NTR:ఎన్టీఆర్ 'హనుమాన్ దీక్ష' ఫొటోలు, నియమాలు, ఫలితం
ముంబై లో పెన్ మూవీస్ వారు ఇచ్చిన ట్రిపుల్ ఆర్ సక్సెస్ పార్టీలు తర్వాత సడన్ గా మాయమయ్యారు. కారణం ఎన్టీఆర్ హనుమంతుని దీక్ష తీసుకోవడమే. ఎన్టీఆర్ హనుమంతుని పూజిస్తూ ఈ ఏడాది కొత్తగా ఆయన మాల వేసుకుని భక్తి శ్రద్దలతో పూజలు చేస్తున్నారు

NTR Hanuman maladharana
ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. హనుమాన్ దీక్షలో భాగంగా ఆయన 21 రోజుల పాటు దీక్షకు చెందిన క్రమశిక్షణను పాటిస్తున్నారు. అయితే ఆయన లుక్ బయిటకు రాలేదు. కానీ ఇప్పుడు, 'RRR' నటుడు అతని మాలాలో బయటకు కనిపించారు. కొంతమంది అభిమానులు ఫోటో కోసం అతనిని సంప్రదించినప్పుడు, ఎన్టీఆర్ సంతోషంగా వారితో పోజు ఇచ్చాడు. అతను మాలా, నారింజ ప్యాంటు, మరియు నారింజ రంగు చొక్కా ధరించి, చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించాడు. ఈ 21 రోజుల్లోనూ అదే మెయింటెయిన్ చేస్తాడు.
NTR Hanuman maladharana
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత హైదరాబాద్ లో దిల్ రాజు పార్టీ, ముంబై లో పెన్ మూవీస్ వారు ఇచ్చిన ట్రిపుల్ ఆర్ సక్సెస్ పార్టీలు తర్వాత సడన్ గా మాయమయ్యారు. కారణం ఎన్టీఆర్ హనుమంతుని దీక్ష తీసుకోవడమే. ఎన్టీఆర్ హనుమంతుని పూజిస్తూ ఈ ఏడాది కొత్తగా ఆయన మాల వేసుకుని భక్తి శ్రద్దలతో పూజలు చేస్తున్నారు.
NTR Hanuman maladharana
అయితే ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష లుక్ ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా బయటికి వచ్చింది. హనుమంతుని బొట్టు రంగులో ఉన్న దుస్తుల్లో ఎన్టీఆర్.. గెడ్డం పెంచి, మెడలో రుద్రాక్ష మాల వేసుకుని నుదుటున బొట్టుతో కనిపించారు. ఇక ట్రిపుల్ ఆర్ మరో హీరో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారు. ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరు హనుమంతుని మాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ హనుమాన్ మాలాధారణలో కనిపించారు.
NTR Hanuman maladharana
హనుమాన్ దీక్షలో చాల కఠినమైన నిబంధనలు ఉండడంతో ఒక్కసారి మండలదీక్ష ను స్వీకరించిన స్వాముల్లో తప్పకుండా మార్పు వస్తుంది. ఆ మార్పే నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది.
హనుమాన్ దీక్షలో చాల కఠినమైన నిబంధనలు ఉండడంతో ఒక్కసారి మండలదీక్ష ను స్వీకరించిన స్వాముల్లో తప్పకుండా మార్పు వస్తుంది. ఆ మార్పే నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. హనుమాన్ స్వాములు భక్తితో ప్రార్థన, పీఠానికి హారతి, సన్నిదానంలో నిద్రించుట, ప్రతి నిత్యం మందిర దర్శనం, మాటిమాటికి ‘జైహనుమాన్ జీ’ అని పలుకరించి రామనామ స్మరణం చేయటం, దీని ద్వార ప్రతీ ఇంట్లో సుఖ శాంతులు ఏర్పడడం చెప్పుకొదగ్గ విషయం. దీనిని నిత్య జీవితంలో పాటిస్తే కుటుంబాలు బాగా ఉంటాని మనిషి జీవితంలో పురోగతి ఉంటుందని నమ్మకం.
NTR Hanuman maladharana
సాదారణంగా హనుమాన్ మండలదీక్షను హనుమద్వ్రతమ్ లేదా హనుమజ్జయంతి నాటి పర్వదినములలో స్వీకరిస్తారు.
దీక్షను హనుమాన్ మందిరంలో అర్చక స్వాముల సమక్షంలో స్వీకరించి 41 రోజుల పాటు కలశ ఆరాధన చేసి కఠినమైన మండలదీక్ష ను ప్రారంభించాలి. దీక్షాపరులు ఉదయం 4 గంటలకు లేని ప్రాతఃకాల ప్రార్థన చెసుకొని పీఠ పూజను చేసి అనంతరం పండ్లు పాలతో అల్పహారం తీసుకుంటారు. మధ్యాహ్నం 1 గంటలకు బిక్ష చేస్తారు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత రాత్రి పూట. పూజను నిర్వహించాలి. అనంతరం దీక్షాస్వాములు వారి వారి ఇండ్లలో పీఠ పూజను చేసుకొని భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి . దీక్ష విరమణ అయినంత వరకు కల్షంలోని కొబ్బరిని తీసుకొని గుమ్మానికి కట్టుతారు. పీఠం మీద ఉన్న బియ్యాన్ని వండుకొని బిక్ష చేస్తారు
naatu naatu song
సెలబ్రిటీలు కూడా దీక్షలు వేస్తూ ఉంటారు. ఎక్కువగా మన స్టార్స్ అయ్యప్ప స్వామి దీక్ష వేసుకుంటారు. తెలుగు, తమిళ్, మలయాళం, బాలీవుడ్ స్టార్లు చాలా మంది అయ్యప్ప మాల ప్రతి సంవత్సరం వేసుకుంటారు. చిరంజీవి, రామ్ చరణ్, శర్వానంద్, మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, ధనుష్, శింబు, వివేక్ ఒబెరాయ్, అజయ్ దేవగణ్…వీరంతా ప్రతీ ఏడాది అయ్యప్ప మాల ధరిస్తుంటారు. కొందరు శివమాల వేసుకుంటారు. ఇంకొందరు ఆంజనేయస్వామి దీక్ష చేపడతారు. ఇలా ఎవరికి వారు తమకు ఇష్టమైన దైవాన్ని స్మరిస్తూ.. కొన్నిరోజుల పాటు దీక్ష చేస్తుంటారు.
సినిమాల విషయానికి వస్తే...కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం షూటింగ్ జూలైలో ప్రారంభం కానుంది. సుధాకర్ మిక్కిలినేని మరియు కళ్యాణ్ రామ్ యొక్క ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని బ్యాంక్రోల్ చేయనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ మరియు ఇతర నటీనటుల వివరాలు ఇంకా ఖరారు కాలేదు.