అందం పెంచుకోవడానికి అలా చేయడం తప్పు కాదు.. వరుణ్ తేజ్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ వైరల్
అందాన్ని పెంచుకునేందుకు చాలా మంది నటీమణులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది రిస్క్ చేసి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం చూస్తూనే ఉన్నాం.
హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. నాజూకైన అందంతో మానుషి చిల్లర్ గ్లామర్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. మానుషి చిల్లర్ మతిపోగొట్టే ఒంపులతో మానుషి కవ్విస్తోంది. ఆల్రెడీ మానుషీ చిల్లర్ బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది.
నెమ్మదిగా ఆమెకి సౌత్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం మానుషీ చిల్లర్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ఆపరేషన్ వాలంటైన్ అనే అనే చిత్రంలో నటిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అవుతున్న ఈ మూవీ కోసం వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ ఇండియా మొత్తం తిరుగుతూ ప్రమోషన్స్ చేస్తున్నారు.
ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న మానుషీ చిల్లర్ మీడియా ముందు కనిపిస్తే సినిమాకంటే బ్యూటీకి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువ ఉంటాయి. ఈ క్రమంలో మానుషీ చిల్లర్ ఓ ప్రశ్నకు బోల్డ్ గా సమాధానం ఇచ్చింది.
అందాన్ని పెంచుకునేందుకు చాలా మంది నటీమణులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది రిస్క్ చేసి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం చూస్తూనే ఉన్నాం. కొన్ని సార్లు నటీమణుల ప్లాస్టిక్ సర్జరీ వికటించి ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు కూడా ఉన్నాయి.
ఇలా అందం కోసం సర్జరీలు చేయించుకోవడం సరైనదేనా అని మీడియా మానుషీ చిల్లర్ ని ప్రశ్నించింది. దీనికి మానుషీ సమాధానం ఇస్తూ అందం పెంచుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు అని సమాధానం ఇచ్చింది. ఇక్కడ రెండు విషయాలు మాట్లాడాలి.. మన దేశ చరిత్రని గమనిస్తే కొన్ని వేల సంవత్సారాల క్రితమే సౌదర్య నిపుణులు ఉన్నట్లు మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.
Manushi Chhillar
అంటే అందాన్ని పెంచుకునే ప్రయత్నాలు ఇప్పుడు కొత్తగా చేయడం లేదు. రెండవ విషయం ఏంటంటే ఒక్కొక్కరూ ఒక్కోలా కనిపించడానికి ఇష్టపడతారు. అలాంటప్పుడు వివిధ శరీర భాగాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం, ఇతర ట్రీట్మెంట్స్ చేయించుకోవడం తప్పు కాదు. పైగా అది వారి వ్యక్తిగత విషయం అని మానుషీ సమాధానం ఇచ్చింది.