Pushpa story Leak: 'పుష్ప' స్టోరీ లీక్?...మెయిన్ ట్విస్ట్ సునీల్ వేలు మీదే?
డిసెంబర్ 17న ఏడు భాషల్లో రిలీజ్ అవుతున్న పుష్ప గురించి అభిమానులు మాత్రమే కాకుండా సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో పుష్ప సినిమా కథ గురించి రకరకాల చర్చలు మీడియాలో జరుగుతున్నాయి.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరెక్కనున్న పుష్ప సినిమాలో బన్నీ పుష్పరాజ్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్నా పల్లెటూరి యువతి శ్రీవల్లి పాత్రలో ఆకట్టుకోనుంది. ఈ రెండు తెలిసిన విషయాలే. ఇక ఈ సినిమాలో కొత్త విషయం ఏమిటంటే...సునీల్ క్యారక్టరైజైషన్ అని చెప్తున్నారు. సునీల్ ..ఈ చందనం చక్కల గ్యాంగ్ కు లీడర్ ని , చాలా క్రూరడు. అతను ఎలా ఉంటాడో ఎవరకీ తెలియదు. పోలీస్ లకు సైతం మంగళం శ్రీను పేరు తెలుస్తుంది కానీ అతనెవరనే క్లారిటీ ఉండదు. ఎప్పటివో పాత ఫొటోలు వాళ్ల దగ్గర ఉంటాయి.
అంటే దాదాపు దావూద్ ఇబ్రహీం లాగ ఎవరికీ కనపడకుండా తన కార్యక్రమాలు చక్క పెడుతూంటాడన్నమాట. అతన్ని పట్టుకోవటానికి పోలీస్ లు తిరుగుతూంటాడు. ఆ క్రమంలో లారి డ్రవర్ నుంచి గంధలు చెక్కల స్మగ్లర్ గా ఎదిగిన పుష్ప రాజ్ ..కు టచ్ అవుతాడు. అతన్ని చంపేస్తాడు పుష్ప. అలాగే అతని ప్లేస్ లోకి వస్తాడు. తనే మంగళం శ్రీను అని ఎలా నమ్మస్తాడు అనేది ట్విస్ట్ అంటున్నారు. చంపేయటం ఇంటర్వెల్ కు జరుగుతుందని. సెకండాఫ్ అంతా ఆ పాయింట్ చుట్టూ తిరుగుతుందని , క్లైమాక్స్ కు వచ్చేసరికి పుష్ప ..అక్కడ స్మగ్లర్ల గ్యాంగ్ కు లీడర్ అవుతాడని అంటున్నారు.
allu arjun about the casting of fahadh faasil in pushpa
ఇక సునీల్ ని చంపాక..అతని తల్లి వచ్చి పుష్పరాజ్ ని లీడర్ గా చెప్పటానికి వస్తుందని, ఆమె దివ్యాంగురాలు అని, ఆమే పుష్పని చూసి, సునీల్ అని చెప్తుందని ..అందుకు కారణం ఏమిటనేది కీలకమైన పాయింట్ అని చెప్తున్నారు. అయితే ఇదంతా సినీ జనం అల్లిన కథా లేక నిజంగానే సినిమాలో పాయింటా అనేది తెలియాల్సి ఉంది.
సునీల్ కు ఓ వేలు ఉండదని..ఆ వేలును బట్టే అతని గుడ్డి తల్లి గుర్తు పడుతుందట. అది గమనించిన పుష్పరాజ్...తన వేలుని కోసుకుని..అతనే సునీల్ అని నమ్మిస్తాడట. ఆమె కూడా అతనే తన కొడుకు అంటుందిట. అయితే పోలీస్ లు మాత్రం నమ్మరట. వేలిముద్ర లు పరిశీలించే పోగ్రాం పెట్టుకుంటారట. అందుకే పోస్టర్స్ పై వేలిముద్ర ఉన్నవి మొదట వేసారట.
ఇక సెకండాఫ్ పార్ట్ మొత్తం లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ‘విలన్’ మూవీ కథను ఆధారంగా చేసుకుని ‘పుష్ప’ను డిజైన్ చేసారంటున్నారు. రామాయణాన్ని ..రావణుడు వైపు నుంచి చెప్పబడ్డ కథ అది. సీతలాంటి ఐశ్వర్యారాయ్ ని రావణుడు లాంటి విక్రమ్ ఎత్తుకొచ్చేసి ఓ అడవిలో పెట్టేస్తాడు..అందుకు కారణం తన చెల్లి మరణం అని రివీల్ అవుతుంది. ఇప్పుడు పుష్పలో కూడా అలాంటి పాయింటే ఉంటుందంటున్నారు.
అప్పట్లో ఆడని ఆ సినిమా కథని మార్చి..ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్ పెట్టి…సుకుమార్ సరికొత్త ట్రీట్మెంట్ తో స్క్రిప్టు రాసాడని అంటున్నారు. చెల్లెలి చావుకి కారణమైన పోలీసాఫీసర్ కి గుణపాఠం చెప్పాలన్నది మణిరత్నం తీసిన విలన్ మూవీకి నేపథ్యం. అందులో విక్రమ్ హీరో అయితే చెల్లి పాత్రలో ప్రియమణి నటించారు. అదే సిస్టర్ సెంటిమెంట్ ని, అదే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో సుకుమార్ ఇప్పుడు కొత్తగా ప్లాన్ చేశారంటున్నారు.
దీనికి తోడు హీరో పుష్పరాజ్ చెల్లిగా ఐశ్వర్య రాజేష్ ఓకే అయినట్లు కూడా ఓ టాక్ నడుస్తోంది. ఆమె పేరు పుష్ప అని ఆమె పేరునే తన పేరుకు ముందు పెట్టుకున్నాడంటున్నారు. పుష్పరాజ్ ని ఢీకొట్టే నెగిటివ్ పోలీసాఫీసర్ పాత్రలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కనిపించబోతున్నారు. ఇవన్ని పజిల్ లాగ ఒకదానికొకటి కలిపి ఇలా తనకు తోచిన కథ అల్లేసికుంటున్నారు. పుష్ప గురించి వినిపిస్తున్న ఈ కొత్త కథలో నిజమెంతనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.
Pushpa Pre release event
శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్గా ఊర మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. రాయలసీమకు చెందిన మొరటు కుర్రాడిగా బన్నీ డీగ్లామర్ లుక్ కేక పుట్టిస్తుంది. మాసిన గెడ్డం మీసాలతో సీరియస్గా ఉన్న బన్నీ లుక్ చాలా కొత్తగా ఉంది.
పుష్ప కోసం చాలా కష్టపడ్డామని, అటవీ ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. ఇక పుష్పరాజ్ పాత్ర కోసం కేవలం మేకప్‌కే రెండున్నర గంటల సమయం పట్టిందని, అది తీసేయడానికి మరో 30 నిమిషాల సమయం పట్టిందని తెలిపాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో ఇంతటి మేకప్ అవసరం రాలేదని, చాలా మినిమల్ మేకపే వాడామని చెప్పుకొచ్చాడు.
ఇక సమంత తొలిసారిగా ఐటెం సాంగ్ చేయడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాట అంటూ సమంత చేసిన ఈ సాంగ్ యూట్యూబ్‌ను దుమ్మురేపుతుంది. సమంత గ్లామర్, చంద్రబోస్ లిరిక్స్ ఒక ఎత్తైతే, గాయని ఇంద్రావతి చౌహాన్ తన మత్తు వాయిస్‌తో పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది.
Anasuya Bharadwaj
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పుష్ప రేపు రిలీజ్ కానుంది.