తన బ్రేకప్ లవ్ స్టోరీ గుట్టు విప్పిన కియారా అద్వానీ.. ఆ బాధ వర్ణనాతీతం అట!
సామాన్యులకైనా.. సెలబ్రిటీలకైనా.. ప్రేమ, ఫ్రెండ్షి వంటి ఎమోషన్స్ చాలా కామన్. మనసుకు నచ్చినవారు దూరమైతే ఆ బాధ వర్ణించడం చాలా కష్టం. స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ సైతం అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారట.
ఓ సందర్భంలో కియారా అద్వానీ తన ఫైల్యూర్ రిలేషన్ షిప్ గురించి పెదవి విప్పారు. ఆ బ్రేకప్ స్టోరీ తనను మానసికంగా ఎంతో ఇబ్బందికి గురిచేసిందని ఆమె అన్నారు.
ఓ ప్రముఖ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా అందరికి మాదిరిని నేను కూడా బ్రేకప్ పెయిన్ ని అనుభవించాను. ఆ సమయంలో నిద్ర లేని రాత్రులు గడిపాను అన్నారు. అయితే ఎవరికోసమే మనం ఇంతలా బాధపడడం సరికాదని త్వరగానే ఆమె రియలైజ్ అయ్యారట.
కుటుంబ సభ్యులు, మిత్రులతో గడపడం, తన ఆవేదన చెప్పుకోవడం ద్వారా ఆ సమస్య నుండి బయటపడ్డానని కియారా తెలిపారు.
అలాగే మనం బాధలో ఉన్నప్పుడు గట్టిగా ఏడ్చేయాలని.. దానివలన మనలోని బాధ తగ్గి మనసు తేలిక అవుతుందని కియారా సలహా ఇచ్చారు.
ఇక కియారా నటించిన ఇందూకి జవానీ మూవీ ఇటీవల విడుదలైంది. అలాగే కొన్ని హిందీ చిత్రాలలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు.