వర్షాకాలంలో దుస్తులు తొందరగా డ్రై అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా?
కొన్ని ట్రిక్స్ వాడితే.. ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
వర్షాకాలం వచ్చింది అంటే.. దుస్తులు తొందరగా ఆరవు. బయట ఆరేద్దాం అంటే.. ఎప్పుడు వర్షం పడుతుంతో తెలీదు. అందుకే.. ఇండోర్ లో అంటే… ఇంట్లో ఆరేసుకుంటూ ఉంటారు. అయితే.. ఇంట్లో ఆరేసిన దుస్తులు… ఎన్ని రోజులకీ ఆరవు. అలాంటప్పుడు మనం కొన్ని ట్రిక్స్ వాడితే.. ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంట్లో దుస్తులు ఆరేసినప్పుడు తొందరగా ఆరాలంటే.. మీరు హెయిర్ డ్రయ్యర్ వాడొచ్చు. హెయిర్ డ్రయ్యర్ తో.. దుస్తులు చాలా తొందరగా ఆరతాయి. అయితే… మొత్తం దుస్తులు ఒకేసారి పూర్తిగా ఆరకపోవచ్చు. కానీ.. సగానికి సగం ఆరిపోతాయి. దీని వల్ల చాలా తక్కువ సమయంలోనే దుస్తులు.. డ్రై అవుతాయి.
Wet Clothes
దాదాపు అందరి ఇళ్లల్లో టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి. ఈ టేబుల్ ఫ్యాన్స్ ఆన్ చేసి మరీ.. దుస్తుల వైపు కాసేపు పెట్టినా.. చాలా తక్కువ సమయంలో ఆరతాయి. దుస్తుల నుంచి వాసన కూడా రాకుండా ఉంటుంది.
తడి దుస్తులను ఐరన్ చేయడం వల్ల కూడా.. డ్రై చేయవచ్చు. అంటే.. మరీ తడి దుస్తులపై డైరెక్ట్ గా ఐరన్ బాక్స్ పెట్టకూడదు. షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా.. బట్టలు ఆరేసిన తర్వాత కూడా.. కాస్త తడిగా అనిపిస్తే… అప్పుడు ఐరన్ బాక్స్ వాడొచ్చు.ముడతలు కూడా పోతాయి.
cloths
ఏసీ అవుట్ డౌర్ పార్ట్ దగ్గర బట్టలు ఆరేసినా కూడా.. చాలా తక్కువ సమయంలో డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. దాని నుంచి హాట్ ఎయిర్ వస్తుంది. ఫలితంగా తొందరగా ఆరతాయి.
ఇంట్లో ఏదైనా తాడు కట్టుకొని దాని మీద కూడా ఆరేయవచ్చు. ఇలా కూడా కాస్త తొందరగానే ఆరతాయి. ఆ సమయంలో ఫ్యాన్ ఆన్ చేసి ఉంచితే బెటర్.