చలికాలంలో స్నానం ఎప్పుడు చేస్తే మంచిది?
చలికాలంలో స్నానం చేయడమనేది ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే వణికించే చలిలో బాత్ రూంలోకి వెళ్లి స్నానం చేయడమంటే మామూలు విషయం కాదు మరి. కానీ స్నానం చేస్తేనే మనం హెల్తీగా ఉంటాం. అయితే చలికాలంలో ఎప్పుడు స్నానం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రోజూ స్నానం చేస్తేనే ఆరోగ్యంగా ఉంటామన్న మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. స్నానం మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. ఇది మన శరీరాన్ని బిగుతుగా కూడా ఉంచుతుంది.
స్నానం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఎన్నో. చాలా మంది ఎండాకాలంలో ఒక్కసారి కాదు రోజుకు మూడు సార్లు కూడా చేస్తుంటారు. కానీ చలికాలంలో మాత్రం స్నానం పేరు ఎత్తితేనే భయపడిపోతుంటారు. ఎందుకంటే చలికాలంలో వెదర్ చాలా చల్లగా ఉంటుంది. ఎంత వేడి నీళ్లతో స్నానం చేసినా.. తర్వాత పక్కాగా చలిపెడుతుంటుంది. అందుకే ఈ సీజన్ లో చాలా మంది రోజు తప్పించి రోజు లేదా రెండు రోజులకోసారి స్నానం చేస్తుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ స్నానం చేయాలి.
సీజన్ ఏదైనా సరే ప్రతిరోజూ స్నానం చేయాలంటారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. కానీ చలికాలంలో ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయకూడదు. లేదంటే జలుబు చేసి జ్వరం వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాదు న్యుమోనియా బారిన కూడా పడతారు. అందుకే చలికాలంలో ఎప్పుడు స్నానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చలికాలంలో ఎన్ని రోజులకోసారి స్నానం చేయాలి?
చలికాలంలో దగ్గు, జలుబుతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు తరచుగా వస్తూనే ఉంటాయి. ఇలాంటి సమయంలో రోజూ స్నానమంటే పెద్ద టాస్కే. అయితే చలికాలంలో స్నానం చేయడమనేది మీ శరీర స్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలంటారు ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు. ఎందుకంటే చలికాలంలో రోజూ స్నానం చేస్తే చర్మంపై నీరు లేదా సబ్బుకు అలెర్జీ వస్తుందని చాలా మంది చెబుతుంటారు. అంతకాదు జలుబు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అందుకే ఎవ్వరైనా సరే శరీరాన్ని బట్టి స్నానం చేయాలంటారు ఆరోగ్య నిపుణులు.
స్నానం చేయడానికి బెస్ట్ టైం ఏది?
చలికాలంలో స్నానం చేయడానికి బెస్ట్ టైం ఏదైనా ఉందా అంటే అది ఎండ ఉన్నప్పుడే అనాలి. ఉదయాన్నే ఎండ ఉంటే అప్పుడు ఎంచక్కా స్నానం చేయొచ్చు. అంటే మీరు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్నానం చేయొచ్చన్న మాట. ఎందుకంటే ఈ సమయంలో ఎండ బాగా ఉంటుంది. మీరు స్నానం చేసిన వెంటనే కాసేపు ఎండలో కూర్చుంటే జలుబు వంటి ఎలాంటి సమస్యలు రావు. అలాగే మీ వెంట్రుకలు కూడా త్వరగా ఆరుతాయి.
చలికాలంలో స్నానం ఎలా చేయాలి?
గోరువెచ్చని నీటిని వాడండి: ఎట్టి పరిస్థితితో చలికాలంలో చల్లనీళ్లతో ఉదయం, రాత్రిళ్లు స్నానం చేయకూడదు. ఈ సీజన్ లో గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడమే మంచిది. ఎందుకంటే ఈ నీళ్లు మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అలాగే మీకు జలుబు కూడా చేయదు.
స్నానం తర్వాత చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయండి: చలికాలంలో స్నానం చేసిన తర్వాత మర్చిపోకుండా మాయిశ్చరైజ్ చేయాలి. ఎందుకంటే ఇది మీ చర్మాన్ని తేమగా చేస్తుంది. ఇందుకోసం మీరు క్రీమ్, ఆయిల్ ను వాడొచ్చు. వీటిని వాడకపోతే చర్మం పొడిబారుతుంది.
Image: Getty
తగిన సబ్బును ఎంచుకోండి: చలికాలంలో స్నానానికి మంచి సబ్బును వాడాలి. ఎందుకంటే కొన్ని రకాల సబ్బుల్లో ఉండే కెమికల్స్ చర్మానికి హాని చేస్తాయి. అందుకే కెమికల్స్ ఎక్కువగా లేని సబ్బులను వాడాలి. ముఖ్యంగా చర్మం కూడా పొడిబారుతుంది. ఇలాంటి సబ్బును వాడకుండా ఉండాలి.