- Home
- Entertainment
- శ్రీలీల కెరీర్ కూడా ఆమె లాగే కాబోతోందా.. సెన్సేషనల్ హీరోయిన్ జాతకంపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్
శ్రీలీల కెరీర్ కూడా ఆమె లాగే కాబోతోందా.. సెన్సేషనల్ హీరోయిన్ జాతకంపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్
బెంగుళూరు బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.

బెంగుళూరు బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది. ప్రస్తుతం శ్రీలీల పవన్ , మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని ఇలా వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.
ధమాకా చిత్రంతో అయితే శ్రీలీల ఒక ఊపు ఊపేసింది అనే చెప్పాలి. డ్యాన్స్, యాక్టింగ్, అందం ఇలా ప్రతి అంశంలో ఆమెకి తిరుగులేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫిమేల్ డ్యాన్సర్లలో శ్రీలీల ఒకరు. శ్రీలీల తన అందం, చలాకీతనం, నాట్యంతో టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్లకు ఆల్మోస్ట్ చెక్ పెట్టేసింది.
ఇంతకు ముందు స్టార్ హీరోల సినిమాలంటే రష్మిక, పూజా హెగ్డే లాంటి ముద్దుగుమ్మల పేర్లు వినిపించేవి. శ్రీలీల సునామీలా దూసుకువచ్చి వారి ప్రభావాన్ని తగ్గించేసింది. అయితే చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎక్కువ కాలం క్రేజ్ మైంటైన్ చేయడం కుదరడం లేదు. త్రిష, కాజల్, శ్రీయ లాంటి వారు గతంలో ఎక్కువ కాలం స్టార్స్ గా కొనసాగారు.
ఇప్పుడు నయనతార వయసుతో సంబంధం లేకుండా స్టార్ డమ్ సొంతం చేసుకుంది. అయితే శ్రీలీల ప్రస్తుతం కాంపిటీషన్ తట్టుకుని అంతకాలం టాలీవుడ్ లో హవా కొనసాగిస్తుందా అనేదే ఇప్పుడు ప్రశ్న. దీనిపై వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీలీల మీనరాశికి చెందిన నటి. శ్రీలీల జాతకంలో రాజయోగం ఉంది. అయితే ఆ రాజయోగం సుదీర్ఘకాలం ఉంటుందా అనేది ఇప్పుడే చెప్పలేం అని వేణు స్వామి అన్నారు.
ఇప్పటికి ఆమె గ్రహ బలాలని బట్టి చూస్తూ 2028 వరకు శ్రీలీల కి తిరుగులేదని అన్నారు. శ్రీలీల, నయనతార జాతకాలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి అని వేణు స్వామి అన్నారు. అయితే నయనతార చాలా సుదీర్ఘ కాలం సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆ స్థాయిలో శ్రీలీల హవా ఉంటుందా అనేది ఇప్పుడే తెలియదు అని వేణు స్వామి అన్నారు. మొత్తంగా ఆమె 2028 వరకు సౌత్ లో అనేక విజయాలు అందుకోబోతోంది అన్నారు.
ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ లో 8 క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. అందులో మహేష్ బాబు గుంటూరు కారం, రామ్ పోతినేని స్కంద, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ ఎక్స్ట్రా, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ లాంటి చిత్రాలు ఉన్నాయి.