- Home
- Entertainment
- సాయిపల్లవి పాత్ర రియల్ లైఫ్‌లో ఎవరిదంటే?.. `విరాటపర్వం`లో అసలు హీరో ఆమేనే అంటూ రానా ట్విస్ట్..
సాయిపల్లవి పాత్ర రియల్ లైఫ్‌లో ఎవరిదంటే?.. `విరాటపర్వం`లో అసలు హీరో ఆమేనే అంటూ రానా ట్విస్ట్..
విప్లవ నేపథ్యంలో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా వస్తోన్న`విరాటపర్వం` చిత్రంపై ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. ఈ సినిమాలో అసలు హీరో సాయిపల్లవినే అంటూ రానా చెప్పడం మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. సాయిపల్లవి పాత్ర ఇదే అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.

పది రోజుల ముందు వరకు `విరాటపర్వం`(Virata Parvam) సినిమా విడుదలవుతుందా? అనేది అందరిలోనూ నెలకొన్న సందేహాలు. కానీ ఒక్కసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక క్రమంతో ఈ చిత్రంపై అటెన్షన్ పెరుగుతుంది. ఇప్పుడు క్రేజ్ పెరుగుతుంది. చర్చనీయాంశంగా మారింది. కారణం ఇది యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం కావడం. ఇందులో సంచలనాత్మకమైన విషయాలు దాగుండటం కూడా ఈ చర్చకి కారణమని చెప్పొచ్చు.
రానా(Rana), సాయిల్లవి(Sai Pallavi) జంటగా నటించిన ఈ చిత్రానికి `నీది నాది ఒకే కథ` ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. ప్రియమణి, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర వంటి నోటెడ్ ఆర్టిస్టులు నటించారు. రానా మాజీ నక్సలైట్, విప్లవకారుడు రవన్న పాత్రలో నటిస్తున్నారు. ఆయన జీవితం ఆధారంగానే 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు వేణు ఉడుగుల.
ఈ సినిమాని మొదట జులై 1న విడుదల చేయాలని భావించారు. కానీ ముందుగా పెద్ద సినిమాలు లేకపోవడం, డేట్ కలిసి రావడంతో రెండు వారాల ముందుగానే విడుదలకు సిద్ధమయ్యారు. జూన్ 17న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది. ఓటీటీలో రాబోతుందనే పుకార్లకి బ్రేక్ చెబుతూ, థియేటర్ రిలీజ్‌తో అటెన్షన్ క్రియేట్ చేసింది యూనిట్. ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా డిఫరెంట్‌గా, మరింత ఆసక్తిగా నిర్వహిస్తున్నారు. సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. రేపు(జూన్5న) ఈ చిత్ర ట్రైలర్‌ని కర్నూలులో ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన సరికొత్త చర్చ తెరపైకి వస్తుంది. ఈ సినిమాలో రానా మెయిన్ కాదని, సాయిపల్లవి పాత్ర ప్రధానంగానే సాగుతుందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. దానికి కారణం చిత్ర బృందం చేసిన ఓ ప్రమోషన్ వీడియోనే. ఈ సినిమాని సాయిపల్లవి కోసమే తీశామని చెప్పడం ఆశ్చర్య పరుస్తుంది. ఓ యూట్యూబర్, రానాని వెదుక్కుంటూ సురేష్ ప్రొడక్షన్స్ కివెళ్లాడు. తాను సాయి పల్లవి ఫ్యాన్ అని పరిచయం చేసుకుని, `మా సాయి పల్లవి ఎప్పుడొస్తుంది? ట్రైలర్ ఎప్పుడు` అని ప్రశ్నలు సంధిస్తాడు. అందుకు రానా `నేను కూడా సాయి పల్లవి ఫ్యానే.. ఈ సినిమాని సాయి పల్లవి కోసమే తీశాం రా బాబూ` అని చెప్పడంతో మరింత హాట్ టాపిక్ అవుతుంది.
`విరాటపర్వం` చిత్రాన్ని సాయిపల్లవి సినిమాగా ప్రమోట్ చేస్తుండటం విశేషం. రానాతో పోల్చితే సాయిపల్లవికి క్రేజ్ ఎక్కువ. ఆమె డాన్సులు, నటనకి ఫిదా కాని ఆడియెన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. `లవ్ స్టోరీ`, `శ్యామ్ సింగరాయ్` చిత్రాల్లో ఆమె డాన్సులకు తెలుగు ఆడియెన్స్ మొత్తం ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఓ ఈవెంట్‌లో గెస్ట్ గా పాల్గొన్న సాయిపల్లవి మాట్లాడే క్రమంలో ఆడియెన్స్ గోల విని దర్శకుడు సుకుమారే షాక్ అయ్యారు. లేడీ పవన్ కళ్యాణ్ అంటూ కితాబిచ్చారు. సాయిపల్లవికి ఉన్న క్రేజ్‌ని ప్రతిబించిందా సంఘటన.
పైగా రానాకి సోలో హీరోగా మార్కెట్ తక్కువ. ఆయన విభిన్నమైన,ప్రయోగాత్మక సినిమాలు, పాత్రలు చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఆయన్ని వర్సెటైల్ యాక్టర్‌గానే చూస్తున్నారు. అందుకే సాయిపల్లవి పేరుని ముందుకు తెచ్చి సినిమాని ప్రమోట్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. అందులో భాగంగానే లేటెస్ట్ గా ప్రమోషనల్ వీడియోలో రానా నోటితోనే సాయిపల్లవి సినిమా అనిపించారని అంటున్నారు క్రిటిక్స్.
ఇదిలా ఉంటే తాజాగా ఇందులో సాయిపల్లవి పాత్ర లీక్ అయినట్టు వార్తలు ఊపందుకున్నాయి. ఆమె నటించిన వెన్నెల పాత్రకి ఇన్‌స్పిరేషన్ ఎవరో తెలిసిపోయిందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు కథ ఇదే అంటూ పుకార్లు ఊపందుకున్నాయి. సాయిపల్లవి పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెందిన అభ్యూదయ భావాలు కలిగిన సరళ అనే నాయకురాలి జీవితం ఆధారంగా సాయిపల్లవి పాత్రని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. బెల్లిలలిత అంటూ ప్రచారం జరుగుతున్న దాంట్లో నిజం లేదని టాక్.
సరళ.. రవన్న ప్రసంగాలను, ఆయన భావాలకు ఆకర్షితురాలై ఆయన్ని వన్‌సైడ్‌గా ప్రేమిస్తుందట. దూరం నుంచే చూస్తూ ఆరాధించేదని, ఆయన్ని కలిసేందుకు, నక్సల్స్ లో చేరేందుకు తరచూ అడవిలోకి వెళ్లేదట. రవన్న కోసం ఆమె అడవిలోకి రెగ్యూలర్‌గా వచ్చేదని, దీంతో ఆమెని పోలీస్‌కి చెందిన ఇన్‌ఫార్మర్‌గా నక్సల్స్ అనుమానించేవారని, అదే సమయంలో పోలీసులు కూడా ఆమెని నక్సల్స్ ఇన్‌ఫార్మర్‌గా అనుమానించారట. ఈ క్రమంలో ఆమెపై అనుమానం ఎక్కువైన నక్సల్సే సరళని హత్య చేశారని రియల్ లైఫ్‌లో సంఘటన ఆధారంగా తెలుస్తుంది. భరతక్క పాత్రలో నటిస్తున్న ప్రియమణి సినిమాలో సాయిపల్లవిని చంపేస్తుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అవుతుంది.