కరోనా నుంచి కాపాడే బ్రీతింగ్ ఎక్సర్ సైజులు.. ట్రై చేయండి..
కరోనా ముఖ్యంగా ఊపిరితిత్తుల మీద దాడిచేసి ఉసురు తీస్తున్న ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ సోకినా.. అది ఊపిరితిత్తులను తీవ్రంగా ప్రభావితం చేయకుండా ఉండాలన్నా, ఆక్సీజన్ పెట్టుకునే స్థాయికి చేరుకోకుండా ఉండాలన్న కొన్ని సహజసిద్ధమైన పద్ధతుల్లో ఊపిరికి ఊపిరులూదండి.
కరోనా ముఖ్యంగా ఊపిరితిత్తుల మీద దాడిచేసి ఉసురు తీస్తున్న ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ సోకినా.. అది ఊపిరితిత్తులను తీవ్రంగా ప్రభావితం చేయకుండా ఉండాలన్నా, ఆక్సీజన్ పెట్టుకునే స్థాయికి చేరుకోకుండా ఉండాలన్న కొన్ని సహజసిద్ధమైన పద్ధతుల్లో ఊపిరికి ఊపిరులూదండి.
ఊపిరితిత్తులకు వ్యాయామంతో రోగనిరోధక శక్తిని పెంచండి. దీర్ఘశ్వాస ఊపిరి తిత్తుల్లో ఆక్సీజన్ శాతాన్ని పెంచుతుంది. తద్వారా వైరస్ తో సమర్థవంతంగా పోరాడడానికి సిద్ధం చేస్తుంది. అలాంటి కొన్ని వ్యాయామాలు..
ఊపిరితిత్తులకు వ్యాయామంతో రోగనిరోధక శక్తిని పెంచండి. దీర్ఘశ్వాస ఊపిరి తిత్తుల్లో ఆక్సీజన్ శాతాన్ని పెంచుతుంది. తద్వారా వైరస్ తో సమర్థవంతంగా పోరాడడానికి సిద్ధం చేస్తుంది. అలాంటి కొన్ని వ్యాయామాలు..
గట్టిగా శ్వాసపీల్చడం .... శ్వాస, ఊపిరితిత్తులను బలోపేతం చేసే వ్యాయామాల్లో ముఖ్యంగా డీప్ బ్రీతింగ్ ఊపిరితిత్తులలోపలి వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శ్వాస సామర్థ్యాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తుల్లో మంటను తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల్లో ఏర్పడిన నీటిని, మ్యూకస్ ను క్లియర్ చేస్తుంది.
గట్టిగా శ్వాసపీల్చడం .... శ్వాస, ఊపిరితిత్తులను బలోపేతం చేసే వ్యాయామాల్లో ముఖ్యంగా డీప్ బ్రీతింగ్ ఊపిరితిత్తులలోపలి వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శ్వాస సామర్థ్యాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తుల్లో మంటను తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల్లో ఏర్పడిన నీటిని, మ్యూకస్ ను క్లియర్ చేస్తుంది.
కోవిడ్ పేషంట్ల మీద చేసిన క్లినికల్ అధ్యయనాలు కూడా దీన్ని ప్రూవ్ చేశాయి. అంతేకాదు ఊపిరితిత్తుల్లోకి గట్టిగా శ్వాస తీసుకునే వ్యాయామం వల్ల కరోనా నుంచి కోలుకునే సమయంలో రోగికి ఒత్తిడి, ఆందోళన స్థాయిలను తగ్గించడానికి, వేగంగా నయం చేయడానికి సహాయపడుతుంది.
అందుకే యోగాసనాలు, ఆక్సీజన్ ను పెంపొందించుకోవడానికి డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు, ఊపిరితిత్తుల పనితీరును బలోపేతం చేయడానికి పనికి వస్తాయని, హోం ఐసోలేషన్ లో ఉన్న వారికి, కోవిడ్ పాజిటివ్ రోగులకు సిఫార్సు చేస్తున్నారు. ఆక్సీజన్ కొరత బాగా ఉన్న ఈ సమయంలో ఇలాంటి వ్యాయామాలతో ఆక్సీజన్ దాకా పోయే పరిస్థితిని తగ్గించుకోవచ్చు. ఈ వ్యాయామాలు వైరస్ తో పోరాడడానికి తోడ్పడకపోవచ్చు. కానీ మిమ్మల్ని వైరస్ నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి.
డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్ : దీన్ని మామూలుగా బెల్లీ బ్రీతింగ్ అని కూడా అంటారు. నాభి దగ్గర్నుండి శ్వాస తీసుకోవడం అనే ఈ ప్రక్రియ ద్వారా ఊపిరితిత్తుల పనితీరును బాగా మెరుగుపరచవచ్చు. దీంతో ఈజీగా శ్వాస తీసుకోవచ్చు.
ఈ వ్యాయామం చేయడానికి ముందుగా బాసింపట్టు వేసుకుని ప్రశాంతంగా కూర్చోండి. లేదా పడుకుని కూడా చేయచ్చు. అయితే రిలాక్స్ డ్ గా ఉండడం చాలా ముఖ్యం. ఆ తరువాత నాలుక చివరతో మీ పై పళ్ల వరస వెనక ఉండేలా చూడండి. ఆ తరువాత వీపు నిటారుగా ఉండేలా పెట్టి, కళ్లు మూసుకోండి. మెల్లగా శ్వాస తీసుకుంటూ ఒక చేతిని ఛాతి మీద, మరో చేతిని పొత్తికడుపుపై ఉంచండి.
తరువాత మెల్లగా ముక్కుతో మాత్రమే గట్టిగా శ్వాస పీల్చుకోండి. దీనివల్ల పక్కటెముకలు విస్తరిస్తాయి మరియు మీ కడుపు బైటివైపు ఉబ్బుతుంది. ఇప్పుడు శ్వాసను మెల్లగా వదలండి. ఈ సమయంలో పొత్తికడుపు వెనకభాగానికి అంటుకోవాలి. ఇలా 10 సార్లు ఒకసారి లోపలికి, ఒకసారి బైటికి గట్టిగా శ్వాస పీలుస్తూ, విడుస్తూ చేయాలి.
పెదాలతో పదనిసలు..
దీన్నే పర్స్ డ్ లిప్ బ్రీతింగ్ అంటారు. దీనివల్ల మీ ఆక్సీజన్ స్థాయిల్ని పెంచుతుంది. శ్వాస ఎలా తీసుకుంటున్నారో అనే దాని మీద దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది.
దీనికోసం మొదట ప్రశాంతంగా కూర్చోండి. తరువాత మెల్లగా ముక్కుతో వీలైనన్ని ఎక్కువ సార్లు శ్వాస తీసుకోండి. ఈ సమయంలో పెదాలు మూసుకునే ఉండాలి. ఇక ఇప్పుడు మెల్లగా పెదాలను విప్పి.. శ్వాస మొత్తాన్ని బైటికి వదలండి.
చిరునవ్వుతో శ్వాసించండి..
ఈ వ్యాయామం ఛాతి కండరాల్ని వ్యాకోచించేలా చేస్తుంది. ఊపిరితిత్తుల లోపలి వైపు ఆక్సిజన్ ప్రవాహాం విస్తరించడానికి, నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.
ఈ వ్యాయామం చేయడానికి ముందుగా వీపును నిటారుగా పెట్టి, బాసింపట్టు వేసుకుని కూర్చోవాలి. ఇప్పుడు చేతుల్ని భుజాల వరకు లేపాలి. ఆవలింత తీసుకుంటున్నట్టుగా నోటిని తెరవాలి. ఆ తరువాత భుజాల వరకు లేపిన చేతుల్ని మళ్లీ కిందికి తెచ్చి.. తొడల మీద రిలాక్స్ డ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవలింతను ఆపి.. దాన్ని చిరునవ్వుగా మార్చండి.
ప్రాణాయామం : ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, మీ శ్వాసను నియంత్రించడం ద్వారా నరాలను ఉపశమింపచేయడానికి ఉత్తమమైన శ్వాస వ్యాయామాలలో ప్రాణాయామం ఒకటి. ఖాళీ కడుపుతో చేయడం చాలా మంచిది. ప్రాణాయామం ఎలా చేయాలో అందరికీ తెలిసిన విషయమే.
అనులోమ, విలోమ శ్వాస వ్యాయామాలు.. ఇలాంటి వ్యాయామాలు ఊపిరితిత్తులలోని విషాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. ఊపిరి తిత్తుల్లో అనవసరంగా ఏర్పడిన ద్రవాలన్ని వదిలిస్తుంది. ఊపిరితిత్తుల్లోని రక్తంలో ఆక్సీజన్ శాతాన్ని పెంచుతుంది.
ఈ వ్యాయామం కోసం బాసింపట్టు వేసుకుని కూర్చుని.. రెండు చేతుల్ని ప్రశాంతంగా పెట్టాలి. ఆ తరువాత కళ్లు మూసుకుని మీ కుడి బొటనవేలుతో.. కుడి ముక్కు రంధ్రాన్ని మూసి.. ఎడమ రంధ్రం నుండి గట్టిగా నాలుగుసార్లు లోతుగా శ్వాస పీల్చుకోండి. ఆ తరువాత కుడి రంధ్రంనుంచి వదిలేయండి. అలాగే ఎడమవైపు కూడా చేయండి. ఇలా ఐదు నిమిషాల పాటు చేయాలి.
అదేవిధంగా, మీ ఎడమ ముక్కు రంధ్రం మీ కుడి వేలితో మూసివేసి పట్టుకోండి. 2 సెకన్ల తరువాత, మీ కుడి బొటనవేలు ఎత్తి లోతుగా hale పిరి పీల్చుకోండి.
ఈ వ్యాయామాలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకానీ వైరస్ మీ పోరాటం చేయవు. శ్వాససంబంధ సమస్యలు తీవ్రం కాకుండా కాపాడతాయి అనేది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.
తేలికపాటి కోవిడ్ లక్షణాలు ఉన్నవారు ఈ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. అయితే జ్వరం, ఊపిరి సరిగా ఆడకపోవడం, ఛాతీ నొప్పి ఉన్న రోగులు ఈ వ్యాయామాలలో దేనినైనా ప్రయత్నించే ముందు కాస్త ఆలోచించాలి.