మీరు కొన్న పనీర్ అసలైనదేనా? లేక నకిలీదా? ఎలా గుర్తించాలో తెలుసా?
పనీర్ ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఈ పనీర్ మన ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తుంది. కానీ మార్కెట్ లోకి నకిలీ పనీర్ కూడా వస్తుంటుంది. మరి మీరు కొన్ని పనీర్ అసలైనదేనా? లేక నకిలీదా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క ఫుడ్ కల్తీ అవుతోంది. వీటిని తిన్న మనకు లేనిపోని రోగాలు వస్తున్నాయి. ఇది కామన్ అయిపోయింది. చాలా మంది లాభాలు పొందడానికి వ్యాపారులు ఆహార పదార్థాల నాణ్యతను పర్యవేక్షించే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారు. ఎంతో ఇష్టంగా తినే పనీర్ ను కూడా కల్తీ చేస్తున్నారని అధికారులు గుర్తించారు.
ఈ మధ్యే జైపూర్‌లో అధికారులు దాదాపు 800 కిలోల నకిలీ పనీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్‌లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ బృందం సుమారుగా 500 కిలోల నకిలీ పనీర్‌ను స్వాధీనం చేసుకుంది. ఇలాంటివి కొత్తేమీ కాదు. కానీ కల్తీ ఫుడ్ ను తింటే ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి.
నకిలీ లేదా కల్తీ పనీర్ ను తింటే ఫుడ్ పాయిజనింగ్, కడుపునకు సంబంధించిన సమస్యలు, అలెర్జీలు, రోగనిరోధక శక్తి తగ్గడం, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. అసలు కల్తీ పనీర్ ఎలా తయారవుతుంది? దీన్ని తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? కల్తీ పనీర్ ను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కల్తీ పనీర్ ను ఎలా తయారు చేస్తారు?
అసలు పనీర్‌కు బదులు కల్తీ పనీర్‌ను కూడా బాగా అమ్ముతున్నారు. దీనినే సింథటిక్ చీజ్ అంటారు. ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనిని తయారు చేయడానికి యూరియా, బిటుమెన్ కలర్, డిటర్జెంట్, సుసెలెరిక్ యాసిడ్ వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. నకిలీ పనీర్ ను పాలకు బదులుగా మైదా పిండిని ఉపయోగిస్తారు. అంతేకాదు పాలలో సోడియం బైకార్బొనేట్ అంటే బేకింగ్ సోడాను కూడా కలుపుతారు. తర్వాత ఈ మిశ్రమానికి పామాయిల్ లేదా కూరగాయల నూనెను కలుపుతారు. చివరగా దీనిలో బేకింగ్ పౌడర్ ను కలిపి ఒక కంటైనర్ లో నిల్వ చేస్తారు. అంతే ఇది గట్టి పడితే పనీర్ లా కనిపిస్తుంది.
నకిలీ పనీర్ ను తినడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి?
పాలతో తయారయ్యే పనీర్ ను ప్రపంచ వ్యాప్తంగా తింటారు. కానీ ఈ పనీర్ కూడా ఎక్కువగా కల్తీ అవుతుంటుంది. కల్తీ పనీర్ ను తింటే బరువు బాగా పెరిగిపోతారు. కల్తీ పనీర్‌లో స్టార్చ్ లేదా సింథటిక్ మిల్క్ ఉంటుంది, ఇది జీర్ణక్రియ సమస్యలకు కారణమవుతుంది. కల్తీ పనీర్‌లో హానికరమైన పదార్థాలను కలపడం వల్ల కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఈ కల్తీ పనీర్ ను తింటే డయేరియా కూడా వస్తుంది. అలాగే వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.
కల్తీ పనీర్ లో డిటర్జెంట్లు, రసాయనాల వంటి హాని కలిగించే పదార్ధాలను కలపడం వల్ల చర్మ అలెర్జీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పెదవులు, నాలుక, గొంతు వాపు వంటి ఎన్నో అలెర్జీ సమస్యలు వస్తాయి.
కిడ్నీకి హానికరం
కల్తీ పనీర్ లో యూరియా లేదా సింథటిక్ మిల్క్ వంటి పదార్ధాలను కలుపుతారు. ఇవి మన మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. అలాగే ఇవి భవిష్యత్తులో ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. మూత్రపిండాల నొప్పి, మూత్రవిసర్జన తగ్గడం, శరీరంలో ద్రవం నిలుపుదల వంటి సమస్యలు వస్తాయి. ఇది మీరు లావు అయ్యేలా చేస్తుంది.
കുടലിന്റെ ആരോഗ്യം
പ്രോബയോട്ടിക് ഗുണങ്ങള് അടങ്ങിയ പനീര് കഴിക്കുന്നത് വയറിന്റെ ആരോഗ്യത്തിനും നല്ലതാണ്.
Paratha
It is a stuffed Indian bread with spicy potato, paneer, cauliflower or mixed filling, usually served with yoghurt, pickles, and butter.
క్యాన్సర్ రిస్క్
మీకు తెలుసా? కల్తీ పనీర్ లో కూడా క్యాన్సర్ కారకాలు ఉంటాయట. దీనిలో క్యాన్సర్ కారకమైన ఫార్మాల్డిహైడ్ వంటి రసాయనాలను కూడా కలుపుతారట. ఇలాంటి పదార్థాలను ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
కల్తీ పనీర్‌ను ఎలా గుర్తించాలి?
FSSAI ప్రకారం.. దీనిని కొన్ని సులువైన పద్దతిలో గుర్తించొచ్చు. మొదటి పద్ధతి ప్రకారం.. ఒక పాన్ తీసుకొని అందులో పనీర్ ను వేసి ఉడికించండి. ఉడికించిన పనీర్‌లో కొన్ని చుక్కల అయోడిన్ ద్రవాన్ని వేయండి. ఈ పనీర్ నీలం రంగులోకి మారితే, అది కల్తీది అని అర్థం చేసుకోవాలి. పనీర్ రంగు చెక్కుచెదరకుండా ఉంటే అది అసలైనదని అర్థం చేసుకోండి. అయితే ఈ టెస్ట్ కేవలం స్టార్చ్ కల్తీని గుర్తించడానికి మాత్రమే భావవంతంగా ఉంటుంది.
రెండవ పద్ధతి ప్రకారం.. ఉడికించిన పనీర్ ను నీటిలో వేయండి. ఈ నీటిలో కొంచెం పప్పు వేసి 10 నిమిషాలు ఉంచండి. నీటి రంగు లేత ఎరుపు రంగులోకి మారితే అది కల్తీ పనీర్ అని అర్థం చేసుకోండి. ఈ నీళ్ల రంగు మారకపోతే అది అసలైన పనీర్ అని అర్థం చేసుకోండి. రంగు కల్తీని గుర్తించడానికి మాత్రమే ఈ పరీక్ష ఉపయోగకరంగా ఉంటుంది.
మూడవ పద్ధతి ప్రకారం.. మీరు కొనే పనీర్ వాసనను ఖచ్చితంగా చూడండి. పనీర్ వాసన పుల్లగా వస్తే వెంటనే దాన్ని ఓపెన్ చేసి చెక్ చేయండి. ఆ పనీర్ రబ్బరుగా ఉంటే అది కల్తీది అని అర్థం చేసుకోండి.