child height: పిల్లలు ఫాస్ట్ గా హైట్ పెరగాలంటే ఈ ఫుడ్స్ పెట్టండి..
child height: పిల్లలు హైట్ పెరగడం లేదని బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహారాలను పెట్టండి చాలా ఫాస్ట్ గా హైట్ పెరుగుతారు.
child height: పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు, బరువు ఉంటేనే బావుంటారు. ఇలా ఉండాలనే ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు ఎన్నోరకాల ఆహార పదార్థాలను తినిపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది పిల్లలు మాత్రం వయసు పెరుగుతున్నా.. హైట్ మాత్రం పెరగరు. అలాంటి పిల్లలకు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. తోటిపిల్లల కంటే పొట్టిగా కనిపించే సరికి పిల్లలు మానసికంగా క్రుంగిపోయే అవకాశం ఉంది. అంతేకాదు పొట్టిగా ఉండే పిల్లలను తోటి పిల్లలు వెక్కిరిస్తుంటారు. ఎగతాళి చేస్తుంటారు. దీనివల్ల పిల్లల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.
పిల్లలు ఎత్తు మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి పేరెంట్స్ జీన్స్ వల్ల , జీవన శైలి, పౌషికాహారం. ఈ మూడింటివల్లే పిల్లల ఎదుగుదల ఉంటుంది. జీన్స్ కారణంగా పిల్లల ఎత్తును పెంచలేము. కానీ జీవన శైలి, పౌష్టికాహారం కారణాల వల్ల అయితే..కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫాస్ట్ గా ఎత్తు పెరుతారు.
పిల్లలు ఎత్తు పెరగాలంటే మంచి పౌష్టికాహారంతో పాటుగా వారుండే ప్లేస్ కూడా బావుండాలి. ముఖ్యంగా విటమిన్ డి, కాల్షియం వంటి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను రెగ్యులర్ గా అందించడం వల్ల వారు వయసుకు తగ్గట్టు హైట్ పెరుగుతారు. పిల్లలు హైట్ పెరగాలంటే ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలుసుకుందాం పదండి..
సాల్మన్ ఫిష్.. మీ పిల్లలు మాంసాహారం తింటే వారికి తరచుగా సాల్మన్ ఫిష్ ను తినిపించాల్సిందే. ఈ ఫిష్ పిల్లలు తొందరగా హైట్ పెరిగేందుకు ఎంతో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పిల్లల ఎదుగుదలకు ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఈ ఫిష్ లో ప్రోటీన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల్లో కండరాల నిర్మాణానికి ఎంతో తోడ్పడతాయి.
గుడ్లు.. గుడ్డులో ప్రోటీన్లు. విటమిన్లు, విటమిన్ బి12, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లలు హైట్ పెరిగేందుకు ఎంతగానో సహాయపడతాయి. మీ చిన్నారులు హైట్ పెరగడం లేదనుకుంటే వారికి రోజుకో గుడ్డును తప్పనిసరిగా పెట్టండి. అది కూడా తెల్లసొనను మాత్రమే. గుడ్డు బోర్ కొట్టకూడదంటే ఒకరోజు ఆమ్లేట్, ఇంకోరోజు ఉడకబెట్టిన గుడ్డు,. శాండ్విచ్ వంటివి చేసి ఇవ్వండి.
బెర్రీస్.. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీలల్లో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కణాలు పెరిగేందుకు సహాయపడుతుంది. వీటిలో ఉండే ఫైట్ న్యూట్రీషియన్స్ బాడీ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి మీ చిన్నారులకు బెర్రీలను చిరుతిండిలా ఇవ్వండి. లేదా సలాడ్ రూపంలో ఇచ్చినా వారి శరీర పెరుగుదల బాగుంటుంది.
పండ్లు.. తాజా పండ్లలో విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీ చిన్నారులకు పండ్లను రోజూ తినిపించండి. ముఖ్యంగా అరటిపండుతో పిల్లల ఎదుగుదల బాగుంటుంది.
పాలు.. పాలు ఎముకలను బలంగా ఉంచడమే కాదు.. శరీర ఎదుగుదలకు కూడా ఎంతో సహాయపడతాయి. పాలల్లో విటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ చిన్నారులు హైట్ పెరిగేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి పిల్లలకు రోజుకు రెండు గ్లాసుల పాలను అందించండి. పాలల్లో చాక్లెట్ పౌడర్, బారం పప్పులు, కుంకుమ పువ్వు వేస్తే.. టేస్టీగా ఉాంటాయి.
పెరుగు.. పెరుగులో కాల్షియం, ప్రో బయోటిక్స్, విటమిన్ డి పిల్లలను ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. ఎముకలను బలంగా తయారుచేస్తాయి. అంతేకాదు హైట్ కూడా పెరిగేందుకు సహాయపడతాయి.
డ్రై ఫ్రూట్స్.. పిల్లలు శరీర ఎదుగుదలకు డ్రై ఫ్రూట్స్ కూడా ఎంతో సహాయపడతాయి. డ్రై ఫ్రూట్స్ బలమైన ఆహారం కూడా . వీటిలో మంచి కొవ్వులు, మినరల్స్, అమైనో ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని వల్ల పిల్లలు బాగా హైట్ పెరుగుతారు.