ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన నమిత, పరుగున వచ్చిన గ్రామస్థులు... టెన్షన్ పుట్టించిన హైడ్రామా!
First Published Jan 13, 2021, 2:02 PM IST
గ్లామర్ హీరోయిన్ నమిత ప్రమాదవశాత్తు పాడుబడిన బావిలో పడిపోయారు. ఆమె సెల్ ఫోన్ చేతి నుండి జారీ పడిబోతుండగా, దాన్ని పట్టుకోబోయి పక్కనే ఉన్న బావిలో పడిపోయారు. అది చూసిన గ్రామస్థులు ఆమెను కాపాడడానికి పరుగున వచ్చారట. ఓ మారుమూల ప్రాంతంలో జరిగిన ఈ నాటకీయ సంఘటన నేపథ్యం ఏమిటంటే..!

2002లో దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన సొంతం మూవీతో వెండితెరకు పరిచయమైంది నమిత. తదుపరి చిత్రమే వెంకటేష్ వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకుంది. తమిళ్ రీమేక్ జెమినీ మూవీలో వెంకీకి జంటగా నమిత నటించారు.

ఆ తరువాత సౌత్ లోని అన్ని భాషలలో నమిత చిత్రాలు చేశారు. తమిళ్ లో మాత్రం నమిత స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకున్నారు. తమిళ ప్రేక్షకులు నమితకు గుడి కట్టారంటే అక్కడ ఆమె ఫేమ్ ఎలాంటిదో చెప్పుకోవచ్చు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?