NTR: ఎన్టీఆర్ కోసం కెరీర్ రిస్క్ లో పెడుతున్న ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు
ఉప్పెన చిత్రం విడుదలై ఏడాది దాటిపోతున్నా దర్శకుడు బుచ్చిబాబు సానా కొత్త చిత్రం ప్రకటించలేదు. అయితే ఆయన తన నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తో చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కాలం గడిపోతుండగా ఎప్పటో చిత్రం కోసం బుచ్చిబాబు సమయం వృధా చేస్తున్నారు.

<p>ntr, buchibabu sana</p>
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) హీరోగా 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుందని చాలా కాలంగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. యంగ్ మేకర్ ఎన్టీఆర్ ని లైన్ తో ఫిదా చేసి లాక్ చేసాడు. తారక్ స్ర్కిప్ట్ డెవలప్ మెంట్స్ అడగడంతో ఎప్పటికప్పుడు ఆ వెర్షన్స్ జరగడం..తారక్ వినడం జరిగింది. కానీ ఫైనల్ గా తారక్ ప్రాజెక్ట్ లాక్ చేసాడా? లేదా? అన్నది ఇప్పటికీ అస్పష్టమే.ఆర్ ఆర్ ఆర్' విజయంతో పాన్ ఇండియాలో తారక్ ఫేమస్ అవ్వడంతో బుచ్చిబాబుకి ఇప్పట్లో అవకాశం కష్టమేనన్న ప్రచారం తెరపైకి వచ్చింది.
పాన్ ఇండియా అప్పీల్ కి స్ర్కిప్ట్ లో మార్పులు చేయగల సత్తా బుచ్చిబాబు (Buchhibabu sana) లో ఉంటుందా? అన్న యాంగిల్ లో తారక్ అతన్ని లైట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రచారం సాగుతోంది. కానీ తారక్ లైనప్ లో మాత్రం బుచ్చిబాబు కచ్చితంగా ఉంటాడని మరోవైపు ధీమా వ్యక్తం అవుతోంది.
ఏదో ఒక రోజు తారక్ తో తో యంగ్ మేకర్ సినిమా తీయడం గ్యారెంటీ అంటున్నారు. 'ఉప్పెన' (Uppena)చిత్రం తారక్ నిమెప్పించిన విధానం కావొచ్చు...తారక్ విన్న కథ..నేరేషన్ కావొచ్చు బుచ్చిబాబు పై పూర్తిగా సాప్ట్ కార్న్ తోనే యంగ్ టైగర్ ఉన్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాలి.
ఇక యంగ్ టైగర్ త్వరలోనే తన 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. జూన్ లో రెగ్యలుర్ షూటింగ్ కి వెళ్తారని సమాచారం. ప్రస్తుతం కొరటాల హీరోయిన్ అన్వేషణలో ఉన్నారు. అనూహ్యంగా అలియాభట్ ఎగ్జిట్ అవ్వడంతో కొరటాల అండ్ కో హీరోయిన్ వేట పై దృష్టిసారించాల్సి వచ్చింది.
<p>Buchi Babu</p>
తారక్ ఇమేజ్ కి తగ్గ కొత్త హీరోయిన్ ని వీలైనంత త్వరగా ఎంపిక చేయాలని సీరియస్ గానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ 'కేజీఎఫ్' ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇప్పటికే కాంబినేషన్ సెట్ అయింది. స్ర్కిప్ట్ లాక్ అయింది. పాన్ ఇండియా కేటగిరీలో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
Buchi babu in talks with Allu Arjun
భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గానే తెరకెక్కనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. దాదాపు ఆఏడాదంతా షూట్ ఇతర పనులతోనే సరిపోతుంది. అన్ని అనుకూలంగా ఉంటే ఆ ఏడాది చివర్లో సినిమా రిలీజ్ అవుతుంది. లేదంటే 2024 లోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత 'ఉప్పెన' దర్శకుడి గురించి తారక్ ఆలోచించే అవకాశం ఉంది.
కొరటాల శివ, ప్రశాంత్ నీల్ చిత్రాల పూర్తి అయ్యేవరకు బుచ్చిబాబు ఎదురు చూసినా ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు ఎదురు చూడడం రిస్క్ అని చెప్పాలి. ఆ రెండు చిత్రాల ఫలితం ఆధారంగా ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎంపిక ఉంటుంది. కాబట్టి అప్పటి ఇమేజ్ దృష్టిలో ఉంచుకొని బుచ్చిబాబు మూవీ రిజెక్ట్ చేయవచ్చు. కాబట్టి ప్రస్తుతం ఆయనుకున్న డిమాండ్ ఉపయోగించుకొని అందుబాటులో ఉన్న హీరోలతో సినిమాలు చేసుకొని కెరీర్ నిర్మించుకోవడం బెటర్. అలా కాకుండా సమయం వృధా చేస్తే చివరికి ఏమైనా కావచ్చు.