మహమ్మారి టైంలో శృంగారంలో రెచ్చిపోయిన కెనడియన్లు.. అయితే భాగస్వామితో కాదట..
ఆశ్చర్యకరంగా భాగస్వామితో లేనివారి లైంగికకార్యకలాపాలు పెరిగాయి. అదే వీరు కూడా భాగస్వామితో కలిసి ఉంటే దీంట్లో కూడా కచ్చితంగా తగ్గుదల కనిపించేది.వీరి పరిశోధనలు ఏవీ మీడియా అంచనాలను నిజం చేయలేకపోయాయి. భాగస్వామితో లేకపోవడం వల్ల లైంగిక కార్యకలాపాలు పెరగడం వారి విశాల హృదయాన్ని చూపించింది.
మార్చి 2020లో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సమయంలో.. తొమ్మిది నెలల తరువాత బేబీ బూమ్ వస్తుందని మీడియా గగ్గోలు పెట్టింది. మహమ్మారి కారణంగా జంటలకు కావాల్సినంత ఏకాంతం లభించడం వల్ల.. ఇక అదేపనిలో ఉంటారని, దీనివల్ల జనాభాలెక్కల్లో మార్పులొస్తాయంటూ అంచనాలు వేశాయి.
అయితే, ఈ మీడియా కథనాలు కెనడియన్ల విషయంలో నిజం కాలేదు. ఇంకా చెప్పాలంటే మహమ్మారి కారణంగా కెనడా వాసుల లైంగిక జీవితం నష్టం వాటిల్లిందనే చెప్పొచ్చు. ఈ విషయాన్ని మహిళల లైంగిక ఆరోగ్యం విషయంలో రీసెర్చ్ చైర్, బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ అబ్ స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ప్రొఫెసర్ ఒకరు తెలిపారు.
తను గత రెండు దశాబ్దాలుగా లైంగిక వాంఛలు అనే అంశం అంశం మీద అధ్యయనం చేస్తున్నారు. దీంట్లో భాగంగా యుబిసి లైంగిక ఆరోగ్య పరిశోధనలో మా బృందం మహమ్మారి ప్రారంభంలో లైంగిక కోరికలు, ప్రవర్తన మీద ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులో వ్యక్తుల లైంగిక కోరికలు, సంబంధం, ఆచరణల మీద మహ్మమ్మారి ఏ విధంగా ఒత్తిడి చూపిస్తుంది. జీవన పరిస్థితులను ఎలా మారుస్తుంది, మార్చింది? అనే ప్రశ్న అడిగారు.
దీనికోసం వీళ్లు కెనడాలోని అన్ని ప్రావిన్సులు, టెరిటరీలనుంచి 1,019 మందిని ఎంచుకున్నారు. 19-81 వయసు మధ్య ఉన్న వారిని ఈ అధ్యయనానికి ఎన్నుకున్నారు. సగటు వయసు 30 యేళ్లు.వీరిలో 70 శాతం మంది తెల్లవారు కాగా, 30 శాతం మిగతా జాతీయులు ఉన్నారు. వీరిలో సగానికి పైగా హెటిరో సెక్సువల్స్ కాగా, 7 శాతం మంది బైనరీ జెండర్ గా గుర్తించారు. మొత్తానికి 37 శాతం మంది తమ భాగస్వామితో ఉన్నారు. మహమ్మారి లైంగిక జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి ఈ వేరియేషన్ చాలా ముఖ్యం.
లాక్‌డైన్ ప్రారంభంలో కరోనా వైరస్ ఒత్తిడి వల్ల ఇంట్లో భాగస్వామి మీద లైంగిక ఒత్తిడి అధికంగా పడింది. అయితే ఇది ఒంటరిగా ఉంటున్న వ్యక్తుల్లో ఎలాంటి ప్రభావం చూపించలేదు. అయితే ఇదేమంత ఆశ్చర్యకరమైన విషయం కాదు. కారణం ఏంటంటే.. ఇంతకుముందు కొన్ని మహమ్మారుల సమయంలోనూ భాగస్వాముల మధ్య ఇలాంటి లైంగిక హింస రేటు పెరగడం కనిపించింది. లైంగిక హింస రేటు పెరగడం దీర్ఘకాలంలో ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు మహిళా భద్రతకోసం షెల్లర్లు అందుబాటులో లేకపోవడం.. తప్పనిసరి భాగస్వామితో ఉండాల్సి రావడంతో ఈ హింస ప్రభావం మహిళల మీద అధికంగా పడింది.
అయితే, మీడియా అంచనాలకు విరుద్ధమైన మరో అంశం వీరి అధ్యయనంలో బయటపడింది. తమ భాగస్వాములతో కలిసి ఉంటున్న వారిలో కూడా.. భాగస్వామితో కాకుండా తమతో తాము శృంగారం చేయాలన్న కోరిక పెరిగింది. హస్తప్రయోగం చేసుకునేవారి సంఖ్య ఎక్కువయ్యింది.
ఇక లాక్ డౌన్ తరువాత 2020 వేసవి సెలవుల్లో లైంగికాసక్తి ఎలా ఉందన్న దానిమీద కూడా మేము అధ్యయనం చేశాం. ఆ సమయానికి నిబంధనలన్నీ సడలించబడ్డాయి. మామూలుగా సోషల్ లైఫ్ గడుపుతున్నారు. అప్పటికే లైంగికంగా కలవక నెలలు గడుస్తున్నాయి. అయినా కూడా వీరిలో లైంగికాసక్తి తగ్గింది కానీ పెరగలేదు. ఇక ఆశ్చర్యకరంగా భాగస్వామితో లేనివారి లైంగికకార్యకలాపాలు పెరిగాయి. అదే వీరు కూడా భాగస్వామితో కలిసి ఉంటే దీంట్లో కూడా కచ్చితంగా తగ్గుదల కనిపించేది.
వీరి పరిశోధనలు ఏవీ మీడియా అంచనాలను నిజం చేయలేకపోయాయి. భాగస్వామితో లేకపోవడం వల్ల లైంగిక కార్యకలాపాలు పెరగడం వారి విశాల హృదయాన్ని చూపించింది. ఇక సహజీవనం చేస్తున్న జంటలు ఎక్కువ సమయం కలిసి గడపడం వల్ల అది వారి లైంగికతను ఒత్తిడికి గురి చేసింది. వర్క్ ఫ్రం హోం, సోషల్ గాదరింగ్స్ తగ్గిపోవడం, ఆర్థిక పరమైన ఇబ్బందులు, ట్రావెలింగ్ నిషేధం ఇవన్నీ కెనడావాసుల లైంగిక జీవితాలమద ఈ స్తాయిలో ప్రబావం చూపించడంలో ఆశ్చర్యం లేదంటున్నారు అధ్యయనకారులు.
యూరప్, యునైటెడ్ స్టేట్స్ లో జరిపిప మా అధ్యయనాల్లో మరో వెలుగు చూసిన మరో అంశం.. లైంగిక విద్య పెరగడం. కిన్సే ఇనిస్టిట్యూట్ పరిశోధకలు నేతృత్వంలో జరిపిన అధ్యయనంలో కొద్దిమంది మరింత వైవిద్యమైన, ప్రయోగాత్మకమైన లైంగిక కార్యకలాపాల్లో మునిగిపోయారు. అంతేకాదు హస్తప్రయోగాలూ ఎక్కువగానే ఉన్నాయి. పాండమిక్ స్ట్రెస్, ఒంటరితనాన్ని అధిగమించడానికి ఇదొక మార్గంగా మారింది.
ఈ ఫలితాలను వల్ల లైంగిక కోరిక, ప్రవర్తన ఎలా మారుతుందో చెప్పడం కంటే ఇంకా ఎలా ఉపయోగించుకోవచ్చు? అంటే చాలామంది నిపుణులు కోవిడ్ 10 మహమ్మారి వల్ల శాశ్వత మానసిక సామాజిక ప్రభావాలను అంచానా వేస్తున్నారు. లైంగికత, స్పందించడం విషయంలో ఇది బాగా ప్రభావం చూపించింది. లైంగిక ఆరోగ్యం విషయంలో బాధపడుతున్న వ్యకులకు మద్ధతు ఎలా ఇవ్వాలో చెప్పడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. లైంగికవిముఖత, యాంగ్జైటీ, ఒత్తిడి, రిలేషన్ సాటిస్ ఫాక్షన్, ఆరోగ్య అపోహలు, సెక్స్ విషయంలో అపోహలు ఇలాంటి విషయాల్లో నిజాయితీగా మాట్లాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.