సెక్స్ టాయ్స్ ఉంటే భాగస్వామితో పనిలేదా.? అసలీ కల్చర్ ఎందుకు పెరుగుతోంది, ఏం జరుగుతోంది
కాలం మారుతోంది. మారుతోన్న కాలంతో పాటు ఆవిష్కరణలు వస్తున్నాయి. మనిషిని రీప్లేస్ చేసే వస్తువులు మార్కెట్లోకి పోటెత్తుతున్నాయి. ఇలాంటి వాటిలో సెక్స్ టాయ్స్ ఒకటి. అసలు వీటి వినియోగం ఎందుకు పెరుగుతోంది. ఇది సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.? లాంటి వివరాలు నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వివరించింది.

ప్రపంచవ్యాప్తంగా సెక్స్ టాయ్స్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు భారత్‌లోనూ ఎక్కువుతోంది. మరీ ముఖ్యంగా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటికి తెచ్చిస్తున్న ఈ కామర్స్ సంస్థల రాకతో అందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో అయితే మహిళలు ఏకంగా పెళ్లిళ్లకు మొగ్గు చూపడం లేదని, శారీరక అవసరాల కోసం సెక్స్ టాయ్స్‌ను ఉపయోగిస్తున్నారని విద్యావతేత్త వాసిరెడ్డి అమర్నాథ్ తన ఫేస్ బుక్ పోస్టులో వెల్లడించారు. ఇంతకీ వీటి వినియోగం పెరగడానికి అసలు కారణం ఏంటి.? దీనివల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి. లాంటి పూర్తి వివరాలు..

సెక్స్ టాయ్స్ వినియోగం పెరగడానికి కారణాలు..
ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం ప్రజలు శృంగారానికి సంబంధించి బహిరంగా చర్చిస్తున్నారు. సోషల్ మీడియా రాకతో ఇలాంటి వాటికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అలాగే ఓటీటీ కంటెంట్‌లో వచ్చే కొన్ని సినిమాల్లో వీటి గురించి వివరంగా చెబుతున్నారు. అలాగే వ్యక్తిగత ఆనందానికి ప్రాముఖ్యతనిచ్చే సంస్కృతి పెరుగుతోంది. దీంతో తమకు నచ్చింది చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అంతేకాదు ఆర్థిక స్వాతంత్రం కూడా దీనికి ఒక కారణమని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వెల్లడించింది.
ఒంటరితనాన్ని తగ్గించుకునేందుకు కూడా పలువురు వీటిని ఉపయోగిస్తున్నారు. కేవలం ఒంటివారు మాత్రమే కాకుండా వివాహామైన జంటలు కూడా వీటిని ఉపయోగిస్తుండడం గమనార్హం. శృంగారంలో అసంతృప్తి కూడా దీనికి ఒక కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి రావడం యాప్‌తో కంట్రోల్ చేసే టాయ్స్, వీఆర్ ఎక్స్పీరియన్స్ వంటివి అభివృద్ధి పెరగడం కూడా టాయ్స్ వినియోగానికి కారణంగా చెబుతున్నారు. అలాగే సెక్స్ టాయ్స్ వినియోగం పెరగడానికి స్వీయ ఆనందానికి ప్రాముఖ్యతనిచ్చే వారి సంఖ్య పెరగడం. ముఖ్యంగా మహిళల్లో ఈ అలవాటు పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళలు తమ సెక్స్యువల్ అవసరాలను అర్థం చేసుకుని, వాటిని తీర్చుకునే ధైర్యాన్ని కనబరుస్తున్నారు.
sex toys
నష్టాలు..
నేషనల్ లైబ్రరీ వివరణ ప్రకారం.. సెక్స్ టాయ్స్ వినియోగం వల్ల మనుషుల మధ్య ఎమోషనల్ బాండింగ్ దూరమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వీటిపై ఎక్కువగా ఆధారపడితే భాగస్వామి ప్రాముఖ్యత తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలంలో పెళ్లి అనే వ్యవస్థే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉంటాయి. ఒకరి నుంచి మరొకరు భావోద్వేగపరంగా దూరమయ్యే అవకాశం ఉంటుంది. సెక్స్ టాయ్స్ వినియోగం వల్ల విడాకులు తీసుకునే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టాయ్స్‌కి అలవాటు పడ్డ వారిలో నిజమైన శారీరక సంబంధలపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. ఇది భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ టాయ్స్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి.
లాభాలున్నాయా.?
వీటితో నష్టాలు మాత్రమే ఉన్నాయా, లాభాలు లేవా అంటే. కొన్ని లాభాలు కూడా ఉన్నాయని అంటోంది నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అయితే వీటిని ఉపయోగించే విధానంపైనే అది ఆధారపడి ఉంటుంది. కొన్ని రకమైన టాయ్స్‌తో లైంగిక జీవితాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోవచ్చు. తీవ్రమైన ఒత్తిడికి గురైన సమయంలో భాగస్వామి అందుబాటులో లేని సమయంలో వీటి ద్వారా లైంగిక కోరికలను తీర్చుకోవచ్చని ఇది ఒత్తిడిని దూరం చేయడంలో ఉపయోగపడుతుందని చెప్పే వారు కూడా ఉన్నారు.