భర్తలకు చాణక్యుడి గ్రేట్ సీక్రెట్....మీ లైఫ్ కి తిరుగుండదు..!
భార్యభర్తలు అంటే దాపరికాలు ఉండకూడదని, జీవితంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ప్రతిదీ పంచుకోవాలని అందరూ చెబుతూ ఉంటారు. అప్పుడే అది దాంపత్య బంధం అవుతుంది అంటారు. కానీ.. చాణక్యుడు మాత్రం అన్నీ చెప్పకండి బ్రో అంటున్నాడు.
ఆచార్య చాణక్యుడి గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన రాజకీయాలు, దౌత్యం, ఆర్థిక శాస్త్రాల గురించి మాత్రమే కాదు... దాంపత్య జీవితం సంతోషంగా సాగాలంటే భార్యభర్తలు ఎలా ఉండాలనే సీక్రెట్ కూడా చాణక్యుడు ఎప్పుడో చెప్పేశాడు. ప్రస్తుత ఆధునిక కాలానికి అనుగుణంగా.. ఈ కాలం వారికి కూడా సూటయ్యేలా ఆయన దాంపత్య సూత్రాన్ని కనుగొన్నాడు. అది కూడా స్పెషల్ గా భర్తల కోసమే. మరి ఆ గ్రేట్ సీక్రెట్ ఏంటో చూసేద్దాం...
Chanakya Niti Life Management
భార్యభర్తలు అంటే దాపరికాలు ఉండకూడదని, జీవితంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ప్రతిదీ పంచుకోవాలని అందరూ చెబుతూ ఉంటారు. అప్పుడే అది దాంపత్య బంధం అవుతుంది అంటారు. కానీ.. చాణక్యుడు మాత్రం అన్నీ చెప్పకండి బ్రో అంటున్నాడు. మీరు చదివింది నిజమే. ఎలాంటి సీక్రెట్స్ భర్త.. తమ భార్యల దగ్గర నుంచి దాచి పెట్టాలో తెలుసుకుంటే... లైఫ్ లో తిరుగుండదట. మరి, అవేంటో ఓసారి చూద్దాం...
Chanakya Niti Life Management
1.ఆదాయ వివరాలు..
భర్త సంపాదన తెలియని భార్య ఉంటుందా..? ఈ సందేహం మీకు రావచ్చు. కానీ... ఈ విషయంలో కచ్చితంగా భర్త అనేవాడు సీక్రెట్ మెయింటైన్ చేయాలట. అప్పుడే వాళ్ల లైఫ్ హ్యాపీగా ఉంటుందట. చాణక్యుడి ప్రకారం.. పొరపాటున కూడా భర్త సంపాదన వివరాలను చెప్పకూడదట. ఎందుకంటే భర్తకు ఎక్కువ ఆదాయం ఉన్నప్పుడు భార్య ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఇది అనవసరమైన ఖర్చులకు దారి తీస్తుంది. పొదుపు స్థిరంగా ఉండదు. ముఖ్యంగా మీరు కష్ట సమయాల్లో నగదు కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉందట. అలా కాకుండా.. భార్యకు తెలీకుండా కాస్త పొదుపు చేయాలట.
Chanakya Niti Life Management
2.అవమానం..
పది మందిలో భర్తను ఎవరైనా పొగిడితే అది భార్యకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కానీ.. ఎవరైనా తన భర్తను అవమానించారు అంటే.. ఎవరికైనా బాధగానే ఉంటుంది. ముఖ్యంగా భార్య.. తన భర్తకు జరిగిన అవమానాన్ని అస్సలు మర్చిపోలేదట. తన భర్తను అవమానించిన వారిపై పగ పెంచుకుంటుంది తప్ప.. శాంతించాలని అనుకోదట. దీని వల్ల.. ఆ భర్తకు అవసరపు గొడవలు రావడం తప్ప మరెలాంటి ఉపయోగం లేదు అని చాణక్యుడు చెబుతున్నాడు. అందుకే.. మీకు జరిగే అవమానాలు మాత్రం భార్యతో పంచుకోకూడదట.
Chanakya Niti
3.బలహీనతలు..
ఆచార్య చాణక్యుడి సిద్ధాంతం ప్రకారం, భర్త తన బలహీనతలను భార్య నుండి ఎప్పుడూ దాచాలి. ఎందుకంటే కొన్నిసార్లు భార్య కూడా తన పనిని పూర్తి చేయడానికి భర్త బలహీనతను ఉపయోగించుకుంటుంది. ఇది ఇంట్లో సమాజంలో అవమానానికి దారితీస్తుందని గుర్తుంచుకోండి.
Chanakya Niti
4. విరాళం:
రహస్య దానం గొప్ప దానమని అంటారు. మీరు ఒక చేత్తో ఇచ్చినప్పుడు, మరొక చేత్తో తెలియజేయవద్దు అని చెప్పడం మీరు విన్నారు. అదేవిధంగా, ప్రతి ఒక్కరూ వారి వారి సామర్థ్యాన్ని బట్టి దానం చేస్తారు. అటువంటి పరిస్థితిలో, భర్త తన భార్య నుండి విరాళం గురించి సమాచారాన్ని దాచాలని చాణక్యుడు చెబుతున్నాడు. మీరు చేసే దానధర్మాలు భార్యకు తెలిస్తే.. వాటి ధర్మమే పోతుందట.