న్యూఇయర్ ఎంజాయ్ చేయాలా? బెస్ట్ బీచ్ లు..గోవా అయితే కాదు..!
జనాలు కాస్త తక్కువగా ఉండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి న్యూయర్ వెలకమ్ చెప్పడానికి వీలుగా ఉండే బీచ్ లు ఏంటో చూసేద్దాం….
బీచ్ అనగానే అందరికీ ముందుగా గోవానే గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా న్యూ ఇయర్ ని గోవా బీచ్ లో సెలబ్రేట్ చేసుకోవాలని చాలా మంది ఆశపడుతుంటారు. కానీ ఈ సమయంలో అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో అంత కంఫర్ట్ గా ఉండకపోవచ్చు. అలాంటివారు.. ఈ కింది బీచ్ లను ఎంచుకోవచ్చు. జనాలు కాస్త తక్కువగా ఉండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి న్యూయర్ వెలకమ్ చెప్పడానికి వీలుగా ఉండే బీచ్ లు ఏంటో చూసేద్దాం….
1.ఓం బీచ్ ( గోకర్ణ)...
గోకర్ణ లో బీచ్ లు కూడా చాలా అందంగా ఉంటాయి. వాటిలో మీరు ఓం బీచ్ ని ఎంచుకోవచ్చు. ఈ బీచ్ ఓం ఆకారంలో ఉంటుంది. అందుకే ఈ బీచ్ ని ఆ పేరుతో పిలుస్తారు. ఈ బీచ్ ప్రశాంతంగా ఉండటమే కాదు.. చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ప్రశాంతంగా న్యూ ఇయర్ కి వెలకమ్ చెప్పొచ్చు.
2.రాధానగర్ బీచ్ ( ది అండమాన్)
ఆసియాలోని ది బెస్ట్ బీచ్ లలో ఈ రాధానగర్ బీచ్ అని చెప్పొచ్చు. ఈ బీచ్ చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. పచ్చని పరిసరాలతో..చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ బీచ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. స్విమ్మింగ్ చేయడానికి, రెస్ట్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది.
3.కన్యాకుమారి బీచ్..
కన్యకుమారి బీచ్ కూడా చాలా అందమైన ప్రదేశం అని చెప్పొచ్చు. ఈ బీచ్ అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసే అద్భుతమైన ప్లేస్. ఇక్కడ సూర్యోదయం, సూర్యోస్తమయం రెండూ అందంగా ఉంటాయి. న్యూ ఇయర్ వెలకమ్ చెప్పడానికి బెస్ట్ బీచ్ అని చెప్పొచ్చు.
4.చెరాయ్ బీచ్ ( కొచ్చి, కేరళ)
చెరాయ్ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది బంగారు రంగు ఇసుకతో విస్తరించి ఉంటుంది. ఈ బీచ్ లో గోవా మాదిరి రద్దీ ఎక్కువగా ఉండదు. హ్యాపీగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి చాలా అనువుగా ఉంటుంది.
5.పాపనాశం బీచ్ ( వర్కల, కేరళ)...
వర్కాలలోని పాపనాశం బీచ్ కూడా చాలా అందంగా ఉంటుంది. నిశ్శబ్ద నూతన సంవత్సరాన్ని కోరుకునే వారికి ఈ ప్రశాంతమైన బీచ్ ఇది. బీచ్ ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మికత అద్భుతమైన సమ్మేళనం. సూర్యాస్తమయం చాలా అందంగా ఉంటుంది.