ఇలా చేస్తే.. ఇంట్లో బొద్దింకలు, బల్లులు ఒక్కటి కూడా లేకుండా పోతాయి
ప్రతి ఒక్కరి ఇంట్లో బొద్దింకలు,బల్లులు ఉండటం చాలా కామన్. కానీ ఇవి ఇంటిని మురికిగా చేయడంతో పాటుగా మనకు లేనిపోని రోగాలు వచ్చేలా కూడా చేస్తాయి. అందుకే రూపాయి ఖర్చు లేకుండా వీటిని ఇంట్లో నుంచి తరిమికొట్టే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బొద్దింకలు, బల్లులు
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా.. ఇంట్లో బొద్దింకలు, బల్లుల బాధ ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వీటి బెడద ఎక్కువగా ఉంటుంది. మీకు తెలుసా? ఇంటి చుట్టూ తేమ ఎక్కువగా ఉండటం వల్ల బొద్దింకలు ఎక్కువగా వస్తాయి.
ముఖ్యంగా బల్లులు, బొద్దింకలు ఎక్కువగా కిచెన్ రూం, బాత్రూమ్, కిచెన్ సింక్ లాంటి ప్లేస్ లో ఎక్కువగా ఉంటాయి. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇవి ఇంట్లో తిరుగుతూనే ఉంటాయి. దీనివల్ల ఇల్లు మురికిగా మారడమే కాకుండా.. ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
బొద్దింకలు, బల్లుల బాధ
చాలా మంది ఇండ్లలో బల్లులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాయి. కొన్ని కొన్ని సార్లైతే బల్లీలు గోడలపైనే కాకుండా నేలపై కూడా తిరుగుతుంటాయి. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఉంటే ఈ చిట్కాలను ఫాలో అయితే ఇంట్లో ఒక్క బల్లీ కూడా లేకుండా పోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఇంట్లో నుంచి బల్లులు, బొద్దింకలను తొలగించడానికి చిట్కాలు:
ఉప్పు & నిమ్మరసం
ఇంటిని తుడిచే నీటిలో నిమ్మరసం, ఉప్పును కలపండి. ఈ వాటర్ తో ఫ్లోర్ నే కాకుండా గోడలు, ఫర్నిచర్ ను కూడా తుడవండి. ఇలా చేస్తే టైల్స్, బండలకు అంటుకున్న మురికి తొలగిపోయి కొత్తదానిలా మెరుస్తుంది. అలాగే ఇంట్లో మంచి సువాసన కూడా వస్తుంది. ముఖ్యంగా బల్లులు, బొద్దింకల బాధ అసలే ఉండదు.
కర్పూరం & లవంగం
కర్పూరం, లవంగంతో కూడా ఇంట్లో బొద్దింకలను, బల్లులను వెళ్లగొట్టొచ్చు. ఇందుకోసం ఇంటిని తుడిచే నీటిలో కర్పూరం పొడి, లవంగ నూనెను వేసి కలపండి. ఈ వాటర్ తో ఇంటిని బాగా తుడవండి. కర్పూరం, లవంగం నుంచి వచ్చే ఘాటైన వాసన ఇంట్లో బల్లులు, బొద్దింకలు లేకుండా చేయడానికి సహాయపడుతుంది.
వినెగర్ & బేకింగ్ సోడా
వెనిగర్, బేకింగ్ సోడా కూడా ఇంట్లో బల్లులను, బొద్దింకలను లేకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఇంటిని తుడవడానికి ఉపయోగించే నీళ్లలో ఒక కప్పు వినెగర్, 3 స్పూన్ల బేకింగ్ సోడా ను బాగా కలపండి. ఈ వాటర్ తో నేలను బాగా శుభ్రం చేయండి. ఇలా చేస్తే వర్షాకాలంలో ఇంట్లోకి పురుగులు, బల్లీలు, బొద్దింకల బాధ అసలే ఉండదు.