Body Heat: ఒంట్లో వేడి తగ్గాలంటే ఈ పండ్లను తినండి..
Body Heat: ఎండాకాలం వచ్చిందంటే చాలు శరీరంలో ఉన్న నీరంతా బయటకు పోతూ ఉంటుంది. దీంతో బాడీ డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. దీనికి తోడు ఈ కాలంలో చాలా మంది ఒంట్లో వేడి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఈ వేడిని తగ్గించడానికి కొన్ని రకాల పండ్లు బాగా సహాయపడతాయి. అవేంటంటే..

Body Heat: ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ మండుతున్న ఎండలకు ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదీకాక కాసేపు ఎండలో ఉన్నా ఒంట్లో ఉన్న నీరంతా చెమట రూపంలో బయటకు వెళ్లిపోతూ ఉంటుంది. దీంతో మాటిమాటికి దాహం అవడం, బాడీ డీహైడ్రేషన్ బారిన పడటం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ డీహైడ్రేషన్ కారణంగా ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో బాడీని చల్లాగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఈ సీజన్ లో బాడీ చల్లగా ఉండాలంటే మాత్రం నీళ్లను ఎక్కువగా తాగడంతో పాటుగా కొన్నిరకాల పండ్లను కూడా ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండ్లను తినడం వల్ల శరీరం చల్లగా ఉండటమే కాదు.. డీహైడ్రేషన్ బారిన పడే అవకాశమే ఉండదు. ఒంట్లో వేడిని తగ్గించే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయ.. ఈ సీజన్ లో పుచ్చకాయ పండ్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండులో 90 శాతం నీరు ఉంటుంది. దీన్ని తింటే శరీరం చల్లబడటంతో పాటుగా హైడ్రేటెడ్ గా కూడా ఉంటారు. అంతేకాదు దీన్ని రెగ్యులర్ గా తింటే జీర్ణ సంబంధింత సమస్యలు తొలగిపోతాయి. అందుకే ఈ సీజన్ లో ఈ పండును తరచుగా తింటూ ఉండండి.
=
మ్యాంగో జ్యూస్.. ఈ వేసవిలో మామిడి పండ్లకు కొదవ ఉండదు. ఇక బయట అయితే మ్యాంగో జ్యూస్ ఓ రేంజ్ లో అమ్ముడవుతుంది. ఈ సీజన లో మ్యాంగో జ్యూస్ ను తాగడం వల్ల హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశమే ఉండదు. అంతేకాదు ఇది పొట్టను కూల్ గా ఉంచుతుంది. ఈ సీజన్ లో వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.
mulberry
మల్బరీ.. మల్బరీ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. ఇవి మనల్నిఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. ముఖ్యంగా ఈ పండ్లను మధుమేహులు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ పండ్లు రక్తంలోని షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తాయి.
స్ట్రాబెర్రీలు.. స్ట్రాబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి వేసవిలో వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ సీజన్ లో వీటిని తింటే ఒంట్లో వేడి ఇట్టే తగ్గిపోతుంది. అలాగే మనల్ని రీఫ్రెష్ గా ఉంచుతుంది.
దోసకాయ.. వేసవిలో ఎక్కువగా అమ్ముడయ్యే వాటిలో దోసకాయ ఒకటి. ఇది ఒంట్లో వేడిని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. ఎందుకంటే ఈ దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్ లో దోసకాయలను ఎక్కువగా తింటే హైడ్రేటెడ్ గా ఉండటంతో పాటుగా బాడీ కూడా కూల్ గా ఉంటుంది.
మస్క్ మెలోన్.. ఈ సీజన్ లో మస్క్ మెలన్ పండ్లను ఎక్కువగా తినడం వల్ల బాడీ హీట్ అవుతుందన్న టెంన్షనే ఉండదు. ఎందుకంటే ఇది బాడీని చల్లగా ఉంచుతుంది. ఈపండును అలాగే తినొచ్చు లేదా జ్యూస్ గా చేసుకుని అయినా తీసుకోవచ్చు.