మగాళ్ళూ... మీ స్పెర్మ్ క్వాలిటీ కోసం 5 టిప్స్...
మగాళ్లలో సంతానోత్సత్తి సమస్యలకు ప్రదాన కారణం వీర్యకణాలు. ఇవి ఎంత నాణ్యంగా వుంటే సంతానోత్పత్తి అవకాశాలు అంత ఎక్కువగా వుంటాయి. మరి స్పెర్మ్ క్వాాలిటీగా వుండాలంటే...
Sperm Count
ఈతరం దంపతుల్లో లైంగిక సమస్యలు ఎక్కువయి పోయాయి. జీవనశైలిలో వచ్చిన మార్పులు, అహారపు అలవాట్లు, పని ఒత్తిడి... కారణం ఏదయితేనేం మగవాళ్లలో లైంగిక శక్తి తగ్గుతోందనేది స్పష్టంగా అర్థమవుతోంది. పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా చాలామందికి సంతానం కలగడంలేదు... ఇలాంటి వాళ్లు పరిగిపోవడంతోనే ఎక్కడికక్కడ ఫెర్టిలిటి సెంటర్లు వెలుస్తున్నాయి.
పిల్లలు పుట్టకపోవడానికి మగవాళ్ళలో వీర్యకణాల సంఖ్య, నాణ్యత తగ్గడం కూడా ఓ కారణమే. ఇలాంటి సమస్యతో బాధపడేవారు కొన్నిరకాల విటమిన్లు, పోషకాలు అధికంగా లభించే ఆహార పదార్థాలు తీసుకుంటే మంచి ఫలితం వుంటుందని నిపుణులు చెబుతున్నారు.
Vitamin C
విటమిన్ సి :
మగవాళ్లలో వీర్యకణాల నాణ్యతను పెంచడంలో విటమిన్ సి తోడ్పడుతుంది. అందువల్లే నిమ్మ, నారింజ,ఉసిరి, ఆకుకూరలు, బంగాళాదుంప, టమాటో వంటివాటి సి విటమిన్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు తీసుకోవాలి.
Vitamin E
విటమిన్ ఇ :
మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరగడానికి విటమిన్ ఇ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విటమిన్ ఎక్కువగా వుండే విత్తనాలు,గింజలు, వేరుశనగ, బాదం, పొద్దుతిరుగుడు గింజలు, అవకాడో వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
zink
జింక్ :
మాంసంలో జింక్ ఎక్కువగా వుంటుంది. అలాగే పీతలు, పుట్టగొడుగులు, జీడిపప్పు, బాదం, ఓట్స్, పాలు,పెరుగు, గుమ్మడికాయ గింజలు వంటి అహార పదార్ధాల్లోనూ జింక్ అధికంగా వుంటుంది. కాబట్టి సంతాన సమస్యతో బాధపడే మగవాళ్ళు జింక్ అధికంగా వుండే అహార పదార్థాలు తీసుకోవాలి.
omega 3
ఒమెగా-3 :
ఒమెగా 3 ఫ్యాటి యాసిడ్స్ మగవాళ్లలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇందుకోసం సాల్మన్, ట్యూనా వంటి చేపలు, వాల్నట్స్, చియా సీడ్స్,అవిసె గింజలు, సోయా బీన్స్ వంటివి తీసుకోవాలి.
Body building
వ్యాయామం :
మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడంతో పాటు మంచి వ్యాయామం కూడా సంతానోత్పత్తి సామర్థ్యం పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా శారీరక వ్యాయామంలో పాల్గొనడం మంచిది.