దోమకాటుకు ఆయిల్ దెబ్బ.. ఇంట్లోనే ఈజీగా మస్కిటో రెపల్లెంట్స్...

First Published Jun 3, 2021, 1:23 PM IST

వర్షాలు మొదలయ్యాయి. ఇక దోమలదండు దండెత్తుతుంది. కరోనాకు తోడు డెంగీ, మలేరియా లాంటి జ్వరాలు విరుచుకుపడతాయి. అలాగని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాటిని ఆపలేం. తలుపులకు మెష్ డోర్లు, ఆల్ అవుట్లు, దోమల అగరబత్తులు ఇలా ఎన్నిరకాలు జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడినుంచో గుయ్ మంటూ సంగీతం వినిపిస్తూనే ఉంటాయి.