నిమ్మరసం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తున్నారా..? ఏమౌతుందో తెలుసా?
నిమ్మకాయను ఫ్రిడ్జ్ లో అసలు పెట్టకూడదట. మీకు నిమ్మకాయ తాజాగా ఉండాలి అంటే... అసలు ఫ్రిడ్జ్ లోనే పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజుల్లో ఇంట్లో ఫ్రిడ్జ్ లేనివారంటూ ఎవరూ ఉండరేమో. ప్రతి ఒక్కరి అత్యవసర వస్తువుల్లో ఫ్రిడ్జ్ కూడా చేరిపోయింది. ఈ ఫ్రిడ్జ్ ఏ వస్తువునైనా కొన్ని రోజులపాటు పాడవ్వకుండా చూసుకుంటుంది. దీంతో.. కూరగాయాలు, పండ్లు, పాలు, కూరలు... ఇలా ప్రతి ఒక్కదానిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తున్నారు. అలా కొందరు నిమ్మ రసం కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తున్నారు. అసలు నిమ్మరసం ఫ్రిడ్జ్ లో ఉంచొచ్చా..? దాని వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
నిమ్మకాయను ఫ్రిడ్జ్ లో అసలు పెట్టకూడదట. మీకు నిమ్మకాయ తాజాగా ఉండాలి అంటే... అసలు ఫ్రిడ్జ్ లోనే పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు.
సిట్రిక్ యాసిడ్ ఉంటే నిమ్మకాయలు వంటి పండ్లను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదట. అలా పెట్టడం వల్ల వాటి రుచి మారిపోతుంది. అంతేకాకుండా.. వాటిలో ఉండే రసం కూడా తగ్గిపోతుంది.
లేదు.. మేము కచ్చితంగా నిమ్మకాయలను ఫిడ్జ్ లో పెట్టి తీరాలి అంటే... వాటిని ఏదైనా ప్లాస్టిక్ కవర్ లేదా.. పేపర్ బ్యాగ్ లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. లేదు అంటే.. చీమలు కూడా దూరని గాజు సీసాలు ఉంటాయి కదా.. వాటిలో నిమ్మకాయలు పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి.
సంవత్సరం మొత్తం నిమ్మకాయలను ఉపయోగించాలని అనుకునేవారు.. చాలా మంది రసం తీసి వాటిని వాడుతూ ఉంటారు. నిమ్మ రసాన్ని అస్సలు స్టోర్ చేయకూడదట. కావాలంటే.. నిమ్మ రసాన్ని ఐస్ క్యూబ్స్ లోపోసి.. అలా స్టోర్ చేసుకోవచ్చట.
అలా ఐస్ క్యూమ్స్ లు నిమ్మరసం తో తయారు చేసుకుంటే.. వాటితో ఈ ఎండాకాలం ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమ్మరసం చేసుకొని తాగేయవచ్చు.
ఒక కప్పు నిమ్మరసంలో మూడు కప్పుల పంచదార కలిపి స్టోర్ చేసుకోవచ్చట. ఈ మిశ్రమానికి చల్లటి నీరు కలిపి కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమ్మరసం తాగేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా పంచదార కలిపిన నిమ్మరసాన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుందట.
ఫ్రిడ్జ్ లేకున్నా కూడా.. నిమ్మకయాలను తాజాగా ఉంచుకునే మార్గం ఉంది. అదెలాగంటే.. నిమ్మకాయలకు ఆవనూనె లేదా ఏదైనా ప్రాసెస్డ్ ఆయిల్ కొద్దిగా రాసి..కుండలో పెడితే.. అవి ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంటాయట.
నిమ్మకాయలో సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయం చేస్తుంది.