Beauty Tips: మేకప్ లేకపోయినా అందంగా ఉండవచ్చు తెలుసా.. ఇంతకు ఎలానంటే?
Beauty Tips: చాలామంది ఆడవాళ్ళకి ఉదయం మేకప్ వేసుకునే అంత సమయం ఉండదు. అలాంటి వాళ్ల కోసమే ఈ టిప్స్. మేకప్ వేసుకోకపోయినా అందంగా ఎలా కనబడాలో చూద్దాం.

పొద్దున్నే బయటకు వెళ్లే ఆడవాళ్ళకి పనుల ఒత్తిడి కారణంగా వారి అలంకరణకు సరైన సమయాన్ని కేటాయించుకోలేకపోతారు కానీ వాళ్లకి ఈ మేకప్ తప్పనిసరి అనుకుంటారు. కానీ అందంగా హుందాగా కనిపించడం కోసం పూర్తిగా మేకప్ పై ఆధార పడవలసిన అవసరం లేదు.
ఎక్కువ అలంకరణ అవసరం లేకుండా సహజసిద్ధ సౌందర్య చిట్కాలు కొన్ని చూద్దాము. స్క్రబ్ ని ఉపయోగించడం ద్వారా మీ చర్మం యొక్క మృత కణాలని తొలగించడం ద్వారా నీ మొఖం కాంతివంతంగా ఉంటుంది స్క్రబ్ మీ ముఖాన్ని తాజాగా ఉంచడం లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
అలాగే ముఖం మీద, బుగ్గలని సున్నితంగా లాగడం ద్వారా శాంతంగా తాపడం చేయడం ద్వారా చిన్న మసాజ్ ని మీ ముఖానికి ఇవ్వండి. ఇది రక్తప్రసరణను పెంచడంతోపాటు సహజసిద్ధమైన నిగారింపుని తీసుకొని వస్తుంది. అందువల్ల మీ చర్మం తాజాగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
అలాగే ఇంటి బయటకి వచ్చే ముందు మీకు నిండుదనాన్ని తీసుకొచ్చే వస్త్రధారణ ముఖ్యమని గమనించండి. అలాగే మీ కనుబొమ్మలని సున్నితమైన బ్రష్ ఉపయోగించి పైకి ఎత్తండి. అలాగే కర్లర్ ఉపయోగించి మీ కనుబొమ్మలని సున్నితంగా కరువు చేయండి.
ఇలా ఒకటికి రెండుసార్లు చేయడం వలన మీ కనుబొమ్మలు కర్వ్ తిరిగి చాలా అందంగా కనిపిస్తాయి. అలాగే మీ చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్ రాయడం ద్వారా శరీరాన్ని తేమగా ఉంచుకోవచ్చు. అలాగే క్లిప్ బాంబ్ అప్లై చేయడం వలన మీ పెదాలు పొడిబారకుండా తాజాగా మెరుస్తూ ఉంటాయి.
అలాగే పొద్దున్న మనం బ్రష్ చేస్తున్నప్పుడే పెదాలని కూడా సుతారంగా టూత్ బ్రష్ తో నెమ్మదిగా మసాజ్ చేయండి దీనివలన పెదవులపై ఉన్న పొడి చర్మం పోయి పెదాలు అందంగా తయారవుతాయి. కాబట్టి మేకప్ చేసుకోలేదని ఆత్మ న్యూనత కి లోనవ్వకుండా పై జాగ్రత్తలు పాటిస్తే అందంగా హుందాగా కనిపిస్తారు.