మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే
First Published Dec 31, 2020, 5:11 PM IST
న్యూ ఇయర్ వేళ చాలా మంది సెలబ్రిటీలు గోవాలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తారలు గోవా బీచ్లో మకాం వేశారు. మరికొందరు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. కియారా అద్వానీ అక్కడే ఉంది. తాజాగా విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్యపాండే కూడా ప్రియుడితో కలిసి బ్లూ సీ ఐలాండ్లో హీటు పుట్టిస్తుంది.

బాలీవుడ్ నటుడు చుంకీ పాండే తనయ అనన్య పాండే ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి `ఫైటర్` చిత్రంలో నటిస్తుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియన్ చిత్రంగా ఇది రూపొందుతుంది. ఈ సినిమాతో అనన్య తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.

ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్లో బిజీగా ఉందీ బ్యూటీ. హీరోయిన్ కాకముందు నుంచే ఎఫైర్స్ స్టార్ట్ చేసిన అనన్య ఇషాన్ ఖత్తర్తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?