జయం రవి విడాకులకు కారణమైన కేనిషా ఫ్రాన్సిస్ ఎవరో తెలుసా? డైవర్స్ వెనుక షాకింగ్ విషయాలు
నటుడు జయం రవి విడాకుల వివాదంలో కేంద్ర బిందువుగా ఉన్న గాయని కేనిషా ఫ్రాన్సిస్ గుర్తింపు మరియు నేపథ్యం గురించి ఈ వ్యాసం వివరిస్తుంది.
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి విడాకుల మ్యాటర్ ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. ఆయన తన 15ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించారు. తమ పర్సనల్ లైఫ్‌కి ప్రైవసీ ఇవ్వాలని అభిమానులను, మీడియాని కోరారు. అయితే జయం రవి సడెన్‌గా విడాకులు ప్రటించడానికి కారణమేంటి? దీని వెనుక ఉన్న కథేంటి? అనేది చూస్తే షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. సింగర్ కేనిషా ఫ్రాన్సిస్ తో ఎఫైర్ కారణమని తెలుస్తుంది. మరి ఇంతకి ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది చూస్తే..
నిర్మాత సుజాత విజయకుమార్ కుమార్తె, ఆర్తిని 2009లో ప్రేమ వివాహం చేసుకున్నారు జయంరవి. ఆర్తిది సంపన్న ఫ్యామిలీ. దీంతో ఆమెని మ్యారేజ్ చేసుకోవడానికి జయం రవి పేరెంట్స్ అభ్యంతరం తెలిపారట. దీంతో జయం రవి తన తల్లిదండ్రులను కత్తితో బెదిరించినట్టు వార్తలు వచ్చాయి.
సినిమా కోసం జయంరవి బరువు తగ్గుతుంటే, ఆర్తి కోసం బెంగతో సిక్ అవుతున్నాడని భావించి పెళ్లికి ఓకే చేశారట. అలా ఘనంగా వివాహ వేడుకను నిర్వహించారు, వీరి మ్యారేజ్‌కి రజనీకాంత్. కమల్ హాసన్ సహా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. జయం రవితో కలిసి సుజాత విజయకుమార్ నిర్మించిన `ఆడంగామరు`, `టిక్ టిక్ టిక్`, `సైరన్` వంటి చిత్రాలు పెద్ద హిట్ అయ్యాయి.
వివాహం తరువాత జయం రవి, ఆర్తి మధ్య చాలా సమస్యలు ఉన్నప్పటికీ, సుజాత విజయకుమార్ అల్లుడికే సపోర్ట్ చేసేవారట. ఇది ఆర్తికి నచ్చేది కాదు. తనపై కోప్పడేదని, కానీ జయం రవి కూల్ అండ్ కామ్ అని అని ఆమె ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు. రెండు నెలల క్రితం వరకు చాలా సంతోషంగా ఉన్న జంట జయం రవి, ఆర్తి మధ్య అసలేం జరిగిందనేది చూస్తే,
తన విడాకుల ప్రకటనలో జయం రవి తన కుటుంబం మంచి కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీంతో చాలా మంది భార్య ఆర్తిని తప్పుపట్టారు. ఆమెపై చాలా విమర్శలు వచ్చాయి. దీనికి కౌంటర్‌గా స్పందించింది ఆర్తి. ఆమె ఈ సందర్భంగా అసలు విషయాన్ని వెల్లడించింది. జయం రవి విడాకుల నిర్ణయం కుటుంబం యొక్క శ్రేయస్సు కోసం కాదని, ఏకపక్ష నిర్ణయం అని ఆమె స్పష్టం చేసింది.
ఈ విషయంలో తాను విమర్శలను ఎదుర్కొంటున్నానని, కానీ ఒక తల్లిగా, తన పిల్లల శ్రేయస్సు, భవిష్యత్తు ఎల్లప్పుడూ తన ప్రాధాన్యత అని ఆర్తి చెప్పింది. ఈ ఆధారాలు లేని ఆరోపణలు తన పిల్లలను బాధపెడతాయని, కానీ దాన్ని తాను అంగీకరించనని తెలిపింది. ఈ ప్రకటనలో ఆమె భర్త జయం రవిపై ఉన్న ప్రేమని కూడా పరోక్షంగా వెల్లడించింది. జయం రవిపై కోపం ఉన్నప్పటికీ, భర్తను కోరుకుంటున్నట్లు చెప్పింది.
మరి ఆర్తి జీవితాన్ని డిస్టర్బ్ చేసిన కేనిషా ఫ్రాన్సిస్ ఎవరు? ఆమెకు, జయం రవికి ఎలా పరిచయం ఏర్పడిందనేది చూస్తే, కేనిషా ఫ్రాన్సిస్ సింగర్. ఇండిపెండెంట్ ఆల్బమ్స్ పాడి పాపులర్ అయ్యింది. బెంగుళూరుకి చెందిన కేనిషా గోవాలోని పబ్‌లలో పాటలు పాడుతుంది. తమిళంలో జీవా నిర్మించిన ఓ ఆల్బమ్‌లోనూ ఆమె పాటలు పాడింది. అడపాదడపా సినిమాల్లో పాడటంతోపాటు సోలో ఆల్బమ్స్ తోనూ ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది.
అయితే ఆమెకి పెళ్లి కూడా అయ్యిందని సమాచారం. కానీ భర్తకి సంబంధించిన వివరాలు తెలియవు. దీంతో నిజంగానే ఆమెకి పెళ్లి అయ్యిందా అనేది సస్పెన్స్. జయం రవి తన సినిమాల షూటింగ్‌లు లేని టైమ్‌లో కాలేజ్ ఫ్రెండ్స్ తో కలిసి గోవాకి వెళ్తుండేవాడు. అక్కడ పబ్‌కి వెళ్లినప్పుడు కేనిషా పరిచయం అయ్యిందట.
కేనిషా ఫ్రాన్సిస్ స్వరానికి ఫిదా అయిన జయం రవి ఆమెని పరిచయం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఈ స్నేహం ఆర్తి, జయం రవి ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టింది. వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా గోడవలకు కారణం ఇదే అని తెలుస్తుంది. తన ప్రతి మ్యారేజ్ డేని ఆర్తితో జరుపుకుంటాడు జయం రవి. ఫ్యామిలీ, పిల్లలతో ఉంటాడు. కానీ ఈ ఏడాది తనకు షూటింగ్ ఉందని చెప్పి, వార్షికోత్సవాన్ని జరుపుకోకుండానే గోవా వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఆర్తి వెంటనే గోవా వెళ్లి జయం రవి ఎప్పుడూ బస చేసే హోటల్లో చెక్ చేయగా అతను అక్కడ లేడు.
జూన్ 24న, గోవాలోని కలంగుట్‌లో తాను ప్రయాణించే కారుకి నల్ల స్టిక్కర్ అంటించి ఉండటంతో పోలీసులు పట్టుకున్నారు. జయం రవి పేరుతో కొనుగోలు చేసిన లగ్జరీ కారుకు గోవా పోలీసులు జరిమానా విధించారు. తరువాత, జూలై 14న, జయం రవి కారులో వేగంగా ప్రయాణం చేసినందుకు కేనిషా ఫ్రాన్సిస్‌కు జరిమానా విధించారు.వీటి తాలూకు మెసేజ్‌లు ఆర్తి ఫోన్‌కి వెళ్లాయట.
దీంతో ఆమెకి అనుమానం మరింత పెరిగింది. ఈ విషయాన్ని నిర్ధారించే ఈ కాపీలు బయటకు వచ్చాయి. కేనిషాతో జయంరవి ఉండటాన్ని తట్టుకోలేకపోయిన ఆర్తి.. తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఆయనతో ఉన్న ఫోటోలను, జయంరవి ఫోటోలను తొలగించింది.
ఆర్తి.. తమ మధ్య సమస్య గురించి జయం రవితో మాట్లాడటానికి ప్రయత్నించినప్పటికీ, అతను ఆమెను చూడటం మానుకున్నాడు. దీనికి కారణం కేనిషా ఫ్రాన్సిస్ అని చెబుతున్నారు. షూటింగ్ కోసం వెళ్ళిన తండ్రి తన పుట్టినరోజు కోసం వస్తాడని జయం రవి కుమారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ దానికి ముందే, అతని విడాకుల ప్రకటన విడుదలై సంచలనం సృష్టిస్తుంది.
జయం రవి తండ్రి, సోదరుడు అతన్ని ఆర్తితో తిరిగి కలపడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. కానీ జయం రవి కేనిషా ఫ్రాన్సిస్ తో ఉన్నాడని, తన కుటుంబాన్ని కలవడానికి, మాట్లాడటానికి కూడా నిరాకరిస్తున్నాడని, వారి ఫోన్ కాల్స్‌కు కూడా సమాధానం ఇవ్వడం లేదని తెలుస్తుంది. గాయని కావడంతో పాటు కేనిషా ఫ్రాన్సిస్ ఆధ్యాత్మిక వైద్యురాలు అని చెబుతున్నారు. మరి జయం రవి కేనిషాని పెళ్లి చేసుకుంటాడా? తిరిగి తన భార్యకి దగ్గరవుతాడా? అనేది చూడాలి. కానీ మళ్లీ వీరిద్దరు కలవాలని అభిమానులు కోరుకుంటుండటం విశేషం.