ఇమ్యూనిటీ పవర్ ను పెంచే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలు..
విటమిన్ సి, డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇమ్యూనిటీని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే వీటిని ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు.

విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్ సి శరీరానికి ఎన్నో విధాలా సహాయపడుతుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఇది సంక్రమణను నివారించడానికి, వ్యాధితో పోరాడటానికి సహాయపడుతుంది.
సమతుల్య ఆహారం, వివిధ రకాల పండ్లు, కూరగాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ సి అందుతుంది. నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మీడియం సైజు ఆరెంజ్ లో 69.7 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. నారింజతో పాటుగా ఇతర ఆహార పదార్థాల్లో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
కివీ
కివీ పండ్లల్లో విటమిన్ సి తో పాటుగా డైటరీ ఫైబర్ కకూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఒక మీడియం సైజు కివి పండులో 64 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. ఈ పండు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడతుంది.
బొప్పాయి
బొప్పాయి మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు ఇది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది కూడా. అలాగే ఎముకలను బలోపేతం చేస్తుంది. ఒక కప్పు బొప్పాయిలో 88.3 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది.
స్ట్రాబెర్రీలు
ఒక కప్పు స్ట్రాబెర్రీల్లో విటమిన్ సి 87.4 మి.గ్రాములు ఉంటుంది. అంతేకాదు స్ట్రాబెర్రీలల్లో ఫోలేట్ తో పాటుగా ఇతర సమ్మేళనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. వీటిలో విటమిన్ సి తో పాటుగా ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లు డయాబెటీస్, క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక రోగాల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
Pineapple
పైనాపిల్
పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే జీర్ణ ఎంజైమ్ ఉంటుంది. ఇది Bloating ను నిరోధిస్తుంది. అలాగే తిన్న ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. ఒక గిన్నెలో పైనాపిల్ లో 78.3 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది.
బ్రోకలీ
బ్రోకలీలో ఫైబర్ తో పాటుగా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండులో క్యాన్సర్ ను నివారించే సామర్థం ఉంటుంది. గిన్నె బ్రోకలీలో 132 మి.మీ. గ్రామ్ ల విటమిన్ సి ఉంటుంది. బ్రోకలీలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని, మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.