశేషం.
ఆ తర్వాత తమ ఇంటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరి తెలివికి సోషల్ మీడియా కూడా ఫిదా అయిపోయింది. నిమిషాల్లో వారి ఫోటోలు వైరల్ గా మారాయి.
వాళ్లు మమ్మల్ని జెండా తీసేయమన్నప్పడు వాళ్లతో మేము ఎలాంటి వాదన చేయలేదు. వెంటనే అంగీకరించాం కాకపోతే.. పూర్తిగా కాదు. అందుకే.. జెండా తీసేసినా.. తమ ఇంటిని మొత్తం రెయిన్ కలర్ బల్బులతో అలంకరించుకున్నామని చెప్పారు.
ఇప్పుడు వారి ఇల్లు మొత్తం ఆ జెండా రంగులోనే దర్శనమిస్తోంది. దీంతో.. ఆ రంగులతో ఉన్న తమ ఇంటిని చూసి ఈ జంట మురిసిపోతోంది.