schools reopen : ఈ జాగ్రత్తలు పాటిస్తే.. స్కూల్ కు వెళ్లినా మీ పిల్లలు సేఫ్ గానే...
పిల్లల్లో చాలావరకు కరోనా అసింప్టమాటిక్ గా ఉంటుంది. చాలామంది పిల్లల్లో లక్షణాలు అస్సలు కనిపించవు లేదా తేలికపాటి ఇన్ఫెక్షన్ కలిగి ఉంటారు. అయినా కూడా వారినుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చేయవచ్చు
స్కూల్స్ మళ్లీ తెరుచుకుంటున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి ఆన్ లైన్ క్లాసులు ఉండవని.. పిల్లలందరూ తప్పనిసరిగా స్కూలుకు హాజరు కావాలని విద్యాశాఖ తేల్చేసింది. దీంతో తల్లిదండ్రుల్లో కొత్త భయం మొదలయ్యింది. ఇప్పటివరకు కోడిపిల్లల్ని రెక్కల కింద కాపాడుకున్నట్లు.. రక్షించుకున్న చిన్నారుల్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నామా? అనే భయాందోళనల్లో తల్లిదండ్రులు ఉన్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం అనేక జాగ్రత్తలు తీసుకున్నామని, రెగ్యులర్ శానిటైజేషన్, పిల్లల్ని కూర్చోబెట్టే విధానం, మాస్కులు.. ఇలా కోవిడ్ నిబంధనలు అన్నీ స్ట్రిక్ట్ గా అమలు చేస్తామని హామీ ఇస్తూ.. భరోసా కలిగించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు, కొన్ని అంశాల మీద అవగాహన పెంచుకుంటే పిల్లల్ని స్కూల్ కు పంపినా అంతగా భయపడాల్సిన అవసరం లేదు.
చిన్నపిల్లలూ పెద్దవారిలాగే కరోనా కాటుకు బలవుతున్నారు. అంతేకాదు పిల్లలు కరోనా వారియర్లుగా కూడా పనిచేస్తున్నారు. పిల్లలు పెద్దవారిలాగే కరోనావైరస్ బారిన పడుతున్నారు. పిల్లలు, పెద్దలలో సంక్రమణ, వ్యాప్తి సమానంగా ఉంటాయి. దీనివల్ల పిల్లల్ని స్కూల్ కి పంపడం ఇంట్లోని పెద్దవారికి కూడా ప్రమాదకరమే అనే భావన ఉంది. ఇప్పటికే పిల్లలకూ టీకాలు అందుబాటులోకి వచ్చినా.. ఆ డ్రైవ్ మొదలు కాలేదు. కాబట్టి పిల్లలెవ్వరూ వ్యాక్సినేషన్ తీసుకున్నవారిలో ఉండరు.
పిల్లల్లో చాలావరకు కరోనా అసింప్టమాటిక్ గా ఉంటుంది. చాలామంది పిల్లల్లో లక్షణాలు అస్సలు కనిపించవు లేదా తేలికపాటి ఇన్ఫెక్షన్ కలిగి ఉంటారు. అయినా కూడా వారినుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చేయవచ్చు. పిల్లల్ని స్కూల్ కి పంపడం తప్పదు. ప్రమాదం లేకుండా ఉండాలంటే ఎలా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే... కొన్ని చిట్కాలు పాటిస్తే సరి...
మామూలుగా పిల్లలు లంచ్, స్నాక్స్ టైంలో బాక్సులు షేర్ చేసుకుంటూ ఉంటారు. వాటర్ బాటిల్స్, ఆహారపదార్థాలు ఒకరివి ఒకరు తీసుకుంటుంటారు. అయితే షేరింగ్ మంచి పద్ధతే అయినా ఈ సమయంలో మంచిది కాదని వారికి స్పష్టంగా చెప్పాలి. ఎవరిదీ తను తీసుకోవడం.. తనది ఎవరిక ఇవ్వకుండా ఉండాలని చెప్పాలి. అది వారికి అర్థమయ్యేలా పదే పదే బుర్రలోకి ఎక్కించాలి.
అలాగే.. తరచుగా చేతులు శుభ్రం చేసుకోమని చెప్పాలి. వీలైతే ప్రతీ గంటకోసారి లేదా రెండుగంటలకోసారి 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోమని చెప్పండి.
ఊపిరి ఆడడం లేదని మాస్క్ తీసే పని చేయకూడదని చెప్పండి. అది ఎలా పెట్టుకోవాలి. సరిగా పెట్టుకుంటున్నారా? మధ్యలో తీయకుండా ఉండడమెలా.. మాట్లాడేటప్పుడు కూడా మాస్క్ తీయద్దని చెప్పండి.
ఇక పిల్లల దగ్గర తప్పనిసరిగా శానిటైజర్ బాటిల్ ఉంచాలి. స్కూల్, ఆటలు, హోంవర్క్ ఏం చేస్తున్నా సరే శానిటైజింగ్ చేసుకోవడం మరిచిపోవద్దు. ప్రతీ 20 -30 నిమిషాలకోసారి చేతుల్ని శానిటైజ్ చేసుకోవాలని చెప్పండి. వీలైనంత వరకు చేతులతో ముక్కు, మూతి, కళ్లు, చెవుల దగ్గర తాకొద్దని చెప్పండి. ఇక చివరగా పిల్లలకు వ్యాక్సినేషన్ అందుబాటులోకి రాగానే మీ పిల్లలకు వేసేలా జాగ్రత్త తీసుకోండి.