నాన్న వల్లే నా జీవితం నాశనం అయ్యింది, వనిత విజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
తన తండ్రి వల్లే తన జీవితం నాశనం అయ్యింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది తమిళనటి వనిత విజయ్ కుమార్. తన తండ్రి గురించి ఆమె మాట్లాడిన పాత ఇంటర్వ్యూ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వనిత విజయ్ కుమార్ వారసత్వంగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చింది. సౌత్ స్టార్ కపుల్ విజయకుమార్ -మంజుల పెద్ద కుమార్తె. తమిళంలో దళపతి విజయ్ సరసన ‘చంద్రలేఖ’ సినిమాతో హీరోయిన్గా ఆమె తెరంగేట్రం చేసింది. తెలుగులో దేవి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది వనితా విజయకుమార్.. ఆ తర్వాత 2000లో నటుడు ఆకాష్‌ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది.
ఆ తర్వాత అదే ఏడాది ఆకాశ్ కు విడాకులు ఇచ్చి.. ఆనంద్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. తర్వాత అతడికి విడాకులు కూడా ఇచ్చింది వనిత విజయ్. చివరకు పీటర్ పాల్ ను పెళ్లాడిన వనిత అన్ని రెండు మూడు నెలల్లోనే బయటకు గెంటేసింది. ఇండస్ట్రీలో నటనతో కొంతమంది పాపులర్ అవుతారు. కొంత మంది కాంట్రవర్సీలతో పాపులర్ అవుతారు.. రెండో వర్గానికిచెందిన నటి వనిత విజయ్.
అయితే వనిత విజయ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే.. కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆమె ఎంట్రీ.. పెళ్లిళ్లు.. విడాకులతో కుటుంబ ప్రతిష్ట దిగజారుతుంది అని ఫ్యామిలీ అంతా బాధపడేవారట. దాంతో ఆమె కుటుంబీకుల మధ్య గొడవ పెద్దదిగా మారి.. ఈ గొడవతో వనితను ఆమె కుటుంబం మొత్తం దూరం పెట్టింది. దీంతో వనిత తన కూతుళ్లతో ఒంటరిగా ఉంటోంది.
ఈక్రమంలోనే వనిత తన తండ్రి విజయకుమార్ గురించి మాట్లాడిన పాత ఇంటర్వ్యూ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. వనిత మాట్లాడుతూ.. మా నాన్న గారు ఓ ఇంటర్వ్యూలో నా కూతుళ్లు పేర్ల అంటూ చెప్పుకొచ్చారు. అందులో కవిత, అనిత, అరుణ్ విజయ్, తర్వాత నా పేరు చెప్పకుండా ప్రీత, శ్రీ దేవి.. పేర్లు చెప్పారు. పెద్ద కూతురిగా నా పేరు కూడా పలకలేదు అన్నారు.
నా మాట వినే పిల్లలుగా నాన్న నాకంటే వేరే పిల్లల పేర్లు చెప్పారు. అతను నా పేరు చెప్పకపోవచ్చు. కానీ ప్రపంచానికి తెలుసు నేను ఆయన కూతురునీ అని. ఆయన చెప్పుకోడానికి ఇష్టపడకపోవచ్చు.. కాని ప్రపంచం అలా అనదు.. నేను ఎప్పుడూ అతని బిడ్డనే. పెళ్లయిన కొత్తలో నా పేరు ఎలా పెట్టాలి అని అడిగితే వనితా విజయకుమార్ అని చెప్పాను. అందుకే నాకు ఇప్పటికీ ఆ పేరు ఉంది అన్నారు నటి.
నేను నా పేరు చివరన భర్త పేరు కూడా పెట్టుకోవడానికి ఇష్టపడలేదు.. నాన్న పేరే పెట్టుకున్నారు. నాన్న మాట వినే ఏకైక బిడ్డను నేను. కాని అతని వల్లే నా జీవితం దిగజారింది. వదిలేస్తే నా జీవితం ఎలాగైనా ఉండేది. కానీ అతని మాటలు వినడం వల్ల నా జీవితం చాలా మారిపోయింది. దానికి కారణం నా తండ్రే అని వనిత ఆవేదన చెందారు. ఈవీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వనితకు సంబంధించిన ఈ వీడియో పాత వీడియో అయినప్పటికీ.. రీసెంట్ గా విజయకుమార్ తన మనవరాలు దియా పెళ్లి చేశారు. కాని ఫ్యామిలీలో ఎవరూ..వనితను ఆ పెళ్లికి పిలవలేదు. ఆమెను దూరంగా ఉంచారు. దాంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.