మామిడిపండ్లు తింటే లావవుతారా? నిజమేంటంటే...
పండ్లలో రారాజు మామిడి.. దీని రసభరితమైన తియ్యని రుచికి ఫిదా కానివాళ్లు ఉండరు. అయితే వేసవిలో లభించే ఈ అమృతఫలంతో లావు పెరుగుతారనే భయం చాలామందిలో ఉంటుంది. అయితే ఇది ఎంతవరకు నిజం..? అంటే ఇందులో కొంతభాగం వాస్తవం లేకపోలేదు. అతి సర్వత్రా వర్ఝయేత్ అనేది మామిడికి కూడా వర్తిస్తుంది.

ఇష్టం కదా అని రోజూ పొద్దున, సాయంత్రం తెగలాగించేస్తే ఖచ్చితంగా బరువుపెరుగుతారు. ఈ కారణంతోనే చాలా మంది ఫిట్‌నెస్ ప్రేమికులు మామిడి తినడం మానేస్తారు.
మామిడిపండ్లలో కొవ్వు, కొలెస్ట్రాల్, ఉప్పు ఉండదు. వేసవికాలంలో దొరికే ఈ పండులో వేసవిలో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
వెయిట్ లాస్ క్రమంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా వీటిని ఆచీ తూచీ క్యాలరీల లెక్కకట్టి మరీ తీసుకోవాలి. బరువు పెరగకుండా ఉండటానికి భోజనం చేసిన వెంటనే మామిడి తినడం మానేయాలి.
అంతేకాదు మామిడి పండ్లను ఉదయాన్నే లేదా సాయంత్రం స్నాక్స్ లా తినడం చాలా మంచిది.
కొంతమంది నిపుణులు మామిడి పండ్లను నిర్దిష్ట కేలరీల పరిమితిలో తింటే బరువు తగ్గడానికి సహాయపడుతుందని నమ్ముతారు. మామిడి మీ శరీరానికి షుగర్ రష్‌ను అందిస్తుంది. మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది.
క్యాలరీల కొలతల్లో మామిడిని ఆహారంలో చేర్చాలంటే మీకవసరమైన సింపుల్ అండ్ ఈజీ రెసీపీలు కొన్ని ట్రై చేస్తే మంచిది. అవేంటో చూడండి..
స్మోక్ డ్ చికెన్ అండ్ మ్యాంగో సలాడ్ : ఒక గిన్నెలో మామిడి పండ్ల ముక్కలు, స్మోక్ డ్ చికెన్, అవోకాడో, కొన్ని అరుగూలా ఆకులు, 2 టేబుల్ స్పూన్లు వేయించిన వేరుశెనగలు, 2 టేబుల్ స్పూన్లు ఉడికించిన లెగుమ్స్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ నల్ల మిరియాలు, నిమ్మరసం వేసి బాగా కలపండి. దీన్ని తాజాగా తినేస్తే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.
మ్యాంగో సల్సా : ఒక మిక్సింగ్ బౌల్ లో మామిడి పండు ముక్కలు, 1 చిన్న ఉల్లిపాయ, 1 చిన్న టమోటా, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా నల్ల మిరియాలు, నిమ్మరసం, కారం పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపండి. దీన్ని బాగా మిక్స్ చేసి సర్వ్ చేయాలి.
ఆమ్ పన్నా : రెండు మామిడికాయలను ఉడకబెట్టి, పై తోలు తీసి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ మిక్సింగ్ జార్ తీసుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల చక్కెర, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల వేయించిన జీలకర్ర పొడి, 1 స్పూన్ నల్ల మిరియాలు పొడి, 1 స్పూన్ నల్ల ఉప్పు, 2 స్పూన్ చాట్ మసాలా, 1 కట్ట పుదీనా ఆకులు, మామిడి గుజ్జు కలిసి... దీన్ని మెత్తటి పేస్టులా తయారు చేయండి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని సర్వింగ్ గ్లాస్ లో సగం వరకు నింపి.. మిగతా సగం చల్లటి నీరు, ఐస్ తో నింపండి. అంతే రుచికరమైన ఆమ్ పన్నా రెడీ.