అందాల ఐశ్వర్య బ్యూటీ సీక్రెట్స్ ఇవే..
అందం గురించి చెప్పమంటే.. ఐశ్యర్య రాయ్ గురించి చెప్పకుండా ఉండలేరు. ఆమెగురించి చెప్పనిదే అందం వివరణ అసంపూర్తిగా ఉంటుంది. మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుని 27 సంవత్సరాలు గడుస్తున్నా వన్నె చెదరని అందం ఐశ్యర్యరాయ్ బచ్చన్ సొంతం.
అందం గురించి చెప్పమంటే.. ఐశ్యర్య రాయ్ గురించి చెప్పకుండా ఉండలేరు. ఆమెగురించి చెప్పనిదే అందం వివరణ అసంపూర్తిగా ఉంటుంది. మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుని 27 సంవత్సరాలు గడుస్తున్నా వన్నె చెదరని అందం ఐశ్యర్యరాయ్ బచ్చన్ సొంతం.
ఇప్పటికీ ఎంతోమంది కుర్రకారు హృదయాన్ని గిలిగింతలు పెట్టిన, పెడుతున్న అందం ఆమెది. అందంతో పాటు అద్భుతమైన నటనా ఆమె సొంతం.
మచ్చలేని చందమామలాంటి అందగత్తె అయిన ఐశ్వర్యారాయ్ తన అందాన్ని కాపాడుకోవడానికి మన అందర్లాగే వంటింటి చిట్కాలు వాడుతుందని మీకు తెలుసా?
ఇది నిజంగా నిజం...స్వయంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిన నిజం. ఎన్నో బ్యూటీ ప్రాడక్ట్స్ ఉన్నా..వాటిని వాడే స్తోమత ఉన్నా.. ఐశ్వర్య ఇంటి చిట్కాల ముందు అవి పనికిరావు అంటోంది.
ఎప్పుడూ వంటగదిలో అందుబాటులో ఉండే కొన్ని రకాల పదార్థాలతో అందానికి మరింత మెరుగులు దిద్దుకుంటానని చెప్పుకొచ్చారు.
శనగపిండి, పెరుగు, తేనె.. ఈ మూడింటిని బాగా కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుని.. 20 నిమిషాల తరువాత కడిగేస్తే... చర్మం చాలా సున్నితంగా, హాయిగా తయారవుతుందని చెబుతున్నారు.
హెక్టిక్ షూటింగ్ ఉన్న రోజు తరువాత దోసకాయ రసాన్ని మొహానికి అప్లై చేసి కాపేపయ్యాక కడిగేస్తే.. ముఖం కాంతివంతంగా, అలసట పోయి ఉత్సాహంగా తయారవుతుందని తెలిపారు.
ఇక తన అందానికి ఆమె పాటించే అతి ముఖ్య సూత్రం నీటిని ఎక్కువగా తాగడం. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచుకోవడం వల్ల చర్మంలోని తేమ తగ్గదు. దీంతో మెరిసిపోవచ్చు అంటారామె.
ఎప్పుడూ సంతోషంగా ఉండడం ఆమె పాటించే మరో మంత్రం.. ఒత్తిడి వల్ల చర్మం తీవ్రంగా ప్రభావితమవుతుంది. దీంతో తొందరగా ముఖం ముడతలు, మచ్చలు వచ్చేస్తుంటాయి. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా ఒత్తిడికి గురికాకుండా ఉంటానని తెలిపారామె.
జుట్టు, చర్మం ఆరోగ్యం కోసం మరో చిట్కా ఏంటంటే.. ఎక్కుగా బైటి ఆహారాన్ని తీసుకోకపోవడం. ఇంటి ఫుడ్ కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని చెప్పారు.
సరైన, పోషకాలున్న ఆహారాన్ని తినడం వల్ల చర్మం, జుట్టుకు అద్భుతాలు చేయవచ్చు. అందాల ఐశ్వర్య బ్యూటీసీక్రెట్స్ తెలుసుకున్నారుగా? మీరూ ఫాలో అయిపోండి మరి..