బొడ్డుకు ఈ నూనె రాస్తే పీరియడ్స్ నొప్పి నుంచి మొటిమల వరకు ఎన్ని సమస్యలు తగ్గిపోతాయో తెలుసా..
బొడ్డుకు రెండు చుక్కల నూనె రాయడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయోజనాలున్నాయి తెలుసా.. మొటిమల నుంచి పీరియడ్స్ పెయిన్ వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.
చిన్న పిల్లలకు శరీరమంతా నూనెతో రాస్తుంటారు. ఈ సమయంలో బొడ్డుపై నూనె వేయడం చాలా మందే చూసుంటారు. దీనిని ఈ ఆధునిక యుగంలో బెల్లీ బటన్ థెరపీ అని పిలుస్తున్నారు. ఈ బెల్లీ బటన్ థెరపీ ఎన్నో ఏండ్ల నుంచి కొనసాగుతూ వస్తోంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. బొడ్డును మానవ శరీర కేంద్ర బిందువు అని కూడా అంటారు. ఎందుకంటే ఇది నాడీ వ్యవస్థకు అనుసంధానించబడి ఉంటుంది. ఇక్కడ నూనెను అప్లై చేయడం వల్ల ఎన్నో వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు. బొడ్డుపై నూనె వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి.
నాభిపై ఆవాల నూనె, కొబ్బరి నూనె, ఆముదం నూనె, ఆలివ్ నూనె లేదా నెయ్యిని వేయొచ్చు. దీనికోసం మీ నాభిపై రెండు మూడు చుక్కల నూనెను దూది సహాయంతో అప్లై చేసి చిన్నగా చేతులతో మసాజ్ చేసి 20 నిమిషాలు లేదా రాత్రంతా అలాగే ఉంచి ఉదయం క్లీన్ చేసే సరిపోతుంది. నిజానికి బొడ్డు వెనుక పెకోటి గ్రంధి ఉంటుంది. ఇది నాడులు, కణజాలాలు, అవయవాలతో అనుసంధానించబడి ఉంటుంది. ఇక్కడ నూనెను అప్లై చేయడం వల్ల మొత్తం శరీరానికి శక్తి అందుతుంది. దీనివల్ల మీరు రీఫ్రెష్ గా ఉంటారు.
కొంతమందికి చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే మొటిమలు, గోర్ల సమస్యలు, నల్లని మచ్చలు వంటి సమస్యలతో బాధపడేవారికి బొడ్డుపై నూనెను రాయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. ఇది ఈ సమస్యలను తొందరగా పోగొడుతుంది.
బాదం నూనె
చర్మం, జుట్టుకు మాత్రమే కాదు ఒత్తిడిని తగ్గించేందుకు కూడా బాదం నూనె ఉపయోగపడుతుంది. ఇందుకోసం రెండు చుక్కల బాదం నూనెను మీ నాభిపై అప్లై చేయండి. ఒత్తిడి క్షణాల్లో తగ్గిపోతుంది. ఒత్తిడి అలాగే మీ చర్మం, జుట్టు కూడా అందంగా మెరిసిపోతాయి.
ఆవనూనె
ఆవనూనె కూడా మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. నాభిపై ఆవనూనెను అప్లై చేయడం వల్ల మీ పెదాలు ఎప్పటికీ పగలవు. అలాగే మృదువుగా, గులాబీ రంగులో ఉంటాయి. ఆవనూనెను మడమకు అప్లై చేయడం వల్ల.. మడమలు పగలవు. అలాగే చర్మం కూడా తేమగా ఉంటుంది. డ్రై నెస్ పోతుంది. ఈ నూనె పీరియడ్స్ నొప్పిని కూడా తగ్గిస్తుంది. నెలసరి నొప్పి పుట్టినప్పుడు నాభిపై ఆవనూనెను అప్లై చేస్తే.. నొప్పి తగ్గుతుంది. కడుపు తిమ్మిరి కూడా తగ్గుతుంది. అలాగే మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయి.
నెయ్యి
ఈ నూనెలకు బదులుగా మీరు బొడ్డుపై స్వచ్ఛమైన నెయ్యిని కూడా అప్లై చేయొచ్చు. నెయ్యిని బొడ్డకు అప్లై చేస్తే డ్రై స్కిన్, డీహైడ్రేషన్ స్కిన్, స్కిన్ సమస్యలు తొలగిపోతాయి. ఇందుకోసం ప్రతిరోజూ మీ నాభిపై స్వచ్ఛమైన నెయ్యిని అప్లై చేయాలి. ఇది మీ చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది.