Beauty Tips: ముఖంపై హెయిర్ డై మచ్చ పడిందా.. అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి?
Beauty Tips: సాధారణంగా హెయిర్ కి డై వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ డై ముఖంపై కూడా పడి మచ్చలు అవుతాయి. ఇవి అంత తొందరగా వదలవు. అయితే ఈ చిట్కాలతో మచ్చలు త్వరగా పోతాయట అవి ఏంటో చూద్దాం.
సాధారణంగా జుట్టుకి రంగు వేసుకునేటప్పుడు ఆ డై అప్పుడప్పుడు ముఖంపై కూడా పడుతుంది. వెంటనే శుభ్రం చేసుకుంటే పర్వాలేదు. ఏమాత్రం ఆలస్యం చేసినా ఆ డ్రై అయిన మచ్చలు అంత త్వరగా పోవు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ మచ్చలు పోతాయి. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వెనిగర్ ని కొద్దిగా దూదిలో ముంచి మరక పడినచోట రుద్దితే మచ్చ తొలగిపోతుంది అంతేకాదు అక్కడ శరీరం కూడా కాంతివంతంగా మారుతుంది. అలాగే లిక్విడ్ డిష్ వాష్ తో కూడా మరకపడిన దగ్గర కొద్దిగా రబ్ చేసి తర్వాత నీటితో కడుక్కుంటే హెయిర్ డై మచ్చ పోతుంది.
అలాగే హెయిర్ డై వేసుకోవటానికి ముందే నుదుటిపైన నూనె రాసుకుంటే త్వరగా మచ్చ పడకుండా ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్ హెయిర్ రిమూవల్ ద్వారా కూడా మచ్చలని తొలగించుకోవచ్చు. కాకపోతే ఇది మనం సొంతంగా ఇంట్లో చేసుకోలేం, సెలూన్లకి వెళ్లాల్సిందే.
అలాగే బేబీ ఆయిల్ తో మచ్చ పడిన చోట నిదానంగా మర్దన చేసి తర్వాత వేడి నీళ్లతో మొహం కడుక్కుంటే మచ్చ తొలగిపోతుంది. అలాగే నిమ్మకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ నిమ్మకాయ ముక్కలతో..
మచ్చ పడిన చోట నెమ్మదిగా రుద్ది ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే హెయిర్ డై మచ్చలు తొలగిపోతాయి. అలాగే నైయిల్ పాలిష్ రిమూవర్ కూడా మచ్చ పడిన చోట వెంటనే అప్లై చేసి కాసేపు ఉంచండి.
ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడగటం వలన మచ్చ పోతుంది. అలాగే మచ్చ పడినచోట టూత్ పేస్ట్ ని అప్లై చేసి కొంచెం డ్రై అవ్వనివ్వండి, ఆ తరువాత గోరువెచ్చని నీటితో మొహం కడుక్కుంటే హెయిర్ డై మచ్చలు త్వరగా పోతాయి.