Roundup 2021: ఈ ఏడాది తల్లిదండ్రులైన సెలబ్రెటీలు వీరే..!
కొందరు సెలబ్రెటీలు..ఈ ఏడాది తల్లిదండ్రులుగా మారారు. తమ జీవితంలోకి.. మరో చిన్నారిని తమ జీవితంలోకి ఆహ్వానించిన సెలబ్రెటీలు ఎవరో ఓసారి చూసేద్దామా..
మరో వారం రోజుల్లో మనమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. చాలా మందికి ఈ 2021 మధురమైన అనుభూతులను అందించింది. అయితే.. మనలాగానే.. కొందరు సెలబ్రెటీలు..ఈ ఏడాది తల్లిదండ్రులుగా మారారు. తమ జీవితంలోకి.. మరో చిన్నారిని తమ జీవితంలోకి ఆహ్వానించిన సెలబ్రెటీలు ఎవరో ఓసారి చూసేద్దామా..
1.అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ..!
నటి అనుష్క శర్మ- క్రికెటర్ విరాట్ కోహ్లీ లు.. డిసెంబర్ 1, 2017లో.. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అతి కొద్ది మంది అతిథుల మధ్య వీరి వివాహం జరిగింది. కాగా... ఈ జంట ఈ ఏడాది.. జనవరి 11న తల్లిదండ్రులుగా మారారు. ఈ ఏడాది జనవరి 11న తమ కూతురు వామికకు స్వాగతం పలికారు. అయితే.. వామిక ఫోటోలను మాత్రం ఇప్పటి వరకు వీరు బయటకు రానివ్వలేదు.
Neha dhupiya
2.నేహా దూపియా- అంగడ్ బేడి..!
నటి నేహా ధూపియా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా 10 మే 2018న తన 'బెస్ట్ ఫ్రెండ్' ని వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొద్ది నెలలకే వీరు మొదటి బిడ్డకు జన్మినిచ్చారు. ఈ ఘటన అందరినీ షాకింగ్ గురి చేసింది. గర్భం దాల్చిన తర్వాతే వారు పెళ్లి చేసుకున్నారనే విషయం అర్థమైంది. కాగా... ఈ ఏడాది అక్టోబరు 3న ఈ దంపతులు తమ రెండో బిడ్డకు జన్మనిచ్చారు.
3.దియా మీర్జా..
నేహా ధూపియా మాదిరిగానే, నటి దియా మీర్జా కూడా వ్యాపారవేత్త సాహిల్ సంగతో వివాహం చేసుకున్న వెంటనే తన మగబిడ్డను స్వాగతించింది. ఆమె కుమారుడు, అవ్యాన్ మే 14న జన్మించాడు. దియా మీర్జా కూడా.. గర్భం దాల్చిన తర్వాతే పెళ్లి చేసుకుందనే వార్తలు వినిపించాయి.
4.ప్రీతీ జింటా..
నటి ప్రీతీ జింటా.. ఆమె భర్త జీన్ గుడ్ నఫ్ ఈ ఏడాది తల్లిదండ్రులుగా మారారు. వీరు సరోగసి విధానంలో.. నవంబర్ 18న కవల పిల్లలను పొందారు. ఈ జంటకు పెళ్లయి ఐదేళ్లయింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు.
5.శ్రేయా గోషల్..
ఫేమస్ సింగర్ శ్రేయా గోషల్ కూడా.. ఈ ఏడాది తల్లి అయ్యారు. తాను గర్భవతి అంటూ ఆమె ఈ ఏడాది మార్చిలో ప్రకటించారు. ఆమె 2015 లో వ్యవస్థాపకుడు శిలాదిత్య ముఖోపాధ్యాయను వివాహం చేసుకుంది. ఈ సంవత్సరం మే 22న ఈ జంట తమ మగబిడ్డ దేవయాన్ ముఖోపాధ్యాయను స్వాగతించారు.