అశ్వగంధ పురుషుల లైంగిక శక్తిని పెంచడమే కాదు.. ఈ సమస్యలను కూడా పోగొడుతుంది..
పెళ్లైన పురుషులకు అశ్వగంధ దివ్య ఔషదంలా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల వారిలో సంతానోత్పత్తి పెరుగుతుంది. అంతేకాదు ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా పోగొడుతుంది.

ఆయుర్వేద మూలికలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా ఉపయోపడతాయి. ఈ ఆయుర్వేద మూలికల్లో ఒకటైన అశ్వగంధ గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఇది వైద్యం కంటే తక్కువేం కాదు. ఎందుకంటే ఇది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో మెడిసిన్ లా పనిచేస్తుంది. ఇది కేవలం శరీరక సమస్యలే కాదు మానసిక సమస్యలను కూడా తగ్గిస్తుంది. అశ్వగంధ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాల జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
అశ్వగంధ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా సహాయపడుతుంది. దీనిని Stress buster అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇది ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీకు తెలుసా.. ఒత్తిడి, ఆందోళన సమస్యలు మన దేశ జనాభాలో నాలుగోవంతు ప్రజలను వేధిస్తున్నాయి. అయితే చాలా మంది వీటిని తగ్గించుకునేందుకు సహజ పద్దతులనే అనుసరిస్తున్నారు. అందుకే అశ్వగంద సప్లిమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం దొరుకుతుంది.
అశ్వగంధను ఉపయోగించడం వల్ల మనస్సు ప్రశాంతంగా మర్చే సమ్మేళనాలుంటాయి. ఇవి రాత్రిళ్లు మారు హాయిగా నిద్రపోవడానికి కూడా సహాయపడతాయి. అలాగే ఒత్తిని కూడా తగ్గిస్తాయి. అశ్వగంధను ఉపయోగించి గ్యాస్ట్రిక్, అల్సర్ వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చని పలు పరిశోధనల్లో తేలింది.
పురుషుల బలాన్ని పెంచుతుంది
అశ్వగంధ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. అయితే చాలా మంది పురుషుల్లో ఒత్తిడి, ఆందోళన కారణంగా లైంగికంగా వీరు వీక్ అవుతున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దీర్ఘకాలిక ఒత్తిడి వారిని ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ఇలాంటి వారు అశ్వగంధను తీసుకుంటే మంచిది. ఇది పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.
అశ్వగంధ శరీరక శక్తిని, బలాన్ని పెంచుతుంది. అందుకే చాలా మంది క్రీడాకారులు దీన్ని తీసుకుంటారు. ఈ హెర్బ్ ను తీసుకోవడం వల్ల కండరాళ శక్తి పెరుగుతుందని పలు పరిశోధనలు వెల్లడించాయి.
ఆర్థరైటిస్ ను తగ్గిస్తుంది
ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి అశ్వగంధ ఎంతో సహాయపడుతుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.. ఒక అధ్యయనంలో 40 మంది ఆస్టియో ఆర్థరైటిస్ పేషెంట్లు పాల్గొన్నారు. వారికి మూడు నెలల పాటు అశ్వగంధతో పాటుగా ఇతర సప్లిమెంట్లను కూడా ఇచ్చారు. అయితే వీరిలో ఈ సమస్య చాలా వరకు తగ్గిందని పరిశోధకులు వెల్లడించారు.
ఏకాగ్రతను మెరుపరుస్తుంది
అశ్వగంధ ఏకాగ్రతను ను పెంచడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది అభిజ్ఞా పనితీరును కూడా మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అల్జీమర్స్ వ్యాధిని కూడా తగ్గించడంలో ఇది మెడిసిన్ లా పనిచేస్తుంది.