Cholesterol: ఈ డ్రై ఫ్రూట్స్ కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తాయి.. రోజూ తినండి
Cholesterol: కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో కొన్ని డ్రై ఫ్రూట్స్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మీరు తినే ఆహారం మీ ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా నేడు చాలా మంది ఎన్నో అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. అందులో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ఒకటి. ఇది చాలా చిన్న సమస్యగా అనిపించినా.. దీనివల్ల గుండెపోటు నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మన శరీరంలో 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది: మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. మొదటిది మంచిది. రెండోది చెడ్డది. ఒక వేళ మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభిస్తే అది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో.. కొలెస్ట్రాల్ ను సమతుల్యంగా ఉంచడం చాలా ముఖ్యం. పెరిగిన కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఎంతో సహాయపడతాయి.
వాల్ నట్స్ (Walnuts): పెరిగిన కొలెస్ట్రాల్ వాల్ నట్స్ నియంత్రించగలవు. ఇవి మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol)ను తగ్గించడానికి ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. వాల్ నట్స్ లో మంచి మొత్తంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు (Omega-3 fatty acids), మోనోశాచురేటెడ్ కొవ్వులు (Monounsaturated fats) కూడా ఉన్నాయి.
బాదం పప్పులు (Almond beans): ప్రతిరోజూ కొన్ని బాదం పప్పులను తింటే ఆరోగ్యం బాగుంటుందని మనందరికీ తెలుసు. బాదంలో అమైనో ఆమ్లాలు (Amino acids) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ (Nitric oxide) ను తయారుచేస్తాయి. బాదం పప్పులను రోజూ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ త్వరగా తగ్గిపోతుంది.
పిస్తా పప్పులు (Pistachio beans): రెగ్యులర్ గా పిస్తా పప్పులను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజూ కొన్ని పిస్తా పప్పులు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరిగి.. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
విత్తనాలు (Seeds): శరీరంలోంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా విత్తనాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు మీ రోజు ఆహారంలో విత్తనాలను చేర్చుకుంటే ఖచ్చితంగా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇవి చాలా తొందరగా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.