అబ్బాయిలలో నాకు నచ్చనిది అదే... అమ్మబాబోయ్ అవునా కృతి!
ఒక్క సినిమాతో టక్కున కుర్ర హృదయాలు దోచేసింది యంగ్ హీరోయిన్ కృతి శెట్టి. ఆమె నటించిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ్ హీరోగా పరిచయం కాగా సానా బుచ్చిబాబు ఉప్పెన చిత్రాన్ని తెరకెక్కించారు. ఉప్పెన మూవీలో కృతి నటన, ఎక్స్ ప్రెషన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. పది హిట్ సినిమాలలో నటించినంత పేరు కృతి శెట్టి ఉప్పెనతో తెచ్చుకున్నారు.
ఉప్పెన విజయంతో టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. నాని హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ చిత్రం శ్యామ్ సింగరాయ్ చిత్రంలో సాయి పల్లవి ఓ హీరోయిన్ గా నటిస్తుండగా, కృతి శెట్టి మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.
అలాగే సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే చిత్రంతో పాటు రామ్ పోతినేని లేటెస్ట్ మూవీలో హీరోయిన్ గా ఆమె ఎంపికయ్యారని సమాచారం.
మరి వరుస విజయాలతో దూసుకుపోతున్న కృతి శెట్టి తన అభిప్రాయాలు, అభిరుచులు పంచుకున్నారు ఓ ఇంటర్వ్యూలో.
ముఖ్యంగా తనకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారో, అబ్బాయిలతో తనకు నచ్చని గుణం ఏమిటో విడమరచి చెప్పింది.
యాంకర్ ప్రశ్నకు సమాధానంగా తనకు అబద్దాలు చెప్పే అబ్బాయిలు అంటే అస్సలు నచ్చదు అని కృతి చెప్పారు. ఈ సూత్రం అమ్మాయిలకు కూడా వర్తిస్తుందని చెప్పింది.
తప్పు చేసినా నిజాయితీగా ఒప్పుకునే వారంటే నాకు ఇష్టం. విషయం ఏదైనా మొహమాటం లేకుండా ముఖం మీదే చెప్పే ధైర్యం ఉండాలి. చేసిన తప్పు కప్పిబుచ్చుకోవడానికి అబద్దాలు చెప్పే వాళ్లంటే నాకు అసహ్యం అని కృతి కుండబద్దలు కొట్టారు.
మరి కృతి మనసు గెలవాలంటే నీతి, నిజాయితీగా ఉంటూ అబద్ధాలకు దూరంగా ఉండాలంట. మరి భవిష్యత్ లో కృతి శెట్టికి అలాంటి జెంటిల్ మెన్ దొరకాలని కోరుకుందాం.