సల్మాన్ ఖాన్ జోడీగా త్రిష, బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న చెన్నై చిన్నది
హీరోయిన్ గా రీ ఎంట్రీలో దుమ్మురేపుతోంది చెన్నై చిన్నది త్రిష. సౌత్ లో తమిళ, తెలుగు ఆఫర్లు కొట్టేస్తున్న బ్యూటీ.. తాజాగా బాలీవుడ్ నుంచి కూడా కాల్ వచ్చిందట.
Actress Trisha
నాలుగు పదులు వయస్సులో కూడా కుర్ర హీరోయిన్లు కుళ్లుకునేంత అందంగా ఉంది త్రిష. 40 ఏళ్ళు వచ్చినా..వన్నెతరగని అందంతో అద్భుతం చేస్తోంది తమిళ సోయగం. ఇక హీరోయిన్ గా త్రిష పని అయిపోయింది అనుకున్న టైమ్ లో.. తమిళ దర్శకుడు మణిరత్నం చేసిన మ్యాజిక్ పొన్నియన్ సెల్వన్ సినిమాతో మరోసారి ప్రేక్షకులు మనసులు ఆకట్టుకుంది బ్యూటీ.
ఎవరైనా రీ ఎంట్రీ అంటే.. అది కూడా హీరోయిన్లు రీ ఎంట్రీ అంటే.. ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో ఇస్తారు. కాని పొన్నియన్ సెల్వన్ తో రీ ఎంట్రీఇచ్చిన త్రిష.. హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వరుస ఆఫర్లు కూడా సాధిస్తోంది. ఇప్పటికే హీరోయిన్ గా విజయ్ సరసన లియో సినిమాలో నటించి మెప్పించింది బ్యూటీ. తమిళంతో పాటు తెలుగులో కూడా తిరుగులేని సక్సెస్ ను సొంతం చేసుకొని తన ఫామ్ ను తీరిగి తెచ్చుకుంది తమిళ ముద్దుగుమ్మ.
Vijay Sethupathi,Ajith Kumar, Trisha Krishna,Madonna Sebastian
అంతే కాదు తమిళంలో అజిత్ సరసన మరోసినిమా చేస్తున్న త్రిష.. టాలీవుడ్ లో కూడా సీనియర్ మీరోల సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేస్తుందట. బాలకృష్ణ తో పాటు చిరంజీవి సినిమాలకోసం ఈ బ్యూటీని అప్రోచ్ అవుతున్నారట మేకర్స్.. ఇక ఇంకో తాజా విషయం ఏంటంటే.. ఈ భామ బాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది.
Salman Khan
దాదాపు పదమూడు సంవత్సరాల బ్రేక్ తరువాత త్రి హిందీ సినిమాకు ఒకే చేశారని తెలుస్తోంది. ఇక అసలు విషయం ఏంటంటే.. త్రిషకు బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. అది కూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ జోడీగా నటించే ఛాన్స్ వచ్చింది. ఆయన హీరోగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ది బుల్. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించబోతుందని తెలుస్తోంది.
Actor Nagarjuna starrer new film update out Trisha as female lead in Telugu
భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ సినిమాలో త్రిషను దాదాపు ఫిక్స్ చేశారట మేకర్స్. అయితే హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగా.. త్రిష బాలీవుడ్ మూవీస్ చేసింది.అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన కట్టామీటా మూవీ ద్వారా 2010 లో త్రిష బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా..దక్షిణాదిన బిజీగా ఉండటంతో తిరస్కరించింది.
ఇక మళ్ళీ పదమూడేళ్ళ తరువాత హీరోయిన్ గా మరోసారి బాలీవుడ్ వైపు చూసింది బ్యూటీ. ప్రస్తుతం ఆమె వయసు పెరుగుతుండటం.. వచ్చిన గెల్డెన్ ఛాన్స్ లు మిస్ చేసుకోవద్దు అనుకుంటుందట. అందకే స్టార్ హీరోల సరసన ఏ అవకాశాన్ని ఆమె రిజెక్ట్ చేయడం లేదు. అటు బాలీవుడ్.. ఇటు తమిళ, తెలుగుసినిమాలతో త్రిష మళ్లీ బిజీ స్టార్ అవుతోంది.
ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న త్రిష.. అటు బాలీవుడ్లో సైతం సత్తా చాటాలనే ఆలోచనతో ఉందట. సల్మాన్ తో త్రిష చేయబోతున్న సినిమాను కరణ్‌జోహార్ నిర్మిస్తున్నారు. ఇక ఈవీషయం తెలిసి త్రిష అభిమానులు దిల్ కుష్ అవుతున్నారు.