వర్షాకాలం: ఏం తినాలి..? ఏం తినకూడదు..?
సమ్మర్ లో అయితే.. శరీరంలో వేడి తగ్గించే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. మరి.. వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఎలాంటి ఆహారం తీసుకుంటే ప్రమాదమో... తెలుసుకుందామా..
వర్షాకాలం వచ్చేసింది. ఈ వర్షాకాలంలో.. సీజనల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే.. ఈ సీజన్ లో ఏది పడితే అది తినకూడదు. ఈ సీజన్ లో తీసుకునే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సమ్మర్ లో అయితే.. శరీరంలో వేడి తగ్గించే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. మరి.. వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఎలాంటి ఆహారం తీసుకుంటే ప్రమాదమో... తెలుసుకుందామా..
వర్షకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా.. అసలే కరోనా మహమ్మారి కూడా పొంచి ఉంది కాబట్టి.. మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకే.. ముందుగా.. శుభ్రమైన నీటిని తాగాలి. చాలా మంది బోర్ నుంచి.. ట్యాప్ నుంచి వచ్చే నీటిని డైరెక్ట్ గా తాగేస్తుంటారు. దానికన్నా.. ప్యూరిఫై చేసుకోని లేదా.. వేడి చేసి చల్లార్చుకొని తాగాలి.
బయట వర్షం పడుతుంటే.. వేడి వేడి పకోడీలు, సమోసాలు, భజ్జీలు తినాలని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. అయితే.. వర్షాకాలంలో అలాంటి ఆయిల్ ఫ్రెడ్ ఆహారం తీసుకోవడం చాలా ప్రమాదకరమట. వర్షాకాలంలో శరీరానికి సరైన న్యూట్రియన్స్ అందించాలంటే.. ఇలాంటి ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయం మనకు తెలిసిందే. కానీ.. వర్షాకాలంలో మాత్రం ఈ ఆకుకూరలు తినకపోవడమే మంచిదట. వర్షాకాలంలో ఆకుకూరలు ఎప్పుడూ తేమగా ఉంటాయి. దానివల్ల దానిలోని పోషకాలన్నీ శరీరానికి అందే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్ లో ఆకుకూరలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తినకపోవడమే మంచిది.
వర్షాకాలంలో మనకు తెలియకుండానే శరీరంలోని తేమ తగ్గిపోతుంది. తరచూ వాష్ రూమ్ కి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి.. ఈ సీజన్ లో శరీరానికి ఫ్ల్లూయిడ్స్ అందించాలి. అయితే.. నీరు ఎక్కువగా తీసుకోలేం కాబట్టి.. దాని బదులు మసాలా టీ, హెర్బల్ టీ లాంటివి తీసుకోవాలి. తులసీ, అల్లం వంటి వాటితో తయారు చేసిన టీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
ఈ సీజన్ లో తాజాగా వేడి వేడి ఆహారం తీసుకోవడం మంచిది. రాత్రి వండిన ఆహారం.. మరుసటి రోజు ఉదయం తినడం లాంటవి చేయకూడదు. ఈ సీజన్ లో పచ్చి సలాడ్స్ కన్నా.. ఉడకపెట్టిన సలాడ్స్ తినడం మంచిది.
ఈ సీజన్ లో తీసుకునే ఆహారాల్లో స్పైసెస్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పసుపు, మిరియాలు, లవంగం ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో.. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయం చేస్తాయి.