- Home
- Entertainment
- ప్రభాస్ నటుడే కాదు అంటూ పాన్ ఇండియా డైరెక్టర్ తీవ్ర విమర్శలు.. 'సలార్' టీజర్ ని టార్గెట్ చేస్తూ..
ప్రభాస్ నటుడే కాదు అంటూ పాన్ ఇండియా డైరెక్టర్ తీవ్ర విమర్శలు.. 'సలార్' టీజర్ ని టార్గెట్ చేస్తూ..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. ప్రభాస్ శ్రీరాముడిగా రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తీవ్ర విమర్శలు, వివాదాలు మూటగట్టుకుంది. ఓం రౌత్ రామాయణంతో చేసిన ప్రయోగం ఫలించలేదు.
దీనితో ప్రభాస్ అభిమానులంతా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సలార్' చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో రీసెంట్ గా టీజర్ విడుదల చేశారు. టీజర్ లో ప్రభాస్ ని డైనోసార్ తో పోల్చుతూ ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ బాగా వర్కౌట్ అయింది. టీజర్ మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది.
salaar
అయితే ఇది కెజిఎఫ్ కి కొనసాగింపా అనే అనుమానాలు మొదలయ్యాయి. కేజిఎఫ్ తరహాలోనే విజువల్స్ ఉండడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రశాంత్ నీల్ మరోసారి భారీ యాక్షన్ చిత్రాన్ని రెడీ చేతున్నారనేది వాస్తవం. అయితే తాజాగా సలార్ టీజర్ ని, ప్రభాస్ ని టార్గెట్ చేస్తూ పాన్ ఇండియా డైరెక్టర్ చేసిన తీవ్ర విమర్శలు సంచలనంగా మారాయి.
ఆ డైరెక్టర్ ఎవరో కాదు 'కశ్మీర్ ఫైల్స్' చిత్రంతో ఇండియా మొత్తం పాపులర్ అయిన వివేక్ అగ్నిహోత్రి. వివేక్ అగ్నిహోత్రి.. ప్రభాస్ ని టార్గెట్ చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఆయన పరోక్షంగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఎవరూ హింసని కోరుకుని పుట్టరు. ఇండస్ట్రీ పెద్దలు పిల్లలని శాంతివైపు ప్రేరేపించేలా నడుచుకోవాలి. కానీ సినిమాల్లో, రాజకీయాల్లో హింసని ఒక ఫ్యాషన్ గా మార్చేస్తున్నారు. ఇలాంటి ప్రపంచంలో సృజనాత్మక స్పృహ మాత్రమే మార్గం.
ప్రస్తుతం సినిమాల్లో మితిమీరిన హింసని ప్రమోట్ చేయడం, అర్థం లేని చిత్రాలని తెరకెక్కించడం కూడా ప్రతిభ గానే పరిగణించబడుతోంది. అసలు నటుడే కానీ వ్యక్తిని బిగ్గెస్ట్ స్టార్ అని ప్రమోట్ చేయడం ఇంకా పెద్ద ట్యాలెంట్' అంటూ వివేక్ అగ్నిహోత్రి.. సలార్ టీజర్, ప్రభాస్ పై పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే సలార్ విడుదలవుతున్న రోజునే వివేక్ తెరకెక్కిస్తున్న 'ది వ్యాక్సిన్ వార్' కూడా రిలీజ్ అవుతోంది. బహుశా అందుకే సలార్ ని టార్గెట్ చేసి ఉంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాలేవీ ఫ్యాన్స్ ని సంతృప్తి పరచలేదు. దీనితో సలార్ పై భారీ అంచనాలే ఉన్నాయి.