Weight Loss : తొందరగా బరువు తగ్గాలంటే.. ఏ పద్ధతి మంచిది?
త్వరగా బరువు తగ్గడం కోసం రోజులో మూడుసార్లు హెవీగా తినడం కంటే.. చిన్న మొత్తాల్లో ఆరుసార్లు తినడం మంచిదని చెబుతారు. అయితే ఇంకొంతమంది దీనికి భిన్నంగా కూడా చెబుతుంటారు. నిజానికి ఏది వాస్తవం? దీని గురించి న్యూట్రిషన్ సైన్స్ ఏం చెబుతుంది? చూద్దాం.
బరువు తగ్గడానికి సంబంధించి ఆన్లైన్లో ఎన్నో రకాల సలహాలు అందుబాటులో ఉన్నాయి, ఇవి తరచుగా బరువు తగ్గడానికి సరైన అంశాలు, చేయకూడని వాటి గురించి చాలా చెబుతుంటాయి. దీంతో అనేక గందరగోళం ఏర్పడుతుంది. వీటిల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన వాటిలో ఒకటి రోజుకు మూడుసార్లు భోజనం చేయాలా? ఆరుసార్లు భోజనం చేయాలా? అనే పద్ధతి.
త్వరగా బరువు తగ్గడం కోసం రోజులో మూడుసార్లు హెవీగా తినడం కంటే.. చిన్న మొత్తాల్లో ఆరుసార్లు తినడం మంచిదని చెబుతారు. అయితే ఇంకొంతమంది దీనికి భిన్నంగా కూడా చెబుతుంటారు. నిజానికి ఏది వాస్తవం? దీని గురించి న్యూట్రిషన్ సైన్స్ ఏం చెబుతుంది? చూద్దాం.
రోజుకు మూడు పూటల కంటే.. ఆరుసార్లు తినడం మంచిదా?
చాలా మంది పోషకాహార నిపుణులు రోజుకు ఆరుసార్లు భోజనం చేయడం మంచిదని ప్రోత్సహిస్తారు, కొద్ది మొత్తాల్లో తినడం వల్ల జీవక్రియ మందగించదని, తక్కువ తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తికోసం రోజంతా కొవ్వును బర్న్ చేస్తూ ఉంటారని వీరి వాదన. అయితే, దీనిమీద జరిపిన పరిశోధనలు ఈ వాదనలతో పూర్తిగా ఏకీభవించలేదు. అంతేకాదు చిన్నమొత్తాలో ఎక్కువ సార్లు తినడం వల్ల బరువు తొందరగా తగ్గుతారనే దానిమీద అనేక అధ్యయనాలు మిశ్రమ ఫలితాలను సూచించాయి.
ఆరుసార్లు తినడం వల్ల జీవక్రియ రేటు మెరుగుపడుతుందా?
ఈ ప్రశ్నకు సమాధానం లేదు. రోజంతా తక్కువ మొత్తాల్లో తినడం వలన మీ మొత్తం జీవక్రియ రేటు పెరగదు లేదా ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడదు. వాస్తవానికి, జీవక్రియ రేటు అంటే ఒక నిర్దిష్ట కాలంలో మీ శరీరం కరిగించిన కేలరీల సంఖ్య మాత్రమే. భోజనం జీర్ణమయ్యే క్రమంలో జీవక్రియ కొద్దిగా పెరుగుతుంది. ఈ ప్రక్రియలో మొత్తం కేలరీలు కరిగిపోవడం అనేది మీరు తినే ఆహార పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. అంతేతప్ప ఫ్రీక్వెన్సీ మీద కాదు. జీవక్రియ రేటు పెరుగుదల థర్మిక్ ప్రభావం కారణంగా ఉంది, ఇది రెండు రకాల భోజన ప్రణాళికలో ఎక్కువ లేదా తక్కువ ఒకే విధంగా ఉంటుంది.
తక్కువ మొత్తాల్లో ఎక్కువ సార్లు తినడం వల్ల ఆకలి తక్కువవుతుంది?
తక్కువ మొత్తాల్లో ఎక్కువ సార్లు భోజనం తినడం వల్ల మామూలు ఫుడ్ క్రేవింగ్స్ ను అరికట్టొచ్చు. దీనివల్ల జంక్ ఫుడ్ లాంటి అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండొచ్చు. ఇది చాలామంది నమ్ముతారు.
అయితే, ఒబేసిటీ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, రోజులో ఆరుసార్లు భోజనం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం, నిర్వహించడం అంత ప్రయోజనకరం కాదు. మూడుసార్లు లేదా ఆరుసార్లు భోజనం చేసే పద్ధతి రెండింట్లోనూ మీ కోరికలను తగ్గించడం, రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడంపై ఒకే ప్రభావాన్ని చూపుతాయి.
రోజుకు ఆరుసార్లు తినడం వల్ల దుష్ప్రభావం..
దీనివల్ల ఈటింగ్ డిజార్డర్ తో బాధపడేవారికి సమస్యగా మారుతుంది. ఆరుసార్లు భోజనం చేసే పద్ధతిని అనుసరించినప్పుడు, ఒక రోజువారీ మొత్తం తీసుకోవాల్సిన కేలరీల సంఖ్యను ఆరు సమాన భాగాలుగా విభజించాల్సి ఉంటుంది. వీటిని నిర్దిష్ట సమయంలో ఆ కేలరీలను మాత్రమే తీసుకోవాలి. ఈటింగ్ డిజార్డర్ తో బాధపడేవారికి కేలరీల సంఖ్యకు కట్టుబడి ఉండటం కష్టం. అందుకే అన్నిసార్లు వారు మామూలు కంటే ఎక్కువగా తింటారు. దీంతో మొదటికే మోసం వస్తుంది. బరువు తగ్గే ప్లాన్ దెబ్బ పడుతుంది.
చివరగా చెప్పేదేంటంటే.. ఈ రెండు పద్ధతుల మధ్య పెద్దగా తేడా లేదు. ఫలితాలు కొంచెం అటూ, ఇటూగా ఒకే విధంగా ఉంటాయి. రెండింటి మధ్య నిర్ణయం తీసుకోవాల్సి వస్తే, మీకు ఏది సౌకర్యవంతంగా ఉందో అది ఎంచుకోవాలి. ఇతరులకు బాగా వర్కవుట్ అయ్యింది. మీకు వర్కవుట్ అవ్వాలని లేదు. బరువు తగ్గే విషయంలో ప్రతీ వ్యక్తికి వేరు వేరు ఫలితాలుంటాయి. అందుకే మీరు వేరేవాళ్లతో పోల్చుకోవడం మానేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటును క్రమం తప్పకుండా పాటించడం మీద దృష్టి పెట్టాలి.