ఈ రాశివారికి ప్రేమ వైఫల్యం.. తట్టుకోవడం కష్టమే...
ప్రేమ విఫలం అవ్వడం.. మనసు విరిగిపోవడం తట్టుకోవడం చాలా కష్టం. మీరు ఎంతో ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని విడిచివెళ్లిపోతే.. మిమ్మల్ని కాదని అంటే ఆ బాధను వర్ణించలేం.
భగ్నప్రేమనుంచి కోలుకోవడం అంత సులభమైన విషయం కాదు. అప్పటివరకు ఎంతో ఇష్టపడి, ప్రేమించిన వ్యక్తి మరు నిమిషం నుంచి మీ జీవితంలో ఉండరూ అనే సత్యాన్ని అంగీకరించడం.. ఆ నిజంతో ముందుకు సాగడం.. ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన విషయం. అయితే చాలా కొద్దిమంది దీన్నుంచి చాలా ఈజీగా బయటపడుతుంటారు. వారికెలా సాధ్యమయ్యింది... అని ఆశ్చర్యపోతుంటాం. అయితే అదంతా రాశి చక్రం ప్రభావమే అంటున్నారు జ్యోతిష్కులు. అంతేకాదు విఫలప్రేమను అధిగమించడం కష్టమైన కొన్ని రాశుల గురించి కూడా చెబుతున్నారు. మరి మీ రాశి అందులో ఉందేమో చూడండి..
వృషభం (Taurus)
వృషభరాశివారు ఎవరినైనా ప్రేమిస్తే తమ సర్వస్వాన్ని అప్పగిస్తారు. అంతేకాదు తమ రిలేషన్ కోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తారు. అయినా కూడా తమ ప్రేమ విఫలం అవ్వడంతో బాగా ఒత్తిడికి గురై.. విపరీతమైన బాధను అనుభవిస్తారు. వృషభరాశివారు మార్పును సులభంగా ఎదుర్కోలేరు. హార్ట్ బ్రేక్ నుంచి తేరుకుని.. ముందుకు సాగడం వారికి చాలా కష్టంగా ఉంటుంది.
కుంభం (Aquarius)
తాము ఇష్టపడే వ్యక్తి విషయంలో చాలా గాఢంగా అనుబంధం పెనవేసుకుంటారు. అందుకే కుంభరాశి వారికి విడిచిపెట్టడం చాలా కష్టం, ఎందుకంటే ఒకసారి, వారు శారీరకంగా, మానసికంగా ఒక వ్యక్తితో కలిస్తే.. ఇక వారిని వదిలిపెట్టరు. వారు లేని జీవితాన్ని అస్సలు ఊహించలేరు.
వృశ్చిక రాశి (Scorpio)
హార్ట్ బ్రేక్ వీరికి చాలా అవమానకరంగా ఉంటుంది. తాము మోసగించబడినా లేదా గాయపడినా, తమ భాగస్వామిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఉడికిపోతుంటాడు. ప్రేమ వైఫల్యం తరువాత బాగా ఏడుస్తారు. అప్పుడే తమ భావోద్వేగం నుంచి బయటపడగలుగుతారు. సంబంధానికి చాలా విలువ ఇస్తారు. కాబట్టి విడిపోవడం వీరు తట్టుకోలేరు.
తులారాశి (Libra)
తులారాశివారు తమ భాగస్వామితో విడిపోయినప్పుడు తమను తాము కోల్పోయినట్లు భావిస్తారు. తమ దేహంలోంచి సగభాగం కోసేసినట్టుగా ఫీలవుతారు. తమ భాగస్వామికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే, వారి నిజమైన ప్రేమ వారిని విడిచిపెట్టినప్పుడు, అసంపూర్ణంగా భావించుకుంటారు. తీవ్ర నిరాశకు గురవుతారు.
breakup
కన్యరాశి (Virgo)
వీరు ప్రేమవిఫలం అయినా, విడిపోయినా.. తమ భాగస్వామి వేరేవాళ్లతో ఉన్నా.. వారిమీద మోజును చంపుకోలేరు. ఎంత కాలం తరువాతైనా వారిపట్ల ప్రేమగానే ఉంటారు. వారిమీద వ్యామోహం కనబరుస్తుంటారు. భాగస్వామిని విడిచిపెట్టడం.. తమ తప్పుగానే భావిస్తారు. తమను తాము నిందించుకుంటారు.