వేడి వేడి రసం... టేస్టీగా అదరగొట్టాలంటే.. ఇలా చేయండి..
రసం లేదా చారు.. లేకుండా చాలామందికి ముద్ద దిగదు. భోజనం పూర్తయినట్టే ఉండదు. ముఖ్యంగా కన్నడిగులు, తెలుగువారు ఎక్కువగా రసం లేదా చారును బాగా ఇష్టపడతారు. ఇది ఆకలిని పెంచే అద్భుతమైన ఆహారం.
రసం లేదా చారు.. లేకుండా చాలామందికి ముద్ద దిగదు. భోజనం పూర్తయినట్టే ఉండదు. ముఖ్యంగా కన్నడిగులు, తెలుగువారు ఎక్కువగా రసం లేదా చారును బాగా ఇష్టపడతారు. ఇది ఆకలిని పెంచే అద్భుతమైన ఆహారం.
ఇంట్లో రసం పౌడర్ లేకపోతే ఈ రెసిపీని ఫాలో అయితే అలాంటి రుచినే పొందవచ్చు.
ఆహారానికి అద్భుతమైన రుచిని జోడించే వంటకం రసం. అయితే రసం రెసిపీ తెలియకపోతే అది సరిగా కుదరదు.
కాబట్టి చేసే విధానం తెలియడం చాలా ముఖ్యం. కేవలం అరగంటలో రుచికరమైన రసం ఎలా తయారు చేయాలో చూద్దాం.
రసం తయారికీ కావాల్సిన పదార్థాలు
3 తరిగిన టమోటా
1/2 టీస్పూన్ జీలకర్ర
1/2 ముక్క అల్లం
1 కట్ట తరిగిన కొత్తిమీర
2 కప్పుల నీరు
1/2 టీస్పూన్ ఇంగువ
1 టీస్పూన్ మిరియాలు
5 రెబ్బల కరివేపాకు
రుచికి తగినంత ఉప్పు
రసం తయారికీ కావాల్సిన పదార్థాలు
3 తరిగిన టమోటా
1/2 టీస్పూన్ జీలకర్ర
1/2 ముక్క అల్లం
1 కట్ట తరిగిన కొత్తిమీర
2 కప్పుల నీరు
1/2 టీస్పూన్ ఇంగువ
1 టీస్పూన్ మిరియాలు
5 రెబ్బల కరివేపాకు
రుచికి తగినంత ఉప్పు
పోపుకోసం
1/2 టీస్పూన్ నెయ్యి
1/2 టీస్పూన్ ఆవాలు
రసం తయారు చేసే విధానం...
ముందుగా... టమాటాలను సన్నగా తరిగి.. దీంట్లో అల్లం ముక్క చితగ్గొటి వేసి... ఉప్పు వేసి.. గోరు వెచ్చటి నీటిలో కాసేపు నానబెట్టాలి. దీనివల్ల టమాటాల్లోని కచ్చదనం ఉంటే పోతుంది.
రసం తయారు చేసే విధానం...
ముందుగా... టమాటాలను సన్నగా తరిగి.. దీంట్లో అల్లం ముక్క చితగ్గొటి వేసి... ఉప్పు వేసి.. గోరు వెచ్చటి నీటిలో కాసేపు నానబెట్టాలి. దీనివల్ల టమాటాల్లోని కచ్చదనం ఉంటే పోతుంది.
ఆ తరువాత ఒక గ్రైండర్ లో టమోటాలు, ఇంగువ, జీలకర్ర, మిరియాలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
ఇప్పుడొక పాన్ తీసుకుని అందులో 2 కప్పుల నీరు పోసి... మీడియం మంట మీద పాన్ వేడి చేయాలి. నీరు వేడయ్యాక దీనికి ముందుగా తయారుచేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసి మరిగించాలి. అలా రెండు మూడు నిమిషాల సేపు మరిగించి, ఆ తరువాత మంట ఆర్పేసి పాన్ తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పోపుకోసం మీడియా మంట మీద వేరే పాన్ లో నెయ్యి వేడి చేసుకోండి. అదే బాణలికి ఆవాలు వేసి చిటపటలాడించండి. ఆ తరువాత దీన్ని రసానికి జోడించాలి.
మీకు రసం మరింత రుచికరంగా ఉండాలంటే కొన్ని కరివేపాకు రెబ్బలు, పచ్చిమిర్చి కూడా పోపులో వేసుకుని చిటపటలాడాక రసానికి కలపాలి. ఇప్పుడు ఈ రసంతో పాపడ్స్ కలిపి వడ్డిస్తే రుచి అదుర్స్.
ఇంకొన్ని రసం చిట్కాలు
వేడి వేడి అన్నం, బంగాళదుంప కూరతో రసం మంచి కాంబినేషన్. లేదా వంకాయ, బెండకాయ ఫ్రైలతో కూడా రసం మంచి కాంబినేషన్ గా పనిచేస్తుంది.
రసం చేసిన వెంటనే కాకుండా కాస్త ఎక్కువగా ఉంటే ప్రిడ్జ్ లో పెట్టి తెల్లవారి కూడా తినొచ్చు. అయితే తినేముందు వేడి చేసుకోవడం మరిచిపోవద్దు.
రసానికి మరింత రుచి రావాలంటే చివర్లో సగం టేబుల్ స్పూన్ బెల్లం కలిపితే సరి.