ఇవి తింటే క్యాన్సర్ మీ దగ్గరకు కూడా రాదు
క్యాన్సర్ అనే పదం వినగానే చాలా కంగారుగా ఉంటుంది కదా.. అయితే మీకు తెలియని నిజం ఏమిటంటే క్యాన్సర్ మన శరీరంలోనే ఉంటుంది. ఎప్పుడైతే శరీరంలోని కణాలు దెబ్బతింటాయో లక్షణాలు బయటపడి అక్కడ కాన్సర్ వెలుగుచూస్తుందంతే.. దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరైన డైట్, ఫిట్నెస్, మంచి అలవాట్లు పాటిస్తే ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇందులో భాగంగా ఈ 8 రకాల పండ్లు, కూరగాయలు తింటే కాన్సర్ దగ్గరకు కూడా రాదని కొందరు వైద్య నిపుణులు తెలిపారు. అవేంటో తెలుసుకుందామా..
రెడ్ బెల్ పెప్పర్
రెడ్ బెల్ పెప్పర్లో విటమిన్లు ఎ, సి, ఇ, కెరోటినాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇమ్మునిటీ సిస్టమ్‌ను మెరుగుపరుస్తాయి. కళ్లు, చర్మ, గుండె భాగాల్లో క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి.
బీట్రూట్
బీట్రూట్లో పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. బీటాలైన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తాన్ని ప్రొటెక్ట్ చేస్తుంటాయి. అందువల్ల రక్తానికి సంబంధించిన కాన్సర్ రాకుండా సహాయపడతాయి.
టమాటా
టమాటాల్లో లైకోపీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది వివిధ రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.
స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీలలో ఎటువంటి క్యాన్సర్తోనైనా పోరాడే పోషకాలుంటాయి. అలాగే విటమిన్ సి, మాంగనీస్, ఎల్లాజిక్ యాసిడ్ లు స్ట్రాబెర్రీల్లో అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో శక్తినిస్తాయి.
రెడ్ ఆపిల్
రెడ్ ఆపిల్స్ చాలా మంచివి. ముఖ్యంగా వాటి పై పీల్(తోలు)లోని క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ ఎటువంటి క్యాన్సర్ అయినా రాకుండా అడ్డుకుంటుంది. కాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
దానిమ్మ
ఎర్ర రంగులో ఉండే దానిమ్మ గింజలలో పాలీఫెనాల్స్ అనే పదార్థం ఉంటుంది. ఇవి నమిలి తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
రాస్ప్బెర్రీ
వీటిల్లో ఎల్లాజిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఆంథోసైనిన్లు, క్వెర్సెటిన్ అనే పోషకాలుంటాయి. ఇవి కాన్సర్ నిరోధకాలుగా ఉపయోగపడతాయి.
చెర్రీ
చెర్రీలలో ఆంథోసైనిన్లు, సైనైడిన్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కూడా క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి.