వ్యాయామం ప్లస్ తక్కువ కేలరీలు... ఇలా చేస్తే గుండె పదిలం...
కాస్త వ్యాయామంతో పాటు, రోజుకు 200 క్యాలరీలను మీ ఆహారంలో తగ్గించుకోవడం వల్ల ఎంత మేలు జరుగుతుందో ఒక అధ్యయనం తెలిపింది. దీనివల్ల వృద్ధులు, ఊబకాయంతో బాధపడుతున్నవారికి ఎంతో మేలు కలుగుతుంది. ఇక గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుందట.
గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నవారికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని డాక్టర్లు, పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఏరోబిక్ వ్యాయామాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వ్యాయామం వల్ల గుండె కండరాలు బలోపేతం అవుతాయి. రక్తపోటు, హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. వ్యాయామం హృద్రోగికి స్నేహితుడిగా చెప్పబడుతుంది. అయితే, హృద్రోగుల విషయంలో ఆహారం కూడా ఎలాంటి పాత్ర పోషిస్తుంది?
కాస్త వ్యాయామంతో పాటు, రోజుకు 200 క్యాలరీలను మీ ఆహారంలో తగ్గించుకోవడం వల్ల ఎంత మేలు జరుగుతుందో ఒక అధ్యయనం తెలిపింది. దీనివల్ల వృద్ధులు, ఊబకాయంతో బాధపడుతున్నవారికి ఎంతో మేలు కలుగుతుంది. ఇక గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుందట. అంటే చక్కటి ఆరోగ్యం కోసం ఆహారం, వ్యాయామం ఒకదానిలో ఒకటి ఎలా కలిసిపోయాయో ఈ అధ్యయనం చెప్పుకొచ్చింది.
స్థూలకాయులైన వృద్ధులలో, ఏరోబిక్ వ్యాయామం రోజువారీ కేలరీలలో ఒక మోస్తరు తగ్గించడం వల్ల బృహత్ ధమని సంబంధ దృఢత్వం ఏర్పడుతుందని తేలింది. ఇది కేవలం వ్యాయామం ఒక్కటే చేయడంతో పోలిస్తే... వ్యాయామం, ఆహారంలో కేలరీల సంఖ్య తగ్గించడం రెండూ చేసిన వారిలో మంచి ఫలితం లభించింది. ఈ అధ్యయనం ఫలితాలు 'సర్క్యులేషన్' పత్రికలో ప్రచురించబడ్డాయి.
ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు క్రమం తప్పని శారీరక శ్రమను జీవనశైలిలో భాగం చేయడం వల్ల వయసు పెరుగుదల వల్ల గుండె సంబంధఆరోగ్యంలో కలిగే ఇబ్బందుల్ని దరి చేరకుండా చేయవచ్చు. ఏరోబిక్ వ్యాయామం సాధారణంగా బృహద్ధమని నిర్మాణం, పనితీరుపై అనుకూలమైన ప్రభావాలు కలిగిస్తున్నా.. ఊబకాయం ఉన్న వృద్ధులలో బృహద్ధమని సంబంధ దృఢత్వాన్ని మెరుగుపరచడానికి వ్యాయామం ఒక్కటే సరిపోదని తేలింది.
అధ్యయనకారులు ఏం చెబుతున్నారంటే..
బరువు తగ్గడానికి కేలరీలను పరిమితం చేయడం వల్ల ఊబకాయం ఉన్న వృద్ధులలో ఏరోబిక్ వ్యాయామంతో పోలిస్తే రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడుతుందో లేదో తెలుసుకోవడానికి వీరు ప్రయత్నించారు. ఈ అధ్యయనాన్ని 65-79 సంవత్సరాల వయస్సు గల 160 మంది పెద్దలు, ఊబకాయంతో (BMI = 30-45 kg/m2) ఉన్నవారిమీద ప్రయోగించి చూశారు. ఈ అధ్యయనంలో పాల్గొనేవారి సగటు వయస్సు 69 సంవత్సరాలు. దీంట్లో 74 శాతం మంది మహిళలు, 73 శాతం మంది తెల్లవారు పాలు పంచుకున్నారు.
వీరిని మూడు గ్రూపులగా విడగొట్టారు. 20 వారాలపాటు ఈ అధ్మయనం సాగింది. మొదటి గ్రూపులో వారికి రెగ్యులర్ డైట్‌తో, వ్యాయామం, రెండవ గ్రూపులో వారికి వ్యాయామంతో పాటు మితమైన కేలరీల పరిమితి (సుమారు 250 కేలరీలు/రోజు తగ్గింపు), మూడో గ్రూపుకు వ్యాయామం మరింత ఇంటెన్సివ్ కేలరీల పరిమితి ( సుమారు 600 కేలరీలు/రోజు తగ్గింపు)గా విభజించారు.
ఇక కేలరీలు పరిమితం చేయబడిన రెండు గ్రూపుల వారికి 30శాతం కంటే తక్కువ కొవ్వు, తక్కువ కేలరీలు ఉన్న ఆహారం అదికూడా శరీరబరువులో కేజీకి.. .8 గ్రాముల ప్రోటీన్ ఉండేల తయారు చేసిన ఆహారాన్ని డైటీషన్ పర్యవేక్షణలో తయారు చేశారు.
వీరందరూ ఏరోబిక్ వ్యాయామాలు చేస్తూ 20 వారాల అధ్యయనంలో పాల్గొన్నారు.
ఇక ఈ అధ్యయనం ఫలితాల విషయానికి వస్తే... ఐదు నెలల అధ్యయన కాలంలో మొత్తం శరీర బరువులో దాదాపు 10% లేదా దాదాపు 20 పౌండ్ల బరువు తగ్గడం బృహద్ధమని సంబంధ దృఢత్వంలో గణనీయమైన మెరుగుదలలతో సంబంధం కలిగి ఉందని ఫలితాలు తేల్చాయి.
అంతేకాదు వ్యాయామం, తక్కువ క్యాలరీ గ్రూపుల్లోని వారిలో ఈ ఫలితాలు చాలా బాగున్నాయి.
వ్యాయామం మరియు మితమైన కేలరీల పరిమితి సమూహం డిస్టెన్సిబిలిటీలో 21 శాతం పెరుగుదల మరియు పిడబ్ల్యువిలో 8 శాతం తగ్గుదల కలిగి ఉంది.
వ్యాయామం-మాత్రమే సమూహం లేదా వ్యాయామం, మరింత ఇంటెన్సివ్ కేలరీ పరిమితి సమూహంలో బృహద్ధమని సంబంధ దృఢత్వం కొలతల్లో పెద్ద మార్పేమీ లేదు.
వ్యాయామం-మాత్రమే గ్రూపుతో పోలిస్తే రెండు కేలరీలు-నిరోధిత సమూహాలలో BMI, మొత్తం కొవ్వు ద్రవ్యరాశి, శాతం శరీర కొవ్వు, ఉదర కొవ్వు, నడుము చుట్టుకొలతలో మార్పులు ఎక్కువగా ఉన్నాయి.
ఇంటెన్సివ్ కేలరీ పరిమితి సమూహంలో దాదాపు రెండు రెట్లు తక్కువ కేలరీలు (కేలరీలలో 26.7 శాతం తగ్గింపు వర్సెస్ 14.2 శాతం కేలరీలు తగ్గింపు) ఉన్నప్పటికీ కేలరీ-నిరోధిత సమూహాల మధ్య బరువు తగ్గడం సమానంగా ఉంటుంది.